settings icon
share icon
ప్రశ్న

యెహోవా సాక్షులు ఎవరు మరియు వారి నమ్మికలు ఏమిటి?

జవాబు


ఈరోజు యెహోవా సాక్షులుగా తెలియబడిన ఈ శాఖ Pennsylvaniaలో 1870 లో ఒక బైబిలు తరగతిలా ప్రారంభింపబడి Charles Taze Russell చే నడుపబడెను. Russell ఈ శాఖకు “Millennial Dawn Bible Study” అని పేరు పెట్టెను. Charles T. Russell “The Millennial Dawn” అని పిలువబడే పుస్తకాల సంపుటిని వ్రాయడం ప్రారంభించెను, అది ఆయన మరణమునకు ముందు ఆరు శీర్షికలుగా వ్యాపించి మరియు యెహోవా సాక్షులు ఇప్పుడు చెప్తున్న వేదాంతమును అవి కలిగియున్నవి. 1916లో Russell మరణము తర్వాత, Judge J. F. Rutherford అనే Russell స్నేహితుడు మరియు వారసుడు, “Millinnial Dawn” చివరి మరియు ఏడవ శీర్షికను, “The Finished Mystery” 1917లో వ్రాసెను. 1886లో Watchtower Bible మరియు Tract Society కనుగొనబడి “Millennial Dawn” ఉద్యమమును త్వరితంగా ఇతరులకు వారి అభిప్రాయాలను పంచుటలో వాహనముగా మారెను. ఈ గుంపు “Russellites”గా 1931 వరకు తెలియబడి, ఆ సంస్థలో చీలిక వలన, అప్పుడు, అది “యెహోవా సాక్షులు” గా పేరు మార్చబడినది. ఆ చీలిక నుండి ఏర్పడిన గుంపు “బైబిలు విద్యార్థులు”గా తెలియబడెను.

యెహోవా సాక్షులు ఏమి నమ్మును? క్రీస్తు దేవుడు, రక్షణ, త్రిత్వము, పరిశుద్ధాత్మ, మరియు ప్రాయశ్చిత్తము అనే విషయాలను వారి సిద్ధాంతలను దగ్గరగా పరిశీలిస్తే ఈ విషయాలపై సనాతన క్రైస్తవ స్థానాలను ఈ విషయాలు కలిగిలేవని నిస్సందేహముగా కనబడును. యెహోవా సాక్షులు యేసు, ప్రధాన దూతయైన మిఖాయేలుగా, అత్యధికoగా సృష్టింపబడిన వానిగా, నమ్ముదురు. ఇది యేసు దేవుడని స్పష్టముగా ప్రకటించే అనేక లేఖనములతో విభేదించును (యోహాను 1:1,14, 8:58, 10:30). యోహావా సాక్షులు రక్షణను విశ్వాసం, మంచిపనులు, మరియు విధేయతల కలయికతో పొందవచ్చు అని నమ్మును. ఇది రక్షణ కృప ద్వారా విశ్వాసముచే మాత్రమే అనుగ్రహింపబడునని ప్రకటించే లెక్కలేనన్ని లేఖనములతో విభేదించును (యోహాను 3:16; ఎఫెసీ. 2:8-9; తీతు 3:5). యేసు ఒక ప్రాణిగా సృష్టింపబడి మరియు పరిశుద్దాత్మ తప్పనిసరిగా దేవుని జీవములేని శక్తి అని నమ్ముచు, యెహోవా సాక్షులు త్రిత్వమును తిరస్కరించును. యెహోవా సాక్షులు క్రీస్తు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తము అనే విషయమును తిరస్కరించి మరియు బదులుగా ఒక విమోచన సిద్ధాంతమును పట్టుకొని, ఆదాము పాపమునకు యేసు మరణము ఒక విమోచన చెల్లింపు అని అందురు.

యెహోవా సాక్షులు బైబిలు సంబంధము కాని సిద్ధాంతాలను ఎలా న్యాయం చేయుదురు? మొదటిగా, శతాబ్దాల నుండి సంఘము బైబిలును పాడుచేసెనని పేర్కొనును; అందువలన, వారు బైబిలును New World Translation గా మరల అనువదించిరి. The Watchtower బైబిలు మరియు Tract Society వారి అబద్ద సిద్ధాంతాలకు సరిపడేలా, వారి సిద్ధాంతమును బైబిలు నిజముగా ఏమి బోధిస్తుందో దానిపై ఆధారపడుటకు బదులుగా, బైబిలు వాక్యాలను మార్చిరి. The New World Translation చాలా సంచికలుగా వెళ్లి, వారి సిద్ధాంతమునకు విరోధముగా మరిఎక్కువ లేఖనములను యెహోవా సాక్షులు కనుగొనిరి.

The Watchtower తన నమ్మికలను మరియు సిద్ధాంతాలను Charles Taze Russell, Judge Joseph Franklin Rutherford, మరియు వారి వారసుల యొక్క నిజమైన బోధలపై ఆధారపడి విస్తరించెను. Watchtower Bible మరియు Tract Society యొక్క పరిపాలనా సంస్థ కేవలం మతారాధన వ్యవస్థలో ఒకే సంస్థ లేఖనములను అనువదించుటకు అధికారం కలిగియున్నట్లు పేర్కొనబడెను. మరియొక మాటలలో, యే లేఖన ప్రకరణమైనా అది పరిపాలనా సంస్థ చెప్పితే అదే చివరి మాటగా చూడబడును, మరియు స్వతంత్ర ఆలోచన బలవంతముగా నిరుత్సాహపరచబడెను. పౌలు తిమోతికి చేసిన హిత బోధకు (అదే విధముగా మనకు) దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్తపడుము అనే దానికి ఇది ప్రత్యక్ష విరుద్ధముగా ఉండెను. ఈ మందలింపు 2 తిమోతి 2:15లో కనబడును, ఇది దేవుడు తన ప్రతి కుమారుడు బెరియా క్రైస్తవునివలే, ఎవరైతే లేఖనములను ప్రతిదినము పరిశోధించి ఒకవేళ వారికి బోధింపబడిన విషయాలు వాక్యముతో ఏకీభవిస్తున్నాయా అని చూచే వారివలే వుండాలని ఒక స్పష్టమైన సూచన.

యెహోవా సాక్షుల వలే నమ్మకముగా వారి వర్తమానమును బయటకు తెచ్చినట్లు కంటే మరియే మత సంస్థ బహుశా ఉండిఉండదు. దురదృష్టవశాత్తు, ఆ వర్తమానము పూర్తిగా వక్రీకరణ, మోసం, మరియు అబద్ద సిద్ధాంతం. దేవుడు యెహోవా సాక్షుల యొక్క నేత్రములు సువార్త సత్యమునకు మరియు దేవుని వాక్యము యొక్క నిజమైన బోధలకు తెరచును గాక.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యెహోవా సాక్షులు ఎవరు మరియు వారి నమ్మికలు ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries