యూదులు అరబ్బీయులు / ముస్లీంలు ఒకరినొకరు ఎందుకు అసహ్యించుకుంటారు?ప్రశ్న: యూదులు అరబ్బీయులు / ముస్లీంలు ఒకరినొకరు ఎందుకు అసహ్యించుకుంటారు?

జవాబు:
మొదటిగా, ప్రాముఖ్యముగా అర్థముచేసుకోవాల్సిందేంటంటే అందరు అరబ్బీయులు, ముస్లీంలు కాదు, మరియు అందరు ముస్లీంలు, అరబ్బీయులు కారు. అయితే ఎక్కువశాతపు అరబ్బీయులు ముస్లీములే, గాని కొంతమంది ముస్లీంలుకాని అరబ్బీయులు వున్నారు. ఇంకా, ఇండోనేశియ మరియు మలేశియ ప్రాంతలలో అభిప్రాయ సూచకముగా ఎక్కువ ముస్లీంలుకాని అరబ్బీయులు కన్నా ముస్లీంలైన అరబ్బీయులు వున్నారు. రెండవది, ప్రాముఖ్యముగా ఙ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందేటంటే అరబ్బీయులు అందరు యూదులను అసహ్యించుకోరు, లేక ముస్లీంలు అందరు యూదులను అసహ్యించుకోరు, మరియు యూదులందరు అరబ్బీయులను మరియు ముస్లీంలను అసహ్యించుకోరు, వారికిష్టమొచ్చినట్లు వుండే ప్రజలను మనము నిషేధించాలి. ఏదిఏమైనా, సామాన్యముగా మాట్లాడితే, అరబ్బీయులు మరియు ముస్లీంలు ఇద్దరికి యూదులపట్ల అయిష్టత మరియు అపనమ్మకము ఉన్నది మరియు వారికి వీరిపట్ల అదేవిధంగా అపనమ్మిక ఉన్నది.

ఈ శత్రుత్వమునకు ఏదైనా స్పష్టమైన బైబిలు వివరన ఉందంటే, వెనుకటి చరిత్రలో అబ్రాహాము దగ్గరకు నడిపిస్తుంది. యూదులు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు సంతతికి చెందినవారు. ఇష్మాయేలీయులు అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు సంతతికి చెందినవారు. ఇష్మాయేలు ఒక దాసి స్త్రీకి చెందిన కుమారుడు (ఆదికాండము 16:1-16) మరియు ఇస్సాకు వగ్ధానముచేయబడిన కుమారుడు అబ్రహాముయొక్క ఆశీర్వాదమును స్వాస్థ్యముగా స్వతత్రించుకొన్నవాడు (ఆదికాండము 21:1-3), సహజముగా ఆఇద్దరి కుమారులమధ్య వైరమున్నది. దానికి కారణముగాను ఇష్మాయేలు ఇస్సాకును వెక్కిరించాడు (ఆదికాండము 21:9), శారా అబ్రాహాముతొ హాగారును మరియు ఇష్మాయేలును దూరంగా పంపించేయమని మాట్లాడెను (ఆదికాండము 21:11-21). బహుశః, ఇష్మాయేలుకు ఇస్సాకుపట్ల తిరస్కారమునకు కారణమైనది. అప్పుడు దూత హాగరుతో ఇష్మాయేలు గురించి ప్రవచించినట్లు “తన సహోదరులందరితో విరోధముగా నివసించును” (ఆదికాండము 16:11-12).

