ప్రశ్న
పరిశుద్ధాత్మ ఎవరు?
జవాబు
పరిశుద్ధాత్మ యొక్క గుర్తింపును గూర్చి అనేక అపార్థాలు ఉన్నాయి. కొందరు పరిశుద్ధాత్మను రహస్య శక్తి అని అంటారు. పరిశుద్ధాత్మ క్రీస్తు తన అనుచరులకు ఇచ్చు వ్యక్తిగతం కాని శక్తి అని మరికొందరు అర్థం చేసుకుంటారు. పరిశుద్ధాత్మ యొక్క గుర్తింపును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? సులువైన మాటలలో, పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ ఘోషిస్తుంది. పరిశుద్ధాత్మ దైవిక వ్యక్తి అని, మనస్సు, ఆలోచన, భావాలు కలిగియున్నదని కూడ బైబిల్ చెబుతుంది.
పరిశుద్ధాత్మ యొక్క సత్యము అపొ. 5:3-4తో సహా అనేక లేఖన భాగములలో స్పష్టముగా చూడవచ్చు. ఈ వచనంలో పేతురు అననీయను గద్దిస్తూ అతడు పరిశుద్ధాత్మ తో ఎందుకు అబద్ధమాడెనో చెప్పమని అతడు “మనుషులతో గాక దేవునితో అబద్ధమాడెనని” చెప్పెను. పరిశుద్ధాత్మ తో అబద్ధమాడుట దేవునితో అబద్ధమాడుటతో సమానం అని ఇది ఒక స్పష్టమైన ఘోషణ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణములు కలిగియున్నాడు కాబట్టి ఆయన దేవుడని మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఆయన సర్వాంతర్యామి గుణము కీర్తనలు 139:7-8లో చూడవచ్చు, “నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు ” మరలా 1 కొరింథీ. 2:10-11లో, పరిశుద్ధాత్మ యొక్క సర్వజ్ఞానం మనం చూస్తాము. “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.”
పరిశుద్ధాత్ముడు మనస్సు, చిత్తము మరియు భావాలు కలిగియున్నాడు కాబట్టి ఆయన నిజముగా దైవమని మనం తెలుసుకొనవచ్చు. పరిశుద్ధాత్మ ఆలోచిస్తాడు మరియు యెరిగియున్నాడు (1 కొరింథీ. 2:10). పరిశుద్ధాత్మ దుఖిస్తాడు (ఎఫెసీ. 4:30). ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తాడు (రోమా. 8:26-27). ఆయన చిత్త ప్రకారం ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు (1 కొరింథీ. 12:7-11). పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వములో మూడవ వ్యక్తి. దేవుని వలె, యేసు వాగ్దానము చేసినట్లు పరిశుద్ధాత్మ సహాయకునిగా సలహాదారిగా పనిచేయగలడు (యోహాను 14:16, 26, 15:26).
English
పరిశుద్ధాత్మ ఎవరు?