settings icon
share icon
ప్రశ్న

జాతివాదము, పక్షపాతము మరియు వివక్షలను గురించి పరిశుద్ధ గ్రంధము ఏమి చెప్తుంది?

జవాబు


ఈ ప్రశ్నలో మొదటిగా అర్ధం చేసుకొనవలసిన విషయం ఏమంటే అసలు ఉన్నది ఒక జాతే – అదే మానవ జాతి. కాకాసియన్లు, ఆఫ్రికన్లు, ఆసియాన్లు, భారతీయులు, అరబులు మరియు యూదులు అందరు వివిధమైన జాతుల వారు కారు. కాని, వారు మానవ జాతిలోని వివిధ వర్గాలు. మానవులందరికీ ఒకేవిధమైన భౌతిక లక్షణములు ఉంటాయి (బహుశ కొన్ని కొన్ని సూక్ష్మ తేడాలు కూడా ఉంటాయి అనుకోండి!). అతి ప్రాముఖ్యంగా, మానవులు అందరు దేవుని స్వరూపమందు దేవుని పోలికె చొప్పున సృష్టింపబడినవారే (ఆదికాండము 1:26-27). దేవుడు ఈ లోకమును ఎంతగా ప్రేమించాడు అంటే మనకొరకు తన ప్రాణమును అర్పించులాగున యేసును ఈ లోకమునకు పంపాడు (యోహాను 3:16). “లోకము” అనే పదము స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలను కలిగి ఉంటుంది.

దేవుడు పక్షపాతమును లేదా అభిమానమును చూపడు (ద్వితీయోపదేశకాండము 10:17; అపొస్తలుల కార్యములు 10:34; రోమీయులకు 2:11; ఎఫెసీయులకు 6:9), కాబట్టి మనము కూడా చూపకూడదు. “పక్షపాతము గలిగి తీర్పుతీర్చు” వారిని గూర్చి యాకోబు పత్రిక 2:9 మాట్లాడుతుంది. దీనికి బదులు, మనము మన పొరుగువారిని మనవలె ప్రేమింపబద్ధులమైయున్నాము (యాకోబు 2:8). పాతనిబంధనలో, దేవుడు మానవాళిని రెండు “జాతుల” గుంపులుగా విభజించాడు: యూదులు మరియు అన్యులు. యూదుల పక్షముగా వారు యాజకుల రాజ్యముగా, అన్య దేశములకు పరిచారము చేసే వారిగా ఉండాలని ఉద్దేశించాడు. కాని, చాలా వరకు, వారై స్థితిని బట్టి యూదులు గర్విష్టులై అన్యజనులను విస్మరించారు. యేసుక్రీస్తు ఈ ధోరణికి స్వస్తి పలికి, ద్వేషభావమనే ఈ మధ్యగోడను పగులగొట్టాడు (ఎఫెసీయులకు 2:14). జాతివాదము, పక్షపాతము, వివక్షల అన్ని రూపములు సిలువపై క్రీస్తు చేపట్టిన ఆ కార్యమునకు విరోధమైనవి.

యేసు మనలను ప్రేమించినట్లుగానే మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని ఆయన భావిస్తున్నాడు (యోహాను 13:34). ఒకవేళ దేవుడు పక్షపాతియై మనలను ఆ పక్షపాతముతోనే ప్రేమించి ఉంటే, అప్పుడు మనము కూడా ఇతరులను అదే విధమైన ఉన్నత పరిమాణముతో ప్రేమించవలసి ఉండేది. తన సహోదరులలో అల్పులైన వారికి మనము ఏమి చేసినను అది మనము యేసుకే చేస్తున్నామని మత్తయి 25వ అధ్యాయములో యేసు చెప్పాడు. ఒకవేళ వ్యక్తిని ఈర్ష్యభావముతో చూస్తే, దేవుని పోలికెలో సృష్టింపబడిన వ్యక్తి పట్ల మనము తప్పుగా ప్రవర్తిస్తున్నాము; దేవుడు ప్రేమిస్తున్న మరియు తనకొరకు యేసు మరణించిన ఒకనిని మనము బాధపెడుతున్నాము.

వేలకొలది సంవత్సరాలుగా జాతివాదము, అనేక రూపములలో అనేక పరిమాణములలో, మానవజాతిపై ఒక తెగులుగా ఉంటుంది. అన్ని వర్గాలకు చెందిన సహోదరీసహోదరులారా, ఇలా జరుగకూడదు. జాతివాదము, పక్షపాతము, మరియు వివక్షల యొక్క బాధితులు క్షమించాలి. ఎఫెసీయులకు 4:32వ వచనము, “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” అని వెల్లడిచేస్తుంది. జాతివాదులు నీ క్షమాపణకు అర్హులు కాలపోవచ్చు, కాని దాని కంటే ఎక్కువగానే మనము దేవుని క్షమాపణకు అర్హులము కామే. జాతివాదము, పక్షపాతము, మరియు వివక్షలను పాటించువారు పశ్చాత్తాప పడాలి. “మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమానుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి” (రోమీయులకు 6:13). “ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు” (గలతీయులకు 3:28) అనే వాక్యము పరిపూర్ణముగా గ్రహింపబడును గాక.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

జాతివాదము, పక్షపాతము మరియు వివక్షలను గురించి పరిశుద్ధ గ్రంధము ఏమి చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries