ప్రశ్న
క్రైస్తవ బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు
క్రైస్తవ బాప్తిస్మము యేసు సంఘము కొరకు స్థాపించిన రెండు సంస్కరణలలో ఒకటి. యేసు ఆరోహణమగుటకు ముందు, ఇలా చెప్పెను, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను” (మత్తయి 28:19–20). యేసు వాక్యమును బోధించు, శిష్యులను చేయు, మరియు శిష్యులకు బాప్తిస్మము ఇచ్చు బాధ్యత సంఘము మీద ఉన్నదని ఈ హెచ్చరికలు తెలియజేస్తున్నాయి. “యుగాంతము వరకు” ఈ పనులు అన్ని చోట్ల (“సమస్త జాతులలో”) చేయబడవలెను. కాబట్టి, వేరే ఏ కారణం లేకపోయినా యేసు ఆజ్ఞాపించెను గనుక బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది.
సంఘ స్థాపనకు ముందే బాప్తిస్మమును పాటించేవారు. పురాతన కాలములోని యూదులు అన్యులను తమలో చేర్చుకొనుటకు “శుద్ధీకరణగా” వారికి బాప్తిస్మము ఇచ్చేవారు. ప్రభువునకు మార్గము సరాళము చేయుటకు బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మమును ఉపయోగించెను, ప్రతివారికి మారుమనస్సు కావలెను గనుక, కేవలం అన్యులకు మాత్రమే గాక, అందరికీ బాప్తిస్మము ఇచ్చెను. అయితే, అపొ. 18:24–26 మరియు 19:1–7లో ఉన్నట్లు, బాప్తిస్మమిచ్చు యోహాను మారుమనస్సు వలె క్రైస్తవ బాప్తిస్మము కాదు. క్రైస్తవ బాప్తిస్మమునకు లోతైన ప్రాముఖ్యత ఉంది.
బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇవ్వబడాలి-అదే “క్రైస్తవ” బాప్తిస్మము అవుతుంది. ఈ సంస్కరణ ద్వారానే ఒక వ్యక్తి సంఘ సహవాసంలోనికి చేర్చబడతాడు. మనం రక్షణ పొందినప్పుడు, ఆత్మ ద్వారా మనం సంఘమైన క్రీస్తు శరీరంలోనికి “బాప్తిస్మము” పొందితిమి. “ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు” అని 1 కొరింథీ. 12:13 చెబుతుంది. నీటి ద్వారా బాప్తిస్మము ఆత్మ ద్వారా బాప్తిస్మము యొక్క “పునఃకార్యం.”
క్రైస్తవ బాప్తిస్మము ద్వారా ఒక వ్యక్తి తన విశ్వాసమును మరియు శిష్యరికమును బహిరంగంగా ఒప్పుకుంటాడు. బాప్తిస్మమిచ్చు నీటిలో, ఒక వ్యక్తి, మాటలు లేకుండా ఇలా చెబుతాడు, “నేను క్రీస్తులో నా విశ్వాసమును ఒప్పుకొనుచున్నాను; యేసు నా ఆత్మను పాపం నుండి శుద్ధిచేసెను, మరియు ఇప్పుడు నాలో ఒక శుద్ధిచేయబడిన నూతన జీవితము ఉన్నది.”
ఒక నాటకీయ పక్కీలో, క్రైస్తవ బాప్తిస్మము క్రీస్తు యొక్క మరణం, పునాది, మరియు పునరుత్థానమును ఉదాహరిస్తుంది. అదే సమయంలో, పాపమునకు మన మరణమును మరియు క్రీస్తులో నూతన జీవమును అది ఉదాహరిస్తుంది. ఒక పాపి ప్రభువైన యేసును అంగీకరించుచుండగా, ఆయన పాపం కొరకు మరణించి (రోమా. 6:11) ఒక నూతన జీవితములోనికి జన్మిస్తాడు (కొలస్సి. 2:12). నీటిలో ముంచబడుట పాపము కొరకు మరణించుటను సూచిస్తుంది, మరియు నీటిలో నుండి బయటకు వచ్చుట రక్షణ తరువాత ఒక పరిశుద్ధ జీవితములోనికి శుద్ధిచేయబడుటను సూచిస్తుంది. రోమా 6:4 దీనిని ఈ విధంగా చెబుతుంది: “కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.”
చాలా సులభంగా, బాప్తిస్మమనునది విశ్వసి జీవితంలో అంతరంగ పరివర్తనకు బాహ్య సాక్ష్యము. క్రైస్తవ బాప్తిస్మము రక్షణ తరువాత ప్రభువునకు విధేయత చూపు కార్యము; బాప్తిస్మము రక్షణతో దగ్గర సంబంధం కలిగియున్నప్పటికీ, రక్షింపబడుటకు అది ఒక అవసరత కాదు. సన్నివేశముల యొక్క వరుసను బైబిల్ చాలా చోట్ల చూపుతుంది 1) ఒక వ్యక్తి ప్రభువైన యేసు మీద విశ్వాసముంచుతాడు మరియు 2) తరువాత అతడు బాప్తిస్మము పొందుతాడు. అపొ. 2:41లో ఈ వరుస చూడవచ్చు, “కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి” (అపొ. 16:14–15 కూడా చూడండి).
యేసు క్రీస్తులో నూతన విశ్వాసి వీలైనంత త్వరగా బాప్తిస్మము పొందుటకు ఆశించాలి. అపొ. 8లో ఐతియోపియాకు చెందిన నపుంసకునితో “యేసును గూర్చిన సువార్తను” మాట్లాడతాడు “వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను” (వచనములు 35–36). వెంటనే, వారు రథమును ఆపారు, మరియు ఫిలిప్పు ఆ వ్యక్తికి బాప్తిస్మము ఇచ్చాడు.
బాప్తిస్మము క్రీస్తు యొక్క మరణం, సమాధి, మరియు పునరుత్థానముతో విశ్వాసి యొక్క గుర్తింపు. సువార్త ప్రకటించబడి ప్రజలు క్రీస్తులో విశ్వాసములోనికి నడిపించబడిన ప్రతి చోట, వారు బాప్తిస్మము పొందవలెను.
English
క్రైస్తవ బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?