settings icon
share icon
ప్రశ్న

యేసుక్రీస్తు యొక్క (12) మంది శిష్యులు/అపొస్తలులు ఎవరు?

జవాబు


“శిష్యుడు” అనే పదము నేర్చుకొనువాడు లేక అనుసరించువాడు అని సూచించును. “అపొస్తలుడు” అనే పదమునకు అర్థము “బయటకు పంపబడినవాడు.” యేసు భూమిమీద ఉన్నప్పుడు, అతని పండ్రెండు అనుచరులు శిష్యులుగా పిలువ బడిరి. ఆ పండ్రెండు మoది శిష్యులు యేసుక్రీస్తును అనుసరించి, ఆయన నుండి నేర్చుకొని, మరియు ఆయనచే తర్ఫీదు పొందిరి. ఆయన పునరుత్థానము మరియు ఆరోహణ తర్వాత, యేసు ఆయన శిష్యులను ఆయన సాక్షులుగా ఉండుటకు బయటకు పంపెను (మత్తయి 28:18-20; అపొ. 1:8). అప్పుడు వారు పండ్రెండు అపొస్తలులుగా సూచించబడ్డారు. అయితే, యేసు ఇంకను భూమిపై ఉంటుండగా, “శిష్యులు” మరియు “అపొస్తలులు” అనే పదములు కొంతమేరకు మార్చుకోదగినట్లు వాడబడెను.

పండ్రెండు మంది అసలు శిష్యులు/అపొస్తలులు మత్తయి 10:2-4 జాబితాలో ఉండెను, “ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి; అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.” పరిశుద్ధ గ్రంథము పండ్రెండు మంది శిష్యులు/అపొస్తలుల జాబితా మార్కు 3:16-19 మరియు లూకా 6:13-16 లో కూడా చెప్పెను. ఈ మూడు ప్రకరణలను పోల్చిచూస్తే పేర్లలో ఒక రెండు చిన్న వ్యత్యాసాలను చూపును. తద్దయి “యాకోబు సహోదరుడైన యూదా” గా (లూకా 6:16) మరియు లెబ్బయిగా (మత్తయి 10:3) కూడా తెలుపబడెను. జెలోతే అనబడిన సీమోను కనానీయుడైన సీమోనుగా కూడా తెలుపబడెను (మార్కు 3:18). యేసును ద్రోహం చేసిన, యూదా ఇస్కరియోతు, పండ్రెండు మంది అపొస్తలులో మత్తయిచే భర్తీ చేయబడెను (అపొ. 1:20-26 చూడుము). కొంతమంది బైబిలు అధ్యాపకులు మత్తయను ఒక “విలువలలేని” అపొస్తలునిగా చూచి మరియు పౌలు యూదా ఇస్కరియోతుకు పన్నెండవ అపొస్తలునిగా భర్తీచేయుట దేవుని ఎంపిక అని అనుకొనును.

ఆ పండ్రెండు మంది శిష్యులు/అపొస్తలులు దేవుడు అసాధారణ విధానములో వాడుకొన్న సాధారణ పురుషులు. ఆ పండ్రెండు మందిలో, చేపలను పట్టే జాలరులు, ఒక పన్ను వసూలుదారుడు, మరియు ఒక విప్లవాత్మకుడు ఉండెను. సువార్తలు స్థిరమైన ఓటములను, కష్టాలను, మరియు యేసుక్రీస్తును అనుసరించిన ఈ పండ్రెండుమంది పురుషుల అనుమానాలను భద్రపరచెను. యేసు యొక్క పునరుత్థానమును మరియు పరలోకమునకు ఆరోహణను సాక్ష్యమిచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ శిష్యులు/అపొస్తలులను ప్రపంచమును తలక్రిందులు చేసే శక్తివంతమైన దేవుని వ్యక్తులుగా రూపాంతరము చేసెను (అపొ.17:6). ఆ మార్పు ఏమిటి? ఆ పండ్రెండుమంది అపొస్తలులు/శిష్యులు “యేసుతో కూడా ఉండిరి” (అపొ.4:13). మనగూర్చి కూడా అదే విధముగా చెప్పబడును గాక!

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసుక్రీస్తు యొక్క (12) మంది శిష్యులు/అపొస్తలులు ఎవరు?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries