ప్రశ్న
క్రైస్తవ దృష్టికోణము అనగానేమి?
జవాబు
ఒక“దృష్టికోణము” అనునదిఒక దృక్పథం నుండి ప్రపంచమును అర్ధం చేసుకొనే అవగాహనను సూచిస్తుంది. “క్రైస్తవ దృష్టికోణము” అంటే, క్రైస్తవ దృక్పథం నుండి ఈ లోకమును పరిగణించే ఒక అవగాహనను సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క దృష్టికోణము అతనికి “పెద్ద చిత్రము”గా ఉంటుంది, అంటే ప్రపంచమును గూర్చి సదరు వ్యక్తి అనుకునేది అంతా అందులో ఉంటుంది. వాస్తవమును అర్ధం చేసుకొనుటలో అది ఆయన యొక్క విధానం. దైనందిన నిర్ణయములను తీసుకొనుటకు ఈ దృష్టికోణం మూలము కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది.
ఒక బల్ల మీద ఉన్న ఆపిల్ పండును అందరు చూస్తారు. వృక్షశాస్త్రజ్ఞుడు దానిని చూచినప్పుడు దానిని ఒక విభజనలో పెడతాడు. ఒక కళాకారుడు నిలిచియున్న ఒక జీవిని చూసినట్లుగా దానిని చిత్రిస్తాడు. ఒక దుకాణదారుడు దానిని ఒక వస్తువుగా అమ్మకము వస్తువుగా చూస్తాడు. ఒక పిల్లవాడు దానిలో ఆహారమును చూసి భుజిస్తాడు. ఏ పరిస్థితినైనను మనము చూసే విధానము అనునది అసలు ఈ విశాల ప్రపంచమును మనము ఎలా దృష్టిస్తున్నామా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి దృష్టికోణం, క్రైస్తవులదైనా లేక క్రైస్తవేతరులదైనా, ఇక్కడ ఉన్న ఈ మూడు ప్రశ్నలను గూర్చి చర్చిస్తాయి:
1) మనము ఎక్కడ నుండి వచ్చాము? (మరియు మనము ఇక్కడ ఎందుకు ఉన్నాము?)
2) ఈ ప్రపంచములో ఉన్న తప్పులు ఏమిటి?
3) వాటిని మనము ఎలా సరిచేయగలము?
నేడు బాగా మనుగడలో ఉన్న దృష్టికోణము సహజత్వము, ఇది ఈ మూడు ప్రశ్నలను ఈ విధంగా జవాబు చేస్తుంది: 1) మనము ప్రకృతి యొక్క క్రియల వాళ్ళ ఉత్పన్నం అయిన వారము మరియు ఎటువంటి నిజమైన ఉద్దేశ్యములు లేవు. 2)మనము గౌరవించవలసిన విధానములో ఈ లోకమును గౌరవించుటలేదు. 3)పర్యావరణ శాస్త్రము మరియు సంరక్షణల ద్వారా ఈ లోకమును మనము కాపాడగలము. సహజసిద్ధమైన దృష్టికోణము అనేకమైన తత్వశాస్త్రములను అనగా, నైతిక సంబంధత్వము, మనుగడత్వము, ప్రయోగత్వము, మరియు కలలలో విహరించే తత్వములను ఉత్పత్తి చేస్తుంది.
కాని మరొక విధానములో క్రైస్తవ దృష్టికోణము ఈ మూడు ప్రశ్నలకు పరిశుద్ధగ్రంధానుసారముగా జవాబు ఇస్తుంది: 1) మనము దేవుని సృష్టి, లోకమును పాలించుటకు మరియు ఆయనతో సహవాసము చేయుటకు చేయబడ్డాము (ఆదికాండము 1:27-28; 2:15). 2) మనము దేవునికి విరోధముగా పాపము చేసి లోకమంతటిని శాపమునకు లోనగునట్లు చేసాము (ఆదికాండము 3). 3) దేవుడు తానే తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా ఈ లోకమును విమోచించాడు (ఆదికాండము 3:15; లూకా 19:10), మరియు ఒకదినమున ఈ సృష్టి అంతటిని దాని మూలమైన పరిపూర్ణ స్థితికి మార్చుతాడు (యెషయా 65:17-25). నైతికమైన నిరంకుశత్వమును, సూచక క్రియలను, మానవ ప్రతిష్టను, మరియు విమోచించబడగలిగే అవకాశములను నమ్మేటట్లు ఈ క్రైస్తవ దృష్టికోణము మనకు సహాయం చేస్తుంది.
దృష్టికోణము అనునది సమగ్రమైనది అని గుర్తుంచుకోవడం చాలా ప్రాధాన్యం. అది జీవితములోని ప్రతి కోణమును ప్రభావితం చేస్తుంది, ధనము నుండి నైతికత్వము వరకు, రాజకీయముల నుండి కళానైపుణ్యత వరకు. నిజమైన క్రైస్తవ్యము అనునది సంఘములో ప్రయోగించుటకు ఏర్పరచుకున్న ఒక ఆలోచనల పుటకంటే ఎక్కువైనది. పరిశుద్ధ గ్రంథములో బోధించబడిన క్రైస్తవ్యము అదే ఒక దృష్టికోణము. పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు కూడా “ధార్మిక” జీవితము మరియు “లౌకిక” జీవితము అనే విషయాలలో వివక్ష చూపదు; అసలు మనుగడలో ఒకే ఒక్క జీవితము క్రైస్తవ జీవితము. యేసు తానే “మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను” అని చెప్పాడు (యోహాను 14:6) మరియు, అలా చేయుట వలన, ఆయనే మన యొక్క దృష్టికోణముగా అయ్యాడు.
English
క్రైస్తవ దృష్టికోణము అనగానేమి?