settings icon
share icon
ప్రశ్న

నేను విడాకులు తీసుకొన్నాను. బైబిల్ ప్రకారంగా తిరిగి పెళ్లి చేసుకోవచ్చా?

జవాబు


“ఫలానా మరియు ఫలానా కారణమును బట్టి నేను పరిత్యాగము విడాకులు తీసుకున్నాను” అను ప్రశ్నలను మనం తరచు వింటుంటాము. నేను తిరిగి వివాహము చేసుకొనవచ్చా?” “నేను రెండు మార్లు విడాకులు తీసుకొన్నాను –మొదట నా భాగస్వామి వ్యభిచరించుట వలన, రెండవది పొసగలేక. మూడు మార్లు విడాకులు తీసుకున్న ఒక పురుషునితో నేను కాలాయాపన చేస్తున్నాను –మొదట పొసగలేక, రెండవది, తను వ్యభిచరించుట వలన, మూడవది తన భార్య వ్యభిచరించుట వలన. మేము ఒకరినొకరు పెండ్లి చేసుకొనవచ్చా?” ఇలాటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చాలా కష్టం ఎందుకంటే విడాకులు తరువాత తిరిగి వివాహము చేసికొనుటను గూర్చి బైబిల్ లోతుగా వివరించలేదు.

ఖచ్చితంగా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, వివాహము చేసుకొన్నవారు వివాహ దంపతులు జీవించుకాలం వరకు వివాహంలో నిలిచియుండుటయే దేవుని యొక్క ప్రణాళిక (ఆది. 2:24; మత్తయి. 19:6).విడాకులు తరువాత తిరిగి వివాహము చేసుకొనుటకు కేవలం ఒక ప్రత్యేక అనుమతి ఏంటంటే వ్యభిచారం (మత్తయి. 19:9), మరియు దీని నిమిత్తం క్రైస్తవుల మధ్య కూడా వివాదం ఉంది. మరొకటి చెయ్యి విడచి వెళ్లిపోయినప్పుడు –ఒక అవిశ్వాసియైన భాగస్వామి విశ్వాసియైన భాగస్వామిని విడిచిపెట్టినప్పుడు (1 కొరింథీ. 7:12- 15). ఈ వాక్యభాగము, ప్రత్యేకించి తిరిగి వివాహము చేసికొనుటను గూర్చి చెప్పకపోయినప్పటికీ, కేవలం వివాహంలో బంధం కలిగి జీవించడమే. విడిపోడానికి భౌతిక, లైంగిక, లేదా తీవ్రమైన ఉద్వేగాలపై నిందలు చాలు, కానీ విడాకులు లేదా తిరిగి వివాహము సందర్భాల్లో బైబిల్ ఈ పాపములను గూర్చి మాట్లాడదు.

మనం రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసు. దేవుడు విడాకులను ద్వేషిస్తాడు (మలాకీ 2:16), మరియు దేవుడు దయగలవాడు మరియు క్షమించువాడు. ప్రతి విడాకులు భార్య లేదా భర్త లేదా యిద్దరి ప్రక్క పాప ఫలమే. దేవుడు విడాకులను క్షమిస్తాడా? ఖచ్చితంగా! విడాకులు ఇతర ఏ పాపము కంటే కూడా క్షమించడానికి తక్కువమి కాదు. అన్ని పాపములకు క్షమాపణ క్రీస్తునందు విశ్వాసము ద్వారా దొరుకుతుంది (మత్తయి 26:28; ఎఫెసీ. 1:7). దేవుడు విడాకుల పాపమును క్షమిస్తే, నీవు తిరిగి పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రుడవని అర్థమా? ఖచ్చితం కాదు. దేవుడు కొన్నిసార్లు కొంతమందిని ఒంటరిగా ఉండుటకు పిలుస్తాడు (1 కొరింథీ. 7:7-8). ఒంటరిగా ఉండుట శాపంగా భావించకూడదు లేదా శిక్షగా భావించకూడదు, కానీ దేవుని కొరకు పరిపూర్ణంగా సేవచేయుటకు ఇది అవకాశంగా భావించాలి (1 కొరింథీ. 7:32-36). దేవుని వాక్యము మనకు చెప్తుంది, కామతప్తులగుట కంటే పెండ్లిచేసికొనుట మేలు (1 కొరింథీ. 7:9). బహుశా ఇది కొన్నిసార్లు విడాకులు తరువాత తిరిగి పెండ్లిచేసికొనుటను గూర్చి చెప్పబడుతుంది.

కాబట్టి, నీవు తిరిగి పెండ్లిచేసికొనాలా? మనం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేము. చివరకు, అది నీకు, నీ భాగస్వామికి అతి ప్రాముఖ్యంగా దేవునికి మధ్య. నీకు మేము ఇచ్చే ఒకేఒక సలహా ఏంటంటే దేవుడు ఏమిచేయాలనుకుంటాడో దానిని బట్టి జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి (యాకోబు. 1:5).మనసుతో మరియు నిజాయితీగా ప్రభువు తన చిత్తమును మీ హృదయాలలో పెట్టుటకు ప్రార్థన చేయుడి (కీర్తనలు. 37:4). దేవుని చిత్తము కొరకు ఎదురుచూడండి (సామెతలు 3:5-6) మరియు ఆయన నడిపింపును అనుసరించండి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నేను విడాకులు తీసుకొన్నాను. బైబిల్ ప్రకారంగా తిరిగి పెళ్లి చేసుకోవచ్చా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries