బైబిలు కేనానును (కొలమానము)ఎప్పుడు, ఎలా సమకూర్చారు?ప్రశ్న: బైబిలు కేనానును (కొలమానము)ఎప్పుడు, ఎలా సమకూర్చారు?

జవాబు:
“కేనాను” అను పదమును దైవికప్రేరేపణచేత రచించిన బైబిలు పుస్తకములకు వుపయోగించే పదము. బైబిలు ఒక పుస్తకముల పట్టీని ఇవ్వరు కాబట్టి బైబిలు కేనాను లేక కొలమానమును నిర్థారించుట కష్టము అవుతుంది. బైబిలు కొలమానము ప్రక్రియను మొట్టమొదటిగా యూదా రబ్బీలు మరియు పండితులు నిర్వహించారు. ఆ తర్వాత ఆదిమ శతాబ్ధపు క్రైస్తవులు దానిని అనుకరించారు, అయితే , బైబిలుకెనానులో ఏ పుస్తకాలుండాలో నిర్ణయించింది అంతిమంగా దేవుడే. లేఖనములలోని ఒక గ్రంధంను దేవుడే ప్రేరేపించి రచించిన క్షణమునుండి అది కెనానుకు చెందినది. అది దేవుడు తన మానవ అనుచరులను ఒప్పించటం ద్వారా ఏ పుస్తకాలు బైబిలులో చేర్చాలో నిర్ణయించుటయే.

క్రొత్తనిబంధనతో పోల్చినట్లయితే పాతనిబంధన కెనాను విషయంలో కంటె తక్కువ సమస్యలు వున్నాయి. వివాదస్పదమైనది. హెబ్రి విశ్వాసులు దేవుని వర్తమానికులను గుర్తించి వారి రచనలను దైవిక ప్రేరణని గుర్తించారు. పాతనిబంధన కెనాను విషయంలో కొన్ని పుస్తకములు చర్చకు గురి అయినప్పటికి క్రీస్తు శకము 250 నాటికి హెబ్రూ కెనాను సార్వత్రిక అంగీకారమును పొందినది. అయితే కేవలం అపొక్రిఫ మాత్రమే నేటికి చర్చనీయాంశమైనది. అతి ఎక్కువ హెబ్రూ పండితులు అపొక్రిఫను మంచి చరిత్ర మరియు మత పరమైన పత్రము అని అంగీకరిస్తారు కాని మిగిలిన హెబ్రూ లేఖనములకు సమానమైన వాటివిగా కాదు.

క్రొత్త నిబంధన గ్రంధముల గుర్తింపు మరియు సేకరణ ప్రక్రియ మొదటి శతాబ్ధపు సంఘములో ఆరంభమయ్యింది. తొలి దినములలోనే కొన్ని నూతన నిబంధన పుస్తకములు గుర్తించబడ్డాయి. పౌలు లూకా వ్రాసిన గ్రంధములను పాతనిబంధన వలె అధికారపూర్వకమైనదని గుర్తించాడు (1 తిమోతి 5:18; మరియు చూడండి ద్వితియోపదేశకాండం 25:4 మరియు లూకా 10:7). పేతురు పౌలు రచనలను లేఖనములుగా గుర్తించారు (2పేతురు 3:15-16). క్రొత్తనిబంధనలోని కొన్ని పుస్తకాలను వేర్వేరు సంఘాలకు పంపిణీ చేసారు (కొలొస్సీయులకు 4:16; 1 ధెస్సలోనికయులకు 5:27). రోమాకు చెందిన క్లెమెంట్ క్రొత్టనిబంధనలోని పుస్తకాలగురించి ప్రస్తావించాడు (క్రీ.శ 95). అంతియొకయకు చెందిన ఇగ్నేషియస్ ఏడు పుస్తాకాలను గుర్తించాడు (క్రీ.శ 115).అపోస్తలుడైన యోహాను శిష్యడైన పాలికార్ప్ 15 పుస్తాకాలను అంగీకరించాడు (క్రీ.శ 108).ఆ తర్వాత ఇరేనియస్ 21 పుస్తకాలను (క్రీ.శ 185) ప్రస్తావించాడు. హిప్పోపొలిటస్ 22 పుస్తకాలను గుర్తించాడు. క్రొత్తనిబంధనలోని అతి ఎక్కువ వాదనకు గురియైన పుస్తకాలు హెబ్రీయులు, యాకోబు, 2 పేతురు, 2యోహాను మరియు 3యోహాను.

క్రీ.శ 170లో సమకూర్చబడిన మ్యురెటోరియన్ "కెనాన్" బైబిలు కొలమానములో తొలిది. మ్యురెటోరియన్ కెనాన్ నూతన నిబంధనలోని హెబ్రీయులకు, యాకోబు, మరియు 3 యోహాను పత్రిక తప్పించి మిగిలిన పుస్తకాలను చేర్చింది. క్రిస్తు శకము 363, లవోదికయ కౌన్సిల్ కేవలము పాతనిబంధన (అపొక్రిఫతో కలిపి) మరియు క్రొత్తనిబంధనలోని 27 పుస్తకాలు మాత్రమే సంఘాలలో చదవాలని నిర్ణయించింది. హిప్పో కౌన్సిల్ (క్రీ శ.393)మరియు కార్థేజ్ కౌన్సిల్ ఈ 27 పుస్తకాలు అధికపూర్వకమని ధృవీకరించాయి.

ఈ కౌన్సిల్స్ అన్నియుకూడ ఓ క్రొత్తనిబంధనపుస్తకం పరిశుధ్ధాత్మచేత ప్రేరేపించబడిందా లేదా అని నిర్థారించడానికి కొన్ని నియమాలు అనుసరించారు: 1)గ్రంధకర్త అపోస్తలులుడయి వుండాలి, లేదా అపోస్తలులయొక్క సన్నిహిత సంభంది అయివుండాలి. 2). ఈ పుస్తకమును క్రీస్తు సంఘం అంగీకరించిదా లేదా. 3). ఈ పుస్తకములోని సిద్దాంతములు ఒకే రీతిగా సాంప్రాదాయభోధనకు సిధ్దముగానున్నదా లేదా? 4) . ఆ పుస్తకము ఉన్నతమైన నైతిక మరియు ఆత్మీయ విలువలు , పరిశుధ్దాత్ముని యొక్క క్రియను ప్రతిబింబిస్తూ సాక్ష్యర్థ్యంగా వున్నదా లేదా? కెనాను నిర్థారించినది సంఘంకాదు అన్న ప్రాముఖ్యమైన అంశాన్ని గుర్తించుకోవాలి. ఏ అదిమ సంఘ కౌన్సిల్ కూడ కెనానును నిర్థారించలేదు. దేవుడు , కేవలము దేవుడే బైబిలులో ఏ పుస్తకాలుండాలో నిర్థారించాడు. తాను ముందుగా నిర్థారించిన విషయాలను దేవుడు తన అనుచరులకు అందించాడు. బైబిలు పుస్తకాలను సమకూర్చే మానవ ప్రక్రియలో తప్పులున్నప్పటికి దేవుడు తన సార్వ భౌమత్వాన్ని బట్టి మానవ అఙ్ఞానాన్ని , మొండితనాన్ని పక్కకు బెట్టి ఆదిమ సంఘం చేత పంపబడిన పుస్తకాలను గుర్తించుటలో సహాయపడ్డాడు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బైబిలు కేనానును (కొలమానము)ఎప్పుడు, ఎలా సమకూర్చారు?