ప్రశ్న
దశమభాగమును ఇచ్చుటను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?
జవాబు
దశమ భాగము విషయంలో చాలా మంది క్రైస్తవులు సంఘర్షిస్తూ ఉంటారు. ఇచ్చుటపై కొన్ని సంఘాలలో ఎక్కువ దృష్టి పెడతారు. అదే సమయంలో, ప్రభువునకు కానుకలు అర్పించాలి అనే బైబిల్ బోధలను చాలా మంది క్రైస్తవులు పాటించరు. దశమభాగం/ఇచ్చుట ఆనందం మరియు ఆశీర్వాదంగా ఉండునట్లు చేయబడెను. దుఖకరముగా, నేటి సంఘములో కొన్నిసార్లు పరిస్థితి ఇలా లేదు.
దశమభాగం పాత నిబంధన ఆలోచన. దశమభాగం ధర్మశాస్త్రము యొక్క అవసరత మరియు దానిలో ఇశ్రాయేలీయులు వారి పంటలో నుండి పశువులలో నుండి పదియవ వంతు ప్రత్యక్ష గుడారమునకు/దేవాలయమునకు ఇవ్వవలసియుండేది (లేవీ. 27:30; సంఖ్యా. 18:26; ద్వితీ. 14:24; 2 దిన. 31:5). వాస్తవానికి, పాత నిబంధన ధర్మశాస్త్రము ప్రకారం పలు దశమభాగములు ఇవ్వవలసియుండేది-లేవీయులకు ఒకటి, దేవాలయం కొరకు మరియు పర్వముల కొరకు ఒకటి, మరియు దేశములో ఉన్న పేదల కొరకు ఒకటి-మరియు మొత్తము కలిపి 23.3 శాతం అయ్యేది. పాత నిబంధన దశమభాగమును బలుల వ్యవస్థలో యాజకులు మరియు లేవీయుల అవసరతలు తీర్చుటకు ఒక పన్ను వసూలు చేసే పద్ధతిగా కొందరు అర్థం చేసుకున్నారు.
క్రైస్తవులు ధర్మశాస్త్ర దశమభాగ వ్యవస్థకు లోబడాలని క్రొత్త నిబంధన ఆజ్ఞ ఇవ్వదు, లేక సిఫారసు చేయదు కూడా. ఒక వ్యక్తి ఎంత శాతం సొమ్ము వేరుచెయ్యాలో క్రొత్త నిబంధన తెలుపదుగాని, ఒక వ్యక్తి తన “సంపాదన కొలది” బహుమతులు ఇవ్వాలని చెబుతుంది (1 కొరింథీ. 16:2). క్రైస్తవ సంఘములో కొందరు పాత నిబంధన యొక్క 10 శాతం సంఖ్యను తీసుకొని క్రైస్తవులు ఇచ్చుటకు “కనీస మొత్తముగా ప్రతిపాదన” చేస్తారు.
ఇచ్చుటలోని ప్రాముఖ్యతను మరియు లాభాలను గూర్చి క్రొత్త నిబంధన మాట్లాడుతుంది. మన శక్తి కొలది మనం ఇవ్వాలి. కొన్ని సార్లు 10 శాతం కంటే ఎక్కువగా ఇచ్చుట దీని అర్థము; కొన్ని సార్లు 10 శాతం కంటే తక్కువ కూడా కావచ్చు. ఇదంతా క్రైస్తవుని యొక్క శక్తి మరియు సంఘము యొక్క అవసరత మీద ఆధారపడియుండాలి. దశమభాగమును గూర్చి/ఎంత ఇవ్వాలో అను దానిని గూర్చి ప్రతి క్రైస్తవుడు వివేకముతో ప్రార్థన చేసి దేవుని జ్ఞానము కొరకు అడగాలి (యాకోబు 1:5). అన్నిటి కంటే ఎక్కువగా, దశమభాగములు మరియు కానుకలు మంచి ఉద్దేశములతో, దేవునికి ఆరాధనా భావముతో మరియు క్రీస్తు శరీరము యొక్క సేవ కొరకు ఇవ్వాలి. “ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” (2 కొరింథీ. 9:7).
English
దశమభాగమును ఇచ్చుటను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?