ప్రశ్న
పది ఆజ్ఞలు ఏమిటి?
జవాబు
పది ఆజ్ఞలు బైబిలులో పది నియమములు అవి దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశము దేశత్యాగము చేసిన వెంటనే ఇచ్చెను. పది ఆజ్ఞలు పాత నిబంధన చట్టములో నున్న 613 ఆజ్ఞల తప్పనిసరి సారాంశం. మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునితో మన సంబంధము గూర్చి వివరించును. చివరి ఆరు ఆజ్ఞలు ఒకరి పట్ల మరియొకరితో మన సంబంధము గూర్చి వివరించును. బైబిలులో పది ఆజ్ఞలు నిర్గమ 20:1-17లో మరియు ద్వితీ 5:6-21 లో పొందుపరచబడినవి మరియు అవి ఇలా ఉన్నవి:
1) “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.” ఈ ఆజ్ఞ ఒక నిజమైన దేవునిని కాకుండా ఏ దేవునిని ఆరాధించకూడదు. మిగతా ఆన్ని దేవుళ్ళు అసత్య దేవుళ్లు.
2) “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించువాడనై యున్నాను.” ఈ ఆజ్ఞ ఒక విగ్రహమును చేసికొనుటకు వ్యతిరేకముగా, ఒక కనిపించే దేవుని యొక్క ప్రాతినిధ్యము. మనము దేవునిని చిత్రీకరించడానికి ఒక ఖచ్చితమైన ఏ చిత్రమును సృష్టించలేము. దేవునిని గుర్తించుటకు ఒక విగ్రహమును చేస్తే అది అసత్య దేవునిని ఆరాధించుట.
3) “నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్ధముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్ధముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.” ఈ ఆజ్ఞ దేవుని నామమునకు వ్యతిరేకముగా తీసుకున్నది ఫలించదు. మనము దేవుని నామమును తేలికగా చూడకూడదు. మనము దేవునికి గౌరవమును ఆయన నామును మర్యాదగా మరియు గౌరవ విధానంలో ఉచ్చరించాలి.
4) “విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏపనియు చేయ కూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.” ఈ ఆజ్ఞ సబ్బాతును (శనివారం, వారoలో ఆఖరి రోజు) ప్రక్కనపెట్టి ప్రభువుకు ఒక విశ్రాంతి దినముగా సమర్పించాలి.
5) “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.” ఒకరి తల్లితండ్రులను ఎల్లప్పుడు గౌరవ మర్యాదలతో చూడాలని ఈ ఆజ్ఞ.
6) “నరహత్య చేయకూడదు.” మరియొక మానవుని ముందుగా నిశ్చయించి చంపుటకు వ్యతిరేకముగా ఈ ఆజ్ఞ.
7) ”వ్యభిచరింపకూడదు.” ఒకరి భాగస్వామితో కాకుండా మరియొకరితో లెంగిక సంబంధంనకు వ్యతిరేకముగా ఈ ఆజ్ఞ.
8) “దొంగిలకూడదు.” ఒకరికి స్వంతమైనది ఏది తీసుకొనుటకు వ్యతిరేకముగా, ఎవరికైతే అది చెందినదో వారి అనుమతి లేకుండా అని ఈ ఆజ్ఞ.
9) “నీ పొరుగువానిమీద అబద్దసాక్ష్యము పలుకకూడదు.” మరియొక వ్యక్తికి వ్యతిరేకముగా తప్పుగా సాక్ష్యమిచ్చుట నిషేధించుటకు ఈ ఆజ్ఞ. ఇది తప్పనిసరిగా అబద్ధామునకు వ్యతిరేకముగా ఒక ఆజ్ఞ.
10) “నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.” ఒకరి స్వంతము కానిది ఏదైనను ఆశిoపకూడదని ఈ ఆజ్ఞ. ఇతరులది ఆశపడుత పైన చెప్పిన ఆజ్ఞలలో ఒకదానిని పాటించకుండా ఉండుట: హత్య, వ్యభిచారం, మరియు దొంగతనం. ఒకవేళ ఏదైనా చేయడం తప్పయితే, అలాంటి విషయమును కోరుకోవడం కూడా తప్పే.
చాలామంది ప్రజలు తప్పుగా పది ఆజ్ఞలను కొన్ని నియమములుగా, ఒకవేళ అనుసరిస్తే, మరణము తర్వాత పరలోకమునకు ఖచ్చితముగా ప్రవేశము అని చూచును. దానికి విరుద్ధంగా, పది ఆజ్ఞల ఉద్దేశ్యo ప్రజలు ఖచ్చితముగా చట్టమును పాటించలేరని బలవంతముగా తెలిసికొనుటకు (రోమా 7:7-11), మరియు అందువలన దేవుని యొక్క దయ మరియు కృప అవసరంలో ఉండును. మత్తయి 19:16 లో ఉన్న యవ్వన ధనువంతుడైన పాలకుడు పేర్కొన్నప్పటికీ, ఎవ్వరు కుడా ఖచ్చితంగా పది ఆజ్ఞలను పాటించరు (ప్రసంగి 7:20). పది ఆజ్ఞలు మనమందరం పాపము చేశామని (రోమా 3:23) మరియు అందువలన దేవుని కృప మరియు దయ అవసరమని, అది కేవలం యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారానే లభ్యమగునని చెప్పును.
English
పది ఆజ్ఞలు ఏమిటి?