settings icon
share icon
ప్రశ్న

పాపము యొక్క నిర్వచనము ఏమిటి?

జవాబు


పరిశుద్ధ గ్రంధములో పాపము దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించుట (1 యోహాను 3:4) మరియు దేవునిపైన తిరుగుబాటు చేయుట (ద్వితీయోపదేశకాండము 9:7; యెహోషువ 1:18) అని వివరించబడింది. పాపము లూసిఫారులో, అంటే దేవదూతలన్నిటిలో బహుశ అత్యంత సుందరమైన మరియు శక్తివంతమైన దూతలో, తన ఆరంభమును కలిగి ఉంది, తన స్థితియందు సంతృప్తి చెందక, దేవునికంటే ఉన్నతమైన స్థానాన్ని పొందాలని ఆశించింది, మరియు అదే తన పతనమునకు దారితీసింది, ఇదే పాపమునకు ఆరంభము (యెషయా 14:12-15). సాతానుగా పేరు మార్చబడి, ఏదేను తోటలో ఆదాము హవ్వలను “మీరు దేవతలవలె ఉందురు” అనే ఆశతో వారిని శోధించి, తద్వారా మానవ జాతి అంతటికి పాపమును తెచ్చింది. ఆదాము మరియు హవ్వలు దేవునికిని మరియు ఆయన యొక్క ఆజ్ఞకును వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుటను ఆదికాండము 3వ అధ్యాయము వివరిస్తుంది. ఆ సమయము నుండి, మానవాళి యొక్క సకల వంశముల ద్వారా పాపము కొనసాగింపబడుతూనే వస్తుంది మరియు ఆదాము సంతానమైన మనము ఆ పాపమును ఆయననుండే వారసత్వముగా పొందియున్నాము. రోమీయులకు 5:12 ప్రకారముగా ఆదాము ద్వారా పాపము లోకములో ప్రవేశించింది, మరియు తద్వారా మరణము కూడా మానవుల అందరికి ఇవ్వబడింది ఎందుకంటే “పాపమునకు కలుగు జీతము మరణము” (రోమీయులకు 6:23).

ఆదాము ద్వారా పాపము చేయుటకు మానవునిలో ఉన్న తదైక నైజము మానవ జాతిలోనికి ప్రవేశించింది, మరియు సహజత్వములో మానవులు పాపులుగా చేయబడ్డారు. ఆదాము పాపము చేసినప్పుడు, తిరుగుబాటు అనే తన పాపము ద్వారా తన అంతరంగ స్వభావము మార్పు చెందింది, తద్వారా ఆత్మ సంబంధమైన మరణమునకు మరియు తన తరువాత పుట్టబోయే ప్రతియొక్క మానవునికి సంప్రాప్తించినటువంటి నాశనత్వమునకు ఆయనను నడిపించింది. మనము పాపము చేస్తున్నాము గనుక మనము పాపులము కాము; కాని, మనము పాపులము గనుక మనము పాపము చేస్తున్నాము. ఇలా వారసత్వముగా అందించబడిన ఈ నాశనత్వమునే వారసత్వ పాపము అని పిలుస్తాము. మనత ల్లిదండ్రుల నుండి మనము ఏ విధముగా కొని భౌతికమైన గుణములను వారసత్వముగా పొందుకుంటామో, ఆదాము నుండి మనము ఈ పాప స్వభావమును వారసత్వముగా పొండుకున్నాము. రాజైన దావీదు మానవ జాతి యొక్క ఈ పతన స్థితిని గూర్చి కీర్తన 51:5లో ప్రలాపిస్తూ: “నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను” అని అంటున్నాడు.

రెండవ రకమైన పాపమును ఆపాదించబడిన పాపము అని అంటారు. ఆర్ధిక మరియు న్యాయ వ్యవస్థలలో ప్రయోగించే పరిభాషయైన ఈ పదము, “ఆపాదించబడుట” అని అనువదించబడే గ్రీకు పదమునకు అర్ధము “ఒకరికి చెందిన ఒక వస్తువును తీసుకొని మరొకరి ఖాతాలో జమ చేయుట” అని. మోషే యొక్క ధర్మశాస్త్రము ఇవ్వబడక మునుపు, వారసత్వ పాపము వలన మానవులు పాపులుగా ఉన్నప్పటికీ, పాపము మానవునికి ఆపాదించబడలేదు. ధర్మశాస్త్రము ఇవ్వబడిన తరువాత, ధర్మశాస్త్రమునకు విరోధముగా చేయబడిన పాపములన్ని మానవునికి ఆపాదించబడ్డాయి (ఖాతాలో జమచేయబడ్డాయి) (రోమీయులకు 5:13). ధర్మశాస్త్రము యొక్క అతిక్రమము ఆపాదించబడుటకు మునుపే, పాపమునకు వచ్చే తుది శిక్ష (మరణము) పరిపాలన చేయుచు వచ్చింది (రోమీయులకు 5:14). ఆదాము నుండి మోషే వరకు ఉన్న మానవులందరూ మరణమునకు లోనగువారిగా ఉన్నారు, మోషే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా వారు చేసిన పాపకార్యముల వలన కాదు (ఎందుకంటే వారికి ధర్మశాస్త్రము ఇంకా ఇవ్వబడలేదు), కాని వారి సొంత వారసత్వ పాపస్వభావము వలననే. మోషే తరువాత, ఆదాము నుండి మానవులు పొందిన ఈ వారసత్వ పాపము వలనను అలాగే దేవుని ఆజ్ఞలను అతిక్రమించుట వలన వచ్చే ఆపాదించబడిన పాపము వలనను కూడా మానవులు మరణమునకు లోనగుతున్నారు.

విశ్వాసుల యొక్క పాపమును ఆ పాపమునకు జీతమైన మరణమును సిలువలో పొందినటువంటి యేసుక్రీస్తు యొక్క ఖాతాలో జమ చేయుట ద్వారా, దేవుడు ఆపాదించబడు అనే నియమమును మానవుల మేలు కొరకే ఉపయోగించాడు. మన పాపములను యేసుకు ఆపాదించుట ద్వారా, యేసు అసలు పాపి కాకున్నను ఒక పాపిగానే దేవుడు పరిగణించి, సర్వలోకము యొక్క పాపమును బట్టి ఆయన మరణించునట్లు ఆయనను చేసాడు (1 యోహాను 2:2). పాపము ఆయనకు ఆపాదించబడింది అనే విషయమును అర్ధముచేసుకోవడం చాలా ప్రాముఖ్యం, కాని దానిని ఆయన ఆదాము నుండి వారసత్వముగా పొందలేదు. పాపము యొక్క శిక్షను ఆయన భరించాడు, కాని ఆయన ఎన్నడు పాపిగా అవ్వలేదు. తన యొక్క పరిశుద్ధమైన మరియు పరిపూర్ణమైన స్వభావము పాపము ముట్టలేనిదిగా ఉంది. ఆయన పాపమునే అసలు చేయకపోయినా, మానవాళి అంతటి ద్వారా చేయబడిన పాపములు ఆయనే చేసినట్టుగా పరిగణించబడ్డాడు. దీనికిప్రతిగా, క్రీస్తు యొక్క నీతిని దేవుడు విశ్వాసులకు ఆపాదించి తన నీతిచే తమ ఖాతాలను, మన పాపములను క్రీస్తు యొక్క ఖాతాకు జమచేసినట్లుగానే, జమచేసాడు (2 కొరింథీయులకు 5:21).

మూడవ రకమైన పాపము వ్యక్తిగత పాపము, ప్రతియొక్క మానవుని ద్వారా ప్రతిరోజు కూడా చేయబడేదే ఈ పాపము. ఆదాము నుండి మనము పాప స్వభావమును వారసత్వముగా పొందాము గనుక, మనము వ్యక్తిగత, సొంత పాపములను, అంటే తెలియక చెప్పే అబద్ధముల నుండి తెలిసి చేసే హత్యల వరకు, చేస్తుంటాము. యేసుక్రీస్తులో తమ విశ్వాసమును ఉంచని వారు ఈ వ్యక్తిగత పాపములకు, అలాగే వారసత్వ మరియు ఆపాదించబడిన పాపములకు కూడా జీతమును చెల్లించక తప్పాడు. కాని, పాపము యొక్క నిత్యజీతమైన నరకము మరియు ఆత్మీయ మరణముల నుండి విశ్వాసులు విడిపించబడ్డారు, అయితే పాపమును ఎదిరించుటకు కూడా మనకు ఇప్పుడు శక్తి ఉంది. వ్యక్తిగతమైన పాపమును చేయాలా వద్దా అని ఇప్పుడు మనము నిశ్చయించుకోగలము ఎందుకంటే మనలో జీవిస్తూ, మనలను పవిత్ర పరుస్తూ, మనము పాపములను చేసినప్పుడువాటిని బట్టి మనలను ఒప్పించే (రోమీయులకు 8:9-11) పరిశుద్ధాత్మ వలన ఎదురించే శక్తి మనకు ఉన్నది గనుక. దేవుని యెదుట మన వ్యక్తిగత పాపములను మనము ఒప్పుకొని వాటిని బట్టి ఆయన దగ్గర క్షమాపణ వేడుకొంటే, పరిపూర్ణమైన సహవాసమునకు మరియు ఆయనతో ఒక సాన్నిహిత్యానికి మనము తిరిగి చేర్చబడతాము. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9).

వారసత్వ పాపమువలనను, ఆపాదించబడిన పాపము వలనను, వ్యక్తిగత పాపము వలనను మనము ముమ్మారు శిక్షావిధిలో ఉన్నవారము. ఈ పాపము అంతటి యొక్క న్యాయమైన శిక్ష ఏమంటే మరణమే (రోమీయులకు 6:23), కేవలము భౌతికమైన మరణమే కాక నిత్య మరణము (ప్రకటన 20:11-15). హమ్మయ్య, వారసత్వ పాపము, ఆపాదించబడిన పాపము మరియు వ్యక్తిగత పాపము అన్నియు యేసు యొక్క సిలువలో సిలువ వేయబడ్డాయి, మరియు ఇప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా “ఆయన కృపామహదైశ్వర్యమును బట్టి యేసుక్రీస్తు రక్తమువలన మనకు విమోచనము కలుగుచున్నది” (ఎఫెసీయులకు 1:7).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పాపము యొక్క నిర్వచనము ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries