settings icon
share icon
ప్రశ్న

క్రైస్తవ ఉపవాసము – బైబిలు ఏమి చెప్పుచున్నది?

జవాబు


క్రైస్తవులను ఉపవాసము చేయాలని లేఖనము ఆజ్ఞాపించలేదు. దేవుడు క్రైస్తవులకు అది అవసరం లేక హక్కు అనలేదు. అదే సమయంలో, బైబిలు ఉపవాసమును మంచిగా, లాభసాటిగా, మరియు మేలైన విషయముగా చూపును. అపొస్తలుల కార్యములు ప్రధానమైన నిర్ణయములు తీసుకొనే ముందు విశ్వాసులు ఉపవాసము చేసెననే సమాచారము కలిగియుండెను (అపొ. 13:2; 14:23). ఉపవాసము మరియు ప్రార్థన తరచుగా జతచేయబడును (లూకా 2:37; 5:33). చాలా తరచుగా, ఉపవాసము యొక్క కేంద్రము ఆహారము లేకుండా ఉండడం. దానికి బదులుగా, ఉపవాసము యొక్క ఉద్దేశము మీ కళ్ళను లోకము నుండి తొలగించి పూర్తిగా దేవునిపై కేంద్రీకరించడం. ఉపవాసము దేవునికి, మరియు మనకు, ఆయనతో సంబంధమును బట్టి చిత్తశుద్ధి కలిగియున్నామని చూపుటకు ఒక మార్గము. ఉపవాసము మనకు ఒక క్రొత్త విధానము మరియు దేవునిపై నూతనపరచబడిన నమ్మకమును పొందుటకు సహాయపడును.

ఉపవాసమునకు ఇతర మార్గములు ఉన్నప్పటికీ, లేఖనములో దాదాపుగా ఉపవాసము అనగా ఆహారము నుండి ఉపవాసము. మన ధ్యాసనంతా దేవునిపై ఉంచుటకు తాత్కాలికముగా వదిలిపెట్టిన ఏదైనా ఉపవాసముగా పరిగణింపబడును (1 కొరింథీ. 7:1-5). ఉపవాసము ఒక ఖచ్చితమైన సమయమునకు పరిమితము చేయాలి, మరిముఖ్యముగా ఆహారము నుండి ఉపవాసము చేయునప్పుడు. తినకుండా సమయమును పొడిగించుట శరీరమునకు హానిచేయును. ఉపవాసము శరీరమును శిక్షించుట కొరకు కాదుకాని, దేవునివైపు తిరిగి మల్లించుటకు. ఉపవాసమును “ఆహార నియంత్రణ విధానము”గా పరిగణించకూడదు. బైబిలు సంబంధమైన ఉపవాసము యొక్క ఉద్దేశము బరువు తగ్గుట కొరకు కాదుకాని, దేవునితో లోతైన సహవాసము సంపాదించుటకు. ఎవరైనా ఉపవాసము చేయవచ్చు, కాని కొందరు ఆహారము నుండి చేయలేకపోవచ్చు (ఉదాహరణకు, మధుమేహ వ్యాధిగ్రస్తులు). ప్రతీవారు తాత్కాలికంగా దేనినైనా దేవునికి దగ్గరగుటకు విడిచిపెట్టగలరు.

మన నేత్రములను ఈ లోక విషయలాపై నుండి తీసివేయుట ద్వారా, మనము విజయవంతముగా మన ధ్యాసను దేవునివైపు త్రిప్పగలము. ఉపవాసము దేవునిని కాదు, మనలను మార్చును. ఇతరుల కంటే ఎక్కువ ఆత్మీయంగా కనబడుటకు ఉపవాసము ఒక మార్గము కాదు. ఉపవాసము వినయముగల ఆత్మతో మరియు సంతోష వైఖరితో చేయవలెను. మత్తయి 6:16-18 ప్రకటించును, “మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.”

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

క్రైస్తవ ఉపవాసము – బైబిలు ఏమి చెప్పుచున్నది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries