ప్రశ్న
యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం నిజమా?
జవాబు
యేసు క్రీస్తు మరణము నుండి నిజముగా తిరిగిలేచెనని లేఖనము నిర్థారిత రుజువులను ఇస్తుంది. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం మత్తయి 28:1-20; మార్కు 16:1-20; లూకా 24:1-53; మరియు యోహాను 20:1–21:25లో వ్రాయబడినది. పునరుత్థానుడైన యేసు అపొస్తలుల కార్యములు పుస్తకములో కూడా కనిపిస్తాడు (అపొ. 1:1-11). ఈ లేఖన భాగముల ద్వారా యేసు యొక్క పునరుత్థానమునకు మీరు అనేక “రుజువులు” ఇవ్వవచ్చు. మొదటిది శిష్యులలో ఒక నాటకీయ మార్పు. వారు బయపడి దాగుకొన్న ఒక పురుషుల గుంపు నుండి లోకములో సువార్తను ప్రకటించు బలమైన సాక్షులుగా మారారు. పునరుత్థానుడైన క్రీస్తు వారికి కనిపించుట తప్ప ఆ నాటకీయ మార్పును ఏమి వివరించగలదు?
రెండవది అపొస్తలుడైన పౌలు యొక్క జీవితం. అతనిని సంఘమును హింసించువాని నుండి సంఘము యొక్క అపొస్తలునిగా ఏమి మార్చింది? దమస్కు మార్గంలో పునరుత్థానుడైన క్రీస్తు తనకు ప్రత్యక్షమగుట (అపొ. 9:1-6). ఖాళీ సమాధి మూడవ నిర్థారిత రుజువు. క్రీస్తు తిరిగిలేవనియెడల, తన శరీరం ఏది? ఆయన ఉంచబడిన సమాధిని శిష్యులు మరియు ఇతరులు చూశారు. వారు తిరిగివచ్చినప్పుడు, ఆయన శరీరం అక్కడ లేదు. ఆయన వాగ్దానము చేసినట్లు మరణము నుండి తిరిగిలేచాడని దూతలు ప్రకటించాయి (మత్తయి 28:5-7). నాల్గవది, ఆయన కనిపించిన అనేకమంది ప్రజలు ఆయన పునరుత్థానమునకు మరికొన్ని రుజువులు (మత్తయి 28:5, 9, 16-17; మార్కు 16:9; లూకా 24:13-35; యోహాను 20:19, 24, 26-29, 21:1-14; అపొ. 1:6-8; 1 కొరింథీ. 15:5-7).
యేసు పునరుత్థానమునకు శిష్యులు గొప్ప విలువనిచ్చారు అనుట యేసు యొక్క పునరుత్థానమునకు మరొక రుజువుగా ఉంది. 1 కొరింథీ. 15 క్రీస్తు పునరుత్థానమునకు ఒక ముఖ్యమైన లేఖన భాగము. క్రీస్తు పునరుత్థానమును నమ్మి దానిని అర్థం చేసుకొనుట ఎంత ముఖ్యమో అపొస్తలుడైన పౌలు ఈ అధ్యాయములో వివరిస్తున్నాడు. ఈ క్రింద కారణాల వలన పునరుత్థానము ప్రాముఖ్యమైనది: 1) క్రీస్తు మరణము నుండి తిరిగిలేవని యెడల, విశ్వాసులు కూడా తిరిగిలేవరు (1 కొరింథీ. 15:12-15). 2) క్రీస్తు మరణము నుండి తిరిగిలేవనియెడల, పాపము కొరకు ఆయన బలి సరిపోదు (1 కొరింథీ. 15:16-19). మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన మరణమును దేవుడు అంగీకరించాడని యేసు యొక్క పునరుత్థానము రుజువు చేస్తుంది. ఆయన మరణించి మృతుడుగా ఉన్నయెడల, ఆయన అర్పణ సరిపోదని అది సూచిస్తుంది. అందువలన, వారి పాపముల కొరకు విశ్వాసులు క్షమించబడరు, మరియు మరణం తరువాత వారు మృతులుగానే ఉంటారు (1 కొరింథీ. 15:16-19). నిత్యజీవము అనే విషయమే ఉండదు (యోహాను 3:16). “ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు” (1 కొరింథీ. 15:20).
చివరిగా, యేసు క్రీస్తు తిరిగిలేచినట్లే ఆయనయందు విశ్వాసముంచువారు కూడా నిత్యజీవములోనికి తిరిగిలేస్తారని లేఖనము స్పష్టముగా చెబుతుంది (1 కొరింథీ. 15:20-23). క్రీస్తు యొక్క పునరుత్థానము పాపముపై జయమును రుజువుచేస్తుందని మరియు మనకు పాపముపై జయముకలిగి జీవించుటకు శక్తిని ఇస్తుందని 1 కొరింథీ. 15 వివరిస్తుంది (1 కొరింథీ. 15:24-34). మనం పొందబోవుచున్న పునరుత్థాన శరీరముల యొక్క మహిమగల స్వభావమును అది వర్ణిస్తుంది (1 కొరింథీ. 15:35-49). క్రీస్తు పునరుత్థానము మూలముగా, ఆయనయందు విశ్వాసముంచు ప్రతివారు మరణముపై అంతిమ జయమును పొందుతారు అని అది ప్రకటిస్తుంది (1 కొరింథీ. 15:50-58).
క్రీస్తు యొక్క పునరుత్థానము ఎంత మహిమగల సత్యం! “కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి” (1 కొరింథీ. 15:58). బైబిల్ ప్రకారం, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము నిశ్చయముగా సత్యము. బైబిల్ క్రీస్తు పునరుత్థానమును లిఖిస్తుంది, 400 మంది కంటే ఎక్కువ మంది ఆయనను చూశారని అది లిఖిస్తుంది, మరియు అది యేసు పునరుత్థానము యొక్క చారిత్రక సత్యముపై ఒక ముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతమును నిర్మిస్తుంది.
English
యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం నిజమా?