settings icon
share icon
ప్రశ్న

మర్మోనత్వం అనేది ఒక మతాచార వ్యవస్థా? మర్మోనులు ఏమి నమ్మును?

జవాబు


మర్మోను మతం (మర్మోనత్వం), Joseph Smith అనే పేరు కలిగిన వ్యక్తితో, రెండు వందల సంవత్సరాల ముందు స్థాపింపబడి, అతని అనుచరులు మర్మోనులుగా మరియు Latter Day Saints(LDS)గా తెలియబడెను. అతడు తండ్రియైన దేవుడు మరియు యేసుక్రీస్తు యొద్దనుండి ఒక వ్యక్తిగత దర్శనం పొందెనని పేర్కొని సంఘములన్నియు మరియు వారి మతాలు హేయము అని ఆయనకు చెప్పెను. Joseph Smith అప్పుడు ఒక సరి క్రొత్త మతమును ప్రారంభించుటకు సిద్ధపడి “భూమిపై ఉన్న ఏకైక నిజసంఘం” గా పేర్కొనెను. మర్మోనత్వంతో సమస్య బైబిలును అది విభేదించి, సవరించి, మరియు విస్తరించెను. క్రైస్తవులకు బైబిలు సత్యము కాదని మరియు తగినది కాదని నమ్ముటకు కారణమేమి లేదు. దేవునిని పూర్తిగా నమ్మి మరియు విశ్వసించాలంటే ఆయన వాక్యమును నమ్మి, మరియు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, అది ఆయన యొద్దనుండి వచ్చినది నమ్మడం (2 తిమోతి 3:16).

మర్మోనులు కేవలం ఒకటి కాదు, గాని దైవావేశంవలన కలిగిన వాక్య ఆధారాలు నిజానికి నాలుగు అని నమ్మును: 1) బైబిలు, “అది సరిగ్గా అనువదించబడినంతవరకు” తప్పుగా అనువదింపబడిన వచనాలు పరిగణింపబడి అవి ఎప్పటికీ స్పష్టము చేయబడలేదు. 2) The Book Of Marmon, Smith చే “అనువదింపబడి” మరియు 1830 లో ప్రచురించబడెను. Smith దానిని భూమిపై “ఏ ఇతర పుస్తకం కంటే” దేవునికి దగ్గరగుటకు ఆ ఉపదేశములకు “చాలా సరియైన పుస్తకo” అని పేర్కొనెను. 3) సిద్ధాంతాలు మరియు నిబంధనలు, “యేసుక్రీస్తు సంఘము తిరిగి సమకూర్పు” గూర్చిన ఆధునిక ప్రత్యక్షతలు కలిగియుండెను. 4) The Pearl of the Great Price, మర్మోనుల సిద్ధాంతాలు మరియు బోధలు బైబిలు నుండి కోల్పోయి మరియు భూమి యొక్క సృష్టి గూర్చి స్వంత సమాచారమును కలిపినట్లు “స్పష్టం” చేయబడినట్లు పరిగణింపబడును.

మర్మోనులు దేవుని గూర్చి ఈ క్రింది వాటిని నమ్మును: అతడు ఎల్లప్పుడు ఈ విశ్వమునకు మహోన్నతమైనవాడు కాదు, గాని నీతివంతమైన జీవితం మరియు ఎడతెగని ప్రయత్నం ద్వారా ఆ హోదా పొందెను. వారు తండ్రియైన దేవుడు “ఒక మానవుని శరీరం మరియు ఎముకలుగా పరిగణింపబడెనని” నమ్మును. ఆధునిక మర్మోను నాయకులు వదిలివేసినా, Brigham Young నిజానికి ఆదామే దేవుడు మరియు యేసుక్రీస్తు తండ్రి అని బోధించును. దీనికి విరుద్ధంగా, క్రైస్తవులకు దేవుని గూర్చి తెలుసు; నిజమైన దేవుడు కేవలం ఒక్కడే అని (ద్వితీ 6:4; యెషయా 43:10; 44:6-8), అతడు ఎల్లప్పుడు వుండి మరియు ఎల్లప్పుడు ఉండేవాడు (ద్వితీ. 33:27; కీర్తనలు 90:2; 1 తిమోతి 1:17), మరియు అతడు సృష్టింపబడలేదు కాని అతడు సృష్టికర్త (ఆది. 1; కీర్తనలు 24:1; యెషయా 37:16). అతడు పరిపూర్ణమైనవాడు, మరియు ఎవరు అతనికి సరిరారు (కీర్తనలు 86:8; యెషయా 40:25). తండ్రియైన దేవుడు ఒక మానవుడు కాదు, లేక ఎప్పటికీ కాదు (సంఖ్యా 23:19; 1 సమూయేలు 15:29; హోషేయా 11:9). అతడు ఆత్మ (యోహాను 4:24), మరియు రక్త మాంసములతో చేయబడిన ఆత్మా కాదు (లూకా 24:39).

మర్మోనులు జీవితం తర్వాత వివిధ క్రమములు లేక రాజ్యములు ఉండునని నమ్మును: ఖగోళ రాజ్యము, భూగోళ రాజ్యము, టెలిస్టియల్ రాజ్యము, మరియు బాహ్య చీకటి. మానవ జాతి అంతము వారు నమ్మినది మరియు ఈ జీవితంలో చేసేదానిపై ఆధారపడును. విరుద్ధంగా, బైబిలు మనకు మరణము తర్వాత, యేసుక్రీస్తును మన ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించిన దానిబట్టి మనం పరలోకం వెళ్తామా లేక నరకానికి వెళ్తామా అనే దానిపై ఆధారపడునని చెప్పును. మనము మన శరీరంలో లేమంటే, దాని అర్ధం, విస్వాసులుగా, మనం ప్రభువుతో ఉన్నామని (2 కొరింథీ. 5:6-8). అవిశ్వాసులు నరకమునకు లేక మృతుల స్థలమునకు పంపబడును (లూకా 16:22-23). యేసు రెండవ రాకడలో, మనమందరం నూతన శరీరమును పొందుదము (1 కొరింథీ. 15:50-54). విశ్వాసులకు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి ఉండును (ప్రకటన 21:1), మరియు అవిశ్వాసులు అగ్నిగుండములో పడవేయబడును (ప్రకటన 20:11-15). మరణము తర్వాత విమోచింపబడుటకు రెండవ అవకాశం లేదు (హెబ్రీ. 9:27).

మర్మోను నాయకులు యేసు అవతారం తండ్రియైన దేవుడు మరియు మరియల శారీరిక సంబంధ ఫలితం అని బోధించును. మర్మోనులు యేసు ఒక దేవుడని, కాని యే మానవుడైనా దేవునిగా మారవచ్చునని నమ్మును. మర్మోనత్వం రక్షణ విశ్వాసం మరియు మంచి పనుల కలయిక ద్వారా పొందగలమని బోధించును. దీనికి విరుద్ధంగా, క్రైస్తవులు చారిత్రాత్మకంగా దేవుని హోదాను ఎవరు పొందలేరని- కేవలం ఆయనే పరిశుద్ధుడు అని బోధింపబడెను (1 సమూయేలు 2:2). మనము దేవుని దృష్టిలో ఆయనలో విశ్వాసం ఉంచుట ద్వారానే పరిశుద్దులుగా మార్చబడుదుము (1 కొరింథీ. 1:2). యేసు దేవుని ఏకైక కుమారుడు (యోహాను 3:16), ఆయనలా పాపములేని, నిoదారహితమైన జీవితం జీవించి, మరియు పరలోకములో అత్యంత ఘనత కలిగిన స్థానము కలిగియుండెను (హెబ్రీ 7:26). యేసు మరియు దేవుడు ఒకేలా వుండును. శారీరక జననం ముందే వున్న ఒకేఒక్కడు యేసు (యోహాను 1:1-8; 8:56). యేసు మనకొరకు తనను తానే అర్పించుకొనెను, దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను, మరియు ఒకరోజు ప్రతిఒక్కరు యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొనును (ఫిలిప్పీ 2:6-11). యేసు మన స్వంత క్రియల ద్వారా పరలోకమును పొందుట అసాధ్యం అని మరియు కేవలం విశ్వాస ద్వారానే సాధ్యమగును అని చెప్పును (మత్తయి 19:26). మనకందరికీ మన పాపములకు నిత్యమైన శిక్షకు పాత్రులము, కాని దేవుని అపరిమిత మైన కృప మరియు ప్రేమ దానినుండి బయటకు తీసెను. “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” (రోమా. 6:23).

స్పష్టముగా, రక్షణ పొందుటకు కేవలం ఒకే ఒక మార్గము అది దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసును తెలుసుకోవడం (యోహాను 17:3). అది క్రియల చేతకాదు గాని, విశ్వాసంద్వారా జరుగును (రోమా 1:17; 3:28). మనము ఏమైయున్నా లేక మనమేమి చేసినా మనం ఆ బహుమానం పొందుదము (రోమా 3:22). “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” (అపొ. 4:12).

మర్మోనులు సాధారణముగా స్నేహంగా, ప్రేమగా, మరియు దయకలిగిన ప్రజలుగా ఉన్నా, వారు దేవుని గుణమును, యేసుక్రీస్తు అను వ్యక్తిని, మరియు తద్వారా రక్షణను వక్రీకరించి, ఒక అబద్ద మతముచే మోసగించబడిరి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

మర్మోనత్వం అనేది ఒక మతాచార వ్యవస్థా? మర్మోనులు ఏమి నమ్మును?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries