settings icon
share icon
ప్రశ్న

సంపూర్ణ సత్యము/ సార్వత్రిక సత్యము లాంటి ఒక విషయమేదైనా ఉంటుందా?

జవాబు


సంపూర్ణ లేక సార్వత్రిక సత్యమును అర్థముచేసికొనుటకు, సత్యమును నిర్వచించుట ద్వారా మనము ఆరంభించాలి. నిఘంటువు ప్రకారం సత్యమనగా, “వాస్తవం లేక నిజానికి ఒక నిర్ధారణ; సత్యముగా నిరూపించదగిన లేక అంగీకరించదగిన ఒక వాక్యము.” కొంతమంది ప్రజలు నిజముగా సత్యము లేదని, కేవలం అవగాహనలు మరియు అభిప్రాయాలు ఉండునని చెప్పును. ఇతరులు ఏదోఒక సంపూర్ణ నిజము లేక సత్యము ఉండునని వాదించును.

ఒక చిత్రము నిజమును నిర్వచించే సంపూర్ణతలు ఏమి లేవని చెప్పును. ఈ చిత్రమును కలిగినవారు ప్రతీది వేరే ఒకదానితో సంబంధము కలిగియుండునని, అందువలన నిజానికి వాస్తమేది లేదని నమ్మును. అందునుబట్టి, చివరికి నైతిక సంపూర్ణతలు కానీ, ఒకవేళ ఒక చర్య అనుకూలమా లేక ప్రతికూలమా అని నిర్ణయించుటకు అధికారం కానీ, తప్పా లేక ఒప్పా అనేది ఏమిలేదు. ఈ చిత్రము పరిస్థితికి సంబంధించి ఏది ఒప్పు లేక ఏది తప్పు అని నమ్మే “నైతిక పరిస్థితులకు” దారితీయును. ఒప్పు లేక తప్పు ఏమి లేదు; అందువలన, ఆ సమయంలో మరియు ఆ పరిస్థితిలో ఏది మంచిగా కనిపించునో లేక అనిపించునో అదే సరియైనది. అయినా, నైతిక పరిస్థితులకు సంబంధించి “ఏది మంచిగా అనిపించునో” అనే స్వభావము మరియు జీవనశైలి, వ్యక్తిగతంగా మరియు సమాజముపై విధ్వంసకర ప్రభావము కలుగుటకు దారితీయును. సమస్త విలువలు, నమ్మికలు, జీవనశైలులు, మరియు పేర్కొన్న సత్యాలు సమానముగా చూచు ఒక సమాజమును సృష్టించుటకు, ఇది అనంతర ఆధునికత.

మరియొక చిత్రము ఖచ్చితంగా సంపూర్ణ నిజాలు మరియు ప్రామాణాలు ఉండెనని అవి ఏది సత్యమో మరియు ఏదికాదో నిర్వచించునని చెప్పును. అందువలన, క్రియలు తప్పు లేక ఒప్పు ద్వారా ఆ సంపూర్ణ ప్రమాణాలను ఎలా కొలువవచ్చో నిర్ధారించవచ్చు. ఒకవేళ అది సంపూర్ణత, నిజo కాకపోతే గందరగోళం సంభవించును. ఒకసారి గురత్వాకర్షణ నియమమును తీసుకోండి. ఒకవేళ అది ఖచ్చితం కాకపోతే, మనము కదలాలని నిర్ణయించుకొనేవరకు మనము ఖచ్చితముగా ఒక స్థలములో నిల్చొని లేక కూర్చొని ఉండలేము. లేక ఒకవేళ రెందు రెండు కలిపితే ఎల్లప్పుడు నాలుగుకు సమానం కాకపోతే, నాగరికతపై ప్రభావములు ఘోరముగా ఉండును. విజ్ఞానశాస్త్రము మరియు భౌతిక శాస్త్ర నియమాలు అసంబద్ధం, మరియు కామర్స్ అసాధ్యం. అది ఎంత గజిబిజిగా ఉండునో! అదృష్టవశాత్తు, రెండు రెండు కలిపితే నాలుగే. ఖచ్చితమైన సత్యము ఉండెను, మరియు అది కనుగొనబడి మరియు అర్థమగును.

ఒక వాక్యముగా చేయాలంటే యే ఖచ్చితమైన సత్యము కూడా తార్కికము కాదు. అయినప్పటికీ, ఈరోజు, చాలామంది ఒక సాంస్కృతిక సాపేక్షవాదాన్ని పట్టుకొని అది యే రకమైన ఖచ్చితమైన సత్యమునైనా ఖండించును. “ఖచ్చితమైన సత్యము లేదు” అని చెప్పే ప్రజలను అడుగుటకు ఒక మంచి ప్రశ్నఇది: “దానిని బట్టి నీవు ఖచ్చితముగా ఉన్నావా?” వారు “అవును” అంటే వారు ఒక ఖచ్చితమైన ప్రకటను చేసినట్లు-ఏదైతే దానికదే సంపూర్ణతల ఉనికిని చూపునో. వారు చాలా వాస్తవం ఏమిటంటే ఒకటి మరియు ఒకేఒక ఖచ్చితమైన సత్యము ఖచ్చితమైన సత్యము లేదు అని చెప్పును.

స్వీయ వైరుధ్య సమస్యతో పాటుగా, ఒకరు చాల ఇతర తార్కిక సమస్యలను ఖచ్చితమైన లేక సార్వత్రిక సత్యాలు లేవని నమ్ముటను జయించాలి. ఒకటి ఏంటంటే మానవులందరూ పరిమితమైన తెలివి మరియు పరిమిత మనస్సులు కలిగి, మరియు, అందువలన, తార్కికంగా ఖచ్చితమైన ప్రతికూల ప్రకటనలు చేయరు. ఒక వ్యక్తి తార్కికంగా, “దేవుడు లేడు” (చాలా మంది అలా చేస్తున్న) చెప్పలేడు, ఎందుకంటే అలాంటి ఒక ప్రకటనను చేయుటకు, విశ్వము మొత్తము ప్రారంభము నుండి అంతము వరకు ఖచ్చితమైన జ్ఞానము కలిగియుండవలసిన అవసరం వుంది. అది అసాధ్యము కావడం వలన, చాలామంది ఎవరైనా తార్కికంగా చెప్పుచు “ నాకున్న పరిమిత జ్ఞానముతో, ఒక దేవుడు ఉన్నాడని నేను నమ్మను.”

ఖచ్చితమైన సత్యమును/సార్వత్రిక సత్యమును ఖండించుట వలన మరియొక సమస్య నిజ ప్రపంచములో ఏది మన స్వంత జ్ఞానేంద్రియాలలో సత్యమో, మన స్వంత అనుభవాలు మరియు మనము ఏమి చూస్తామో అది జీవించుటలో విఫలమగును. ఒకవేళ ఖచ్చితమైన సత్యము లాంటి విషయమేమి లేకపోతే, దేనిని గూర్చి ఏది ఒప్పు కాని లేక తప్పు కాని ఉండదు. నీకు ఏది “సరియైనదో” అది నాకు ”సరియైనదని” అర్థము కాదు. ఈ రకమైన సాపేక్ష ఉపరితలముపై ఆకర్షణీయంగా కనబడును, దాని అర్థము ఏమిటంటే ప్రతిఒక్కరు అతడు ఆలోచించేది సరియైనదని తను జీవించి మరియు చేసేది తన స్వంత నియమాలకు అనుగుణంగా ఉండును. అనివార్యంగా, ఒక వ్యక్తి యొక్క సరియైన భావన త్వరలోనే మరియొకరితో విభేదించును. ఒకవేళ నేను ట్రాఫిక్ లైట్లను పట్టించుకోకుండా ఉండటం, అవి ఎరుపులో ఉన్నప్పటికీ, నాకు “సరియైనది” అయితే, ఏమి జరుగును? నేను నా జీవితమును ప్రమాదంలో వుంచుదును. లేక నీనుండి దొంగిలడం సరియైనది అని నేను ఆలోచిస్తే, మరియు అది సరికాదని నీవాలోచించవచ్చు. స్పష్టముగా, మన తప్పు మరియు ఒప్పు ప్రమాణాలు పోరాడును. ఒకవేళ ఖచ్చితమైన సత్యము లేకపోతే, చెప్పవలసిన తప్పు మరియు ఒప్పుల ప్రమాణాలు లేవు, అప్పుడు మనము ఎన్నడూ దేనినిబట్టి ఖచ్చితముగా ఉండము. ప్రజలు వారు ఏమిచేయాలనుకున్నా స్వతంత్రముగా చేయును – హత్య, మానభంగము, దొంగతనము, అబద్ధము, మోసము, మొదలగునవి మరియు అలాంటి విషయాలు తప్పని ఎవరు అనరు. యే ప్రభుత్వమూ, ఏ నియమాలు, మరియు ఏ న్యాయము ఉండదు, ఎందుకంటే ఒకరు కూడా అత్యల్పులపై అధిక ప్రజలు అమలు చేసి జరిగించే ప్రమాణాల మీద కనీసం మాట్లాడరు. సంపూర్ణతలు లేని ప్రపంచము ఊహించగలిగినంత భయంకరమైన ప్రపంచము.

ఒక ఆత్మీయ దృష్టికోణము నుండి, ఈ రకమైన సాపేక్షవాదం మతపరమైన తికమకకు ఫలితమిచ్చును, ఏ ఒక్క నిజమైన మతముతో మరియు దేవునితో సరియైన సంబంధము కలిగిలేకుండా ఉండుట. అన్ని మతాలు అందువలన అసత్యము ఎందుకంటే అవిఅన్నియు తర్వాతి జీవితం గూర్చి ఖచ్చితంగా పేర్కొనును. ఈరోజు ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైన రెండు మతాలు సమానంగా “నిజము”, రెండు మతాలు పరలోకమునకు ఏకైక మార్గము కలిగెనని పేర్కొని లేక పూర్తి వ్యతిరేక “సత్యములను” బోధించిన నమ్మును. ఖచ్చితమైన సత్యమును నమ్మని ప్రజలు ఈ పెర్కొన్నవాతిని మరియు ఆని మతాలు సమానం మరియు అన్ని దారులు పరలోకమునకే నడిపించును అనే సార్వత్రికతను హత్తుకొనును. ఇలాంటి ప్రపంచచిత్రమును హత్తుకొనే ప్రజలు క్రైస్తవ సువార్తీకరణను ఎవరైతే బైబిలు అది యేసు “మార్గము,సత్యము మరియు జీవము” మరియు ఆయనే సత్యమునకు చివరి వ్యక్తీకరణని మరియు పరలోకము చేరుటకు ఏకైక మార్గము (యోహాను 14:6) అని చెప్పేదానిని నమ్మునో వారిని తీక్షణంగా వ్యతిరేకించును.

సహనం అనంతర ఆధునిక సమాజములో, ఒక ఖచ్చితమైన, కార్డినల్ ధర్మముగా మారెను మరియు, అందువలన, అసహనం కేవలం చెడు. ఏ పిడివాద నమ్మకం – మరిముఖ్యముగా ఖచ్చితమైన సత్యములో నమ్మకం – అసహనంగా, అంతిమ పాపముగా చూడబడును. ఖచ్చితమైన సత్యమును ఖండించేవారు తరచుగా నీవు కావాలనుకున్నది నమ్మడం మంచిదే, నీవు ఇతరులపై నీ నమ్మికలను ప్రయోగించకుండా ఉన్నంతవరకు అని చెప్పును. కాని ఈ చిత్రము దానికదే ఏది తప్పు మరియు ఒప్పు గూర్చిన నమ్మకము, మరియు ఈ చిత్రమును పట్టుకొనియున్నవారు చాలా ఖచ్చితముగా ఇతరులపై దానిని ప్రయోగించుటకు ప్రయత్నించుదురు. వారు ఒక ప్రవర్తన ప్రమాణమును తయారుచేసి ఏదైతే ఇతరులు అనుసరించేలా పట్టుబట్టి, తద్వారా వాళ్లు పేర్కొన్న దానినే సమర్థించి ఉల్లంఘిస్తూ – మరియొక స్వ విరుద్ధ స్థానము. అలాంటి నమ్మిక కలిగియున్నవారు వారి క్రియలకు వారు బాధ్యులుగా ఉండుటకు ఇష్టపడరు. ఒకవేళ ఖచ్చితమైన సత్యము వుంటే, అపుడు ఖచ్చితమైన తప్పు మరియు ఒప్పుల ప్రమాణాలు కూడా ఉండును, మరియు ఆ ప్రమాణాలకు మనము బాధ్యత కలిగియుండాలి. ఈ భాద్యతను ప్రజలు ఖచ్చితమైన సత్యమును తిరస్కరించినప్పుడు వారు నిజముగా తిరస్కరిస్తునారు.

ఖచ్చితమైన సత్యము/సార్వత్రిక సత్యమును మరియు సాంస్కృతిక సాపేక్షవాదము ఖండించుట జీవితము వివరించిన పరిణామ సిద్ధాంతము హత్తుకొనుట వలన సమాజము యొక్క తార్కిక ఫలితముతో వచ్చును. ఒకవేళ సహజసిద్ధమైన పరిణామం నిజమైతే, అప్పుడు జీవితమునకు అర్థము లేదు, మనకు ఉద్దేశము లేదు, మరియు ఏ ఖచ్చితమైన ఒప్పు లేక తప్పు కూడా ఉండదు. అప్పుడు మనుష్యుడు అతని క్రియలకు ఎవరికి బాధ్యుడుగా ఉండకుండా మరియు తనను సంతోషపరచుకొనుచు స్వేచ్చగా జీవితము గడుపును. అయినా పాపముతోనిండిన మనుష్యులు దేవుని ఉనికిని మరియు ఖచ్చితమైన సత్యమును ఎంత ఖండించినా, వారు ఏదోఒకరోజు ఆయన ముందు తీర్పులో నిలుచును. బైబిలు ప్రకటించును, “..ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారిమధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువు లను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్దులైరి. వారి అవివేకహృదయము అంధకారమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి” (రోమా 1:19-22).

ఖచ్చితమిన సత్యము యొక్క ఉనికికి ఏదైనా ఆధారము ఉందా? అవును, మొదటిగా మానవ మనస్సాక్షి, మనలోపల ఉన్న “ఏదోఒకటి” మనకు లోకము ఒక నిర్దిష్ట విధానములో వుందని, మరియు కొన్ని విషయాలు ఒప్పని మరియు కొన్ని తప్పు అని చెప్పును. మన మనస్సాక్షి బాధలో, ఆకలిలో, బలాత్కారము, నొప్పి, మరియు కీడులో ఏదో తప్పు ఉందని ఒప్పింప జేయును, మరియు అది ప్రేమ, ఔదార్యము, దయ, మరియు శాంతి అనే అనుకూల విషయాల కొరకు మనము పోరాడుటకు జాగ్రత్తపడాలి. ఇది సార్వత్రికముగా ఆన్ని సంస్కృతులలో అన్ని సమయాలలో సత్యము. రోమా 2:14-