settings icon
share icon
ప్రశ్న

శ్రమల కాలమునకు సంబంధించినంత వరకు ఈ ఎత్తబడుట అనునది ఎప్పుడు సంభవిస్తుంది?

జవాబు


శ్రమల కాలమునకు సంబంధించినంత వరకు ఎత్తబడుట అనుంది ఎప్పుడు సంభవిస్తుందో అనే విషయము నేటి సంఘములో చాలా వివాదాస్పదమైన విషయము. ప్రధానమైన మూడు వ్యూహములు ఏవనగా శ్రమల-పూర్వము (అంటే శ్రమల కాలమునకు మునుపే ఈ ఎత్తబడుట ఉంటుందని చెప్పే ఆలోచన), శ్రమల-మధ్య (అనగా శ్రమల కాలమునకు మధ్యలో లేదా మధ్యభాగమున ఎత్తబడుట ఉంటుందని చెప్పే ఆలోచన), మరియు శ్రమల-తరువాయి (అనగా శ్రమల కాలమునకు తరువాత ఈ ఎత్తబడుట ఉంటుందని చెప్పే ఆలోచన). నాలుగవ ఆలోచన కూడా ఉంది, దీనినే ఉగ్రత-పూర్వము అంటారు, ఇది శ్రమల-మధ్య వాదానికి కొంత మార్పు చేయబడిన వ్యూహము.

మొదటిగా, శ్రమల కాలమునకు గల ఉద్దేశమును ముందుగా గుర్తించాలి. దానియేలు 9:27 ప్రకారముగా, డెబ్బయవ “ఏడు” (ఏడు సంవత్సరములు) ఉంది, అది ఇంకా రానైయుంది. డెబ్బది ఏడులను గూర్చి దానియేలు చేసిన ప్రవచనమంతయు (దానియేలు 9:20-27) ఇశ్రాయేలు దేశమును గూర్చి మాట్లాడుతుంది. దేవుడు తన దృష్టిని ప్రత్యేకముగా ఇశ్రాయేలుపై ఉంచే ఒక కాలగమనము ఇది. డెబ్బయవ ఏడు, అనగా శ్రమల కాలము, దేవుడు ప్రత్యేకముగా ఇశ్రాయేలు దేశమును గూర్చి కార్యము చేసే కాలముగానే ఉంది. ఈ కాలములో సంఘము అక్కడ ఉండదు అని ఈ వాదము చెప్పకపోతున్నప్పటికీ, ఈ కాలములో సంఘము అనునది అసలు ఈ భూమిపై ఉండవలసిన అవసరత ఏమిటి అనే ప్రశ్నను మాత్రము ఇది కలిగిస్తుంది.

ఎత్తబడుటను గూర్చిన ప్రధానమైన వాక్యభాగము 1 థెస్సలొనీకయులకు 4:13-18లో ఉంది. సజీవులైన విశ్వాసులందరూ, అంటే మరణించిన విశ్వాసులందరితో కలిసి, మధ్యాకాశములో ప్రభువును కలుసుకొని నిత్యమూ ఆయనతో ఉంటారు అని ఈ వాక్యభాగము తెలుపుతుంది. కొన్ని వచనముల తరువాత, 1 థెస్సలొనీకయులకు 5:9లో, “ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమించలేదు” అని పౌలు అంటాడు. శ్రమల కాలము యొక్క సమయమును గూర్చి ప్రధానంగా చర్చించే ప్రకటన గ్రంధము ఈ శ్రమల కాలములో దేవుడు ఈ భూమిపై తన ఉగ్రతను ఎలా క్రుమ్మరిస్తాడో అనే విషయాలపై మాట్లాడే ఒక ప్రవచనా సందేశము. విశ్వాసులు ఉగ్రతను అనుభవించరు అని ప్రభువు చెప్పి శ్రమల కాలములో సంభవించే ఉగ్రతను అనుభావించులాగున వారిని ఈ భూమిపైనే వదిలి వేయుట అనునది దేవుని వాగ్దానమునకు అసంగతమైనది. ఈ భూమిపై నుండి తన ప్రజలను తొలగించిన తరువాత ఉగ్రత నుండి క్రైస్తవులను విడిపిస్తానని దేవుడు చేసిన వాగ్దానము ఈ రెండు సంఘటనలను సరిగా సమన్వయపరుస్తుంది.

ఎత్తబడుట యొక్క సమయమును గూర్చి ప్రస్తావించే మరొక ప్రధానమైన వాక్యభాగము ప్రకటన 3:10, ఈ భూమిమీదికి రాబోయే “శోధనకాలములో” విశ్వాసులందరినీ విడిపిస్తానని క్రీస్తు ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు. దీనికి రెండు విధాల అర్ధములు ఉండవచ్చు. శ్రమల కాలములో క్రీస్తు విశ్వాసులను కాపాడతాడు, లేదా ఈ శ్రమలకు లోనవకుండానే వారిని విడిపిస్తాడు అని. “నుండి” అని అనువదించబడిన గ్రీకు పదమునకు ఈ రెండు అర్ధములు తగినవిగానే ఉన్నాయి. అయితే విశ్వాసులు దేనినుండి కాపాడబడతారో అనే విషయమును కూడా గుర్తించడం చాలా ప్రాముఖ్యం, అది కేవలం శోధనల నుండి మాత్రమే కాదు, కాని “శోధనకాలము” నుండి. శోధనలను, అనగా శ్రమలను కలిగియుండే ఆ సారిన కాలమునుండే విశ్వాసులను కాపాడుతానని క్రీస్తు ఇక్కడ వాగ్దానమిస్తున్నాడు. శ్రమల కాలము యొక్క ఉద్దేశము, ఎత్తబడుట యొక్క ఉద్దేశము, 1 థెస్సలొనీకయులకు 5:9 యొక్క అర్ధము, ప్రకటన 3:10 యొక్క విశదము ఇవన్నియు శ్రమల-పూర్వము అనే వాదనకే ఎక్కువ మొగ్గు చూతున్నాయి. పరిశుద్ధ గ్రంధము అక్షరసత్యముగాను మరియు స్థిరముగాను వివరించబడినట్లయితే, శ్రమల-పూర్వము అనే వాదనే అత్యంత లేఖన-ఆధారితముగా ఉన్న విశదముగా అగుపడుతుంది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

శ్రమల కాలమునకు సంబంధించినంత వరకు ఈ ఎత్తబడుట అనునది ఎప్పుడు సంభవిస్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries