settings icon
share icon
ప్రశ్న

గర్భస్రావం గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

జవాబు


బైబిల్ ఎప్పుడూ గర్భస్రావం గూర్చి ప్రత్యేకంగా చెప్పదు. అయితే, గర్భస్రావం పట్ల దేవుని అభిప్రాయం ఏమిటో అనేక వాక్యభాగాలు స్పష్టంగా తెలియజేస్తాయి. తల్లి గర్భమందు రూపింపబడక మునుపే దేవుడు మనలను యెరిగియున్నాడని యిర్మీయా 1:5 మనకు చెప్తుంది. మనలను సృష్టించడంలో మరియు రూపించడంలో దేవుని యొక్క క్రియాశీలక పాత్రను గూర్చి కీర్తన 139: 13-16 మాట్లాడుతుంది. హత్య చేసినవానివలే గర్భంలో నున్న బిడ్డను చంపినయెడల చంపిన వ్యక్తికి కూడా అదే మరణశిక్ష విధించవలసిందిగా చెప్పబడింది. దేవుడు ఒక పసికందును పూర్తిగా ఎదిగిన వయోజన మనిషివలే పరిగణిస్తాడని స్పష్టంగా తెలుస్తుంది. క్రైస్తవునికి, గర్భస్రావం అనేది స్త్రీ నిర్ణయించవలసినది కాదు. ఇది దేవుని సారూప్యమందు చేయబడిన మానవుని యొక్క జీవిత లేదా మరణ విషయం (ఆది. 1:26-27. 9:6).

క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎగసే మొట్టమొదటి వాదన ఏంటంటే “అత్యాచార సందర్భాల్లో వావి సందర్భాల్లో ఏంటి పరిస్థితి?” అత్యాచారం ఫలితంగా గర్భం ధరించడం ఎంత భయంకరమైనదో, శిశువును చంపడం కూడా అంతే భయంకరం? రెండు తప్పులు కలసి సరియైన దానిని చేయవు. అత్యాచార ఫలితంగా పుట్టిన బిడ్డని పిల్లలు కనలేని ప్రియమైన కుటుంబమునకు ఇవ్వవచ్చు, లేదా సొంత తల్లే బిడ్డను పెంచవచ్చు. మరల, శిశువు పూర్తిగా అమాయకుడు మరియు తన తండ్రి చెడ్డ కార్యాల నిమిత్తమై బిడ్డ శిక్ష పొందకూడదు.

క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎగసే రెండవ వాదన ఏంటంటే “తల్లి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి?” నిజాయితీగా, గర్భస్రావం అంశమును గూర్చి స్పందించడానికి ఇది ఒక కష్టమైన ప్రశ్న. మొదట, ఈ పరిస్థితి నేడు ప్రపంచంలో జరుగుతున్న గర్భస్రావాల యొక్క ఒక శాతంలో పదో వంతు కంటే తక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. తమ జీవితాన్ని కాపాడుకొనేకంటే ఎక్కువ మంది స్త్రీలు నేడు తమ అనుకూలతను కోరుకుంటున్నారు. రెండవదిగా, దేవుడు అద్భుతాలు దేవుడిగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వైద్య పొరపాట్లు తల్లి మరియు బిడ్డ జీవిత పరిస్థితికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు వారి జీవితాలను కాపాడగలడు. చివరగా, ఈ ప్రశ్న భర్త, భార్య మరియు దేవుని మధ్య నిర్ణయించబడాలి. ఇలాటి చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే దంపతులు దేవుడు వారు ఏమి చేయుటకు కోరుకుంటున్నాడో జ్ఞానము కొరకు ప్రార్థించాలి (యాకోబు 1:5).

ఈ దినాలలో జరిగే గర్భస్రావంలో పిల్లలు అక్కరలేదని చేపించుకొనే స్త్రీలు 95 శాతం. 5 శాతం కంటే తక్కువ జరిగే గర్భస్రావాలు అత్యాచారం, వ్యభిచారం, లేదా తల్లి ప్రాణం ఇబ్బందిలో ఉండడమే కారణం. ఈ ఐదు క్లిష్ట పరిస్థితుల్లో కూడా గర్భస్రావం అనేది ప్రథమ నిర్ణయం కాదు. గర్భంలో నున్న శిశువు యొక్క జననమును జరిగించడానికి ప్రతి ప్రయత్నము విలువైనది.

గర్భస్రావం జరిగిన వారు, ఇతర క్షమించరాని పాపముల కంటే తక్కువేమీ కాదు. క్రీస్తుయందు విశ్వాసము ద్వార , ప్రతి పాపము క్షమించబడగలదు (యోహాను 3:16; రోమా 8:1; కొలస్సీ. 1:14). గర్భస్రావం జరిగిన స్త్రీ, గర్భస్రావంను ప్రోత్సహించిన పురుషుడు, లేదా అది జరిగించిన వైద్యుడు – యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వార క్షమింపబడగలడు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

గర్భస్రావం గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries