ప్రశ్న
బైబిల్ ప్రేరితమైనది అంటే అర్థం ఏమిటి?
జవాబు
బైబిల్ ప్రేరితమైనది అని ప్రజలు మాట్లాడునప్పుడు అర్థం ఏమిటంటే, లేఖనముల యొక్క మానవ రచయితలను దేవుడు ఎంతగా ప్రేరేపించాడంటే వారు వ్రాసిన ప్రతిది దేవుని వాక్యమైయుందని వారు సూచిస్తున్నారు. లేఖనముల యొక్క సందర్భంలో, “ప్రేరితము” అనగా “దేవుని-శ్వాశ” అని అర్థం. ప్రేరితము అనగా బైబిల్ నిజముగా దేవుని వాక్యము మరియు అది బైబిల్ ను ఇతర పుస్తకాలన్నిటిలో విశేషముగా చేస్తుంది.
బైబిల్ ఎంతగా ప్రేరేపితమైనది అనుటను గూర్చి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ, బైబిల్ లోని ప్రతి భాగములోని ప్రతి మాట దేవుని నుండి వచ్చెనని బైబిల్ స్వయంగా దావా చేస్తుంది అనుటలో ఎలాంటి సందేహము లేదు (1 కొరింథీ. 2:12-13; 2 తిమోతి 3:16-17). లేఖనముల యొక్క అభిప్రాయమును “మాటల సమగ్ర” ప్రేరితముగా సంబోధిస్తారు. అనగా ప్రేరితము ప్రతి శబ్దమునకు చెందుతుంది (మాటలు)-కేవలం అంశాలు మరియు ఆలోచనలకు మాత్రమే కాదు-మరియు ప్రేరితము లేఖనములో అన్ని భాగములకు మరియు లేఖనములో ప్రతి అంశమునకు (సమగ్రము) వర్తిస్తుందని అర్థము. బైబిల్ లో కొన్ని భాగములు మాత్రమే ప్రేరితమని, లేక మతమును గూర్చి మాట్లాడు ఆలోచనలు మరియు అంశములు మాత్రమే ప్రేరితమని కొందరు నమ్ముతారు, అయితే ప్రేరితమును గూర్చి ఈ అభిప్రాయాలు బైబిల్ యొక్క సొంత వాదనలకు విరోధంగా ఉన్నాయి. పూర్ణ మాటల సమగ్ర ప్రేరితము దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యమైన గుణము.
ప్రేరితము యొక్క పరిణామము 2 తిమోతి 3:16లో స్పష్టముగా చూడవచ్చు, “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.” దేవుడు లేఖనమంతటిని ప్రేరేపించాడని మరియు అది మనకు లాభదాయకమని ఈ వచనాలు చెబుతున్నాయి. మత సిద్ధాంతములను గూర్చి మాట్లాడు బైబిల్ లోని కొన్ని భాగములు మాత్రమే ప్రేరితమైనవి కావు, ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథము వరకు ప్రతి మాట ప్రేరితమైనదే. అది దేవునిచే ప్రేరితమైనది కాబట్టి, సిద్ధాంతమును స్థాపించు విషయంలో లేఖనములు అధికారికమైనవి, మరియు దేవునితో సరైన అనుబంధంలో ఎలా ఉండాలో బోధించుటకు అవి సరిపోతాయి. బైబిల్ వాదనలు కేవలం దైవ ప్రేరితం మాత్రమే కాదు, మనలను మార్చుటకు మరియు “పూర్ణులను” చేయుటకు దానిలో అద్భుత శక్తి ఉన్నది. ఇంతకంటే ఎక్కువ మనకు ఏమి కావాలి?
లేఖనముల ప్రేరితమును గూర్చి మాట్లాడు మరొక లేఖన భాగము 2 పేతురు 1:21. వేర్వేరు వ్యక్తిత్వాలు మరియు రచనా శైలిలు కలిగిన పురుషులను దేవుడు ఉపయోగించినప్పటికీ, వారు వ్రాసిన మాటలకు దేవుడు స్వయంగా దైవిక ప్రేరణ ఇచ్చాడని అర్థం చేసుకొనుటలో ఈ వచనములు మనకు సహాయం చేస్తాయి. యేసు ఈ మాటలు చెప్పినప్పుడు స్వయంగా లేఖనముల యొక్క మాటల సమగ్ర ప్రేరితమును నిర్థారించాడు, “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” (మత్తయి 5:17-18). ఈ వచనములలో, యేసు లేఖనముల యొక్క ఖచ్చితత్వమును ఒత్తులలోను పొల్లులలోను నిర్థారిస్తున్నాడు, ఎందుకంటే అది స్వయంగా దేవుని వాక్యము.
లేఖనములు ప్రేరిత దేవుని వాక్యము కాబట్టి, అవి తప్పులు లేనివని మరియు అధికారికమైనవని మనం నిర్థారించవచ్చు. దేవుని గుర్చిన సరైన అభిప్రాయం ఆయన వాక్యమును గూర్చిన సరైన అభిప్రాయములోనికి నడిపిస్తుంది. ఎందుకంటే దేవుడు సర్వశక్తిగలవాడు, సర్వజ్ఞాని, మరియు సర్వసిద్ధుడు కాబట్టి, ఆయన వాక్యము కూడా స్వాభావికముగా అవే గుణములు కలిగియుంటుంది. లేఖనముల యొక్క ప్రేరితమును స్థాపించు వచనములే దాని అధికారమును మరియు సత్యమును స్థాపిస్తాయి. ఏ సందేహము లేకుండా బైబిల్ ఏమి వాదిస్తుందో అది అలానే ఉంది-మానవాళి కొరకు కాదనలేని, అధికారికమైన దేవుని వాక్యము.
English
బైబిల్ ప్రేరితమైనది అంటే అర్థం ఏమిటి?