ప్రశ్న
బైబిల్ నేటికి ఔచిత్యం కలిగినదేనా?
జవాబు
“ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది” అని హెబ్రీ. 4:12 చెబుతుంది. బైబిల్ సుమారుగా 1900 సంవత్సరాల ముందు ముగించబడినప్పటికీ, నేటికి దాని ఖచితత్వము మరియు ఔచిత్యం మారనిదిగా ఉంది. తనను గూర్చి మరియు మానవాళి కొరకు తన ప్రణాళికను గూర్చి దేవుడిచ్చిన ప్రత్యక్షతకు ఏకైక నిధి బైబిల్.
వైజ్ఞానిక పరిశోధనలు మరియు పరిశీలనల ద్వారా నిర్థారించబడిన ప్రాకృతిక ప్రపంచమును గూర్చిన గొప్ప సమాచారం బైబిల్ లో ఉంది. లేవీ. 17:11; ప్రసంగి 1:6-7; యోబు 36:27-29; కీర్తనలు 102:25-27 మరియు కొలస్సి. 1:16-17 దీనిలో కొన్ని లేఖన భాగములు. మానవాళి కొరకు దేవుని విమోచన ప్రణాళికను గూర్చి బైబిల్ కథ విప్పబడుచుండగా, అనేక స్వభావాలు వివరంగా వర్ణించబడ్డాయి. ఆ వర్ణనలలో, మానవ స్వభావము మరియు ధోరణి గూర్చి చాలా సమాచారమును బైబిల్ ఇస్తుంది. ఏ సైకాలజీ పుస్తకములో లేనంతగా మానవ పరిస్థితిని గూర్చి ఈ సమాచారం ఖచ్చితమైనది మరియు వివరణాత్మకమైనది అని మన అనుదిన అనుభవాలు తెలియజేస్తాయి. బైబిల్ లో లిఖించబడిన అనేక చారిత్రక సత్యములు బైబిల్ వెలుపల ఉన్న ఆధారాలు కూడా నిర్థారిస్తాయి. అవే సన్నివేశములను గూర్చి బైబిల్ కథనములు మరియు బైబిల్ వెలుపల కథనములు అంగీకారం తెలుపుతాయని చారిత్రక పరిశోధనలు వెల్లడి చేసాయి.
అయితే, బైబిల్ ఒక చారిత్రక పుస్తకము కాదు, సైకాలజీ పుస్తకము కాదు, లేక వైజ్ఞానిక సంపుటి కూడా కాదు. బైబిల్ దేవుని గూర్చి, మానవాళి పట్ల ఆయన ఆశలు మరియు ప్రణాళికలను గూర్చి ఆయన ఇచ్చిన వివరణ. పాపము ద్వారా దేవుని నుండి మన ఎడబాటు మరియు సిలువలో తన కుమారుడైన యేసు క్రీస్తు బాలి ద్వారా తనతో మన సహవాసమును పునరుద్ధరించుటకు దేవుని యొక్క సహాయమును గూర్చిన కథ ఈ ప్రత్యక్షత యొక్క ముఖ్యమైన భాగము. మన విమోచన అవసరత మారదు. మనలను సమాధానపరచాలనే దేవుని ఆశ కూడా మారదు.
బైబిల్ లో సాంగత్యము కలిగిన ఖచితమైన గొప్ప సమాచారం ఉంది. బైబిల్ యొక్క అతి ప్రాముఖ్యమైన సందేశం-విమోచన-సార్వత్రికంగా మరియు శాశ్వతంగా మానవాళికి వర్తిస్తుంది. దేవుని వాక్యము ఎన్నడు పాతబడిపోదు, అధిగమించబడదు, లేక అభివృద్ధి చేయబడదు. సంస్కృతులు మారతాయి, నియమాలు మారతాయి, తరాలు వచ్చి పోతాయి, కాని దేవుని వాక్యము వ్రాయబడినప్పుడు ఎంత ఔచిత్యము కలిగియున్నదో నేడు కూడా అంతే ఔచిత్యం కలిగియుంది. లేఖనమంతా నేడు మనకు వర్తించకపోయినప్పటికీ, నేడు మన జీవితాలలో మనం అన్వయించవలసిన సత్యము లేఖనములలో ఉంది.
English
బైబిల్ నేటికి ఔచిత్యం కలిగినదేనా?