ఇస్లాము మతము, అరబ్బియులు విరు సహచరులు, అయినా ఈ తిరస్కారమునకు వీరిని ఎక్కువగా గురి చేసింది. ఖురాన్లో యూదుల గురించి కొన్ని పరస్పర భేధములతో కూడిన హెచ్చరికలు ముస్లీములకు ఇవ్వబడినవి. ఒక విషయానికి వచ్చేసరికి ముస్లీములకు యూదులను సహోదరులుగా చూడమని మరియు మరొక చోట ముస్లీములతో యూదులను, ఎవరైతే ఇస్లాములోనికి మార్చబడడానికి ఇష్టపడరో వారిని ఎదుర్కొనమని హెచ్చరిక చేసెను. ఖురాను కూడ అబ్రాహాము కుమారుడు ఖచ్చితముగా వగ్ధానపుత్రుడెనని చెప్పినందుకు పోరాటమును పరిచయము చెస్తుంది. హెబ్రీ లేఖనములు అది ఇస్సాకే అని రూఢిగా చెప్తుంది. ఖురాను మట్టికి అది ఇష్మాయేలు అని చెప్తుంది. ఖురాను భోధిస్తుంది అబ్రాహాము ప్రభువునకు బలి ఇచ్చింది ఇష్మాయేలునే గాని, ఇస్సాకును కదు (ఆదికాండము 22 వ అధ్యామునకు పరపరముగా 22). ఈ వాదన కేవలము వాగ్ధానపుత్రుడైన వాని గురించి ఈ దినాలలో కూడ తిరస్కారమునకు తోడ్పడుతుంది.

ఏదిఏమైనా, ఇస్సాకు మరియు ఇష్మాయేలు మధ్య ఆదినుండి వేరుపారిన చేదుతనము ఈ దినాలలో నుండే యూదులు మరియు అరబ్బీయులమధ్య విరుద్ధమును మనము వివరించలేము. వాస్తవముగా, కొన్ని సంవత్సరాల మధ్య ప్రాచ్య దేశియ చరిత్రలో, యూదులు మరియు అరబ్బీయులు ఒకరినొకరు సాన్వయమైన సమాధానముతోను మరియు విభేధాలతోను కలసి జీవించారు. రెండవ ప్రపంచయుద్దము తర్వాత, యూదా ప్రజలకు ఇశ్రాయేలీయుల భూభాగమును కొంత శాతము ఇచ్చెను, ఆ భూభాగము ప్రాధమికంగా అరబ్బీయులు దానిలో కాపురమున్నారు (పాలస్తీనీయులు). చాలమంది అరబ్బీయులు అత్యుగ్రముగా ఆభూమిని ఆక్రమించుకొనుటకు ఇశ్రాయేలు దేశముపై వ్యతిరేకించెను. అరబ్బీ దేశీయులు ఏకముగా మరియు ఇశ్రాయేలీయులను ఆభూభాగమునుండి వారిని బయటకు పంపించుటకు దాడిచేసారు, గాని వారు ఓడిపోయారు. అప్పటినుండి, ఇశ్రాయేలీయులు మరియు వారు పొరుగువారైనా అరబ్బీయులకు మధ్య గొప్ప వైరము ఏర్పడినది. ఇశ్రాయేలు ఒక చిన్న భూభాగముపైన వున్నది మరియు దాని చుట్టూ ఎక్కువ శాతములో అరబ్బీ దేశీయులు అంటే యోర్దాను, సిరియా, సౌది అరేబియా, ఇరాకు, మరియు ఐగుప్తు నున్నది. అది మన దృక్పధము అయితే, బైబిలుపరంగా మాట్లాడినట్లయితే, ఇశ్రాయేలుకు దేవుడు తన సంతతియైన యాకోబుకు ఇచ్చింది, యాకోబు యొక్క మనువడుకు ఇచ్చిన ఒక దేశముగా తన స్వంత దేశములో నివసించుటకు హక్కు కలిగియున్నది. అదే సమయములో, మనము గట్టి నమ్మేదేంటంటే ఇశ్రాయేలు ఖచ్చితముగా సమాధానము వెదకాలి మరియు అరబ్బు దేశీయులపట్ల గౌరవ మార్యాదలను కనుపర్చాలి. కీర్తనలు 122:6 ప్రకటించినట్లుగా, “యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థనచేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్థిల్లుదురు.”


తెలుగు హోం పేజికు వెళ్ళండి


యూదులు అరబ్బీయులు / ముస్లీంలు ఒకరినొకరు ఎందుకు అసహ్యించుకుంటారు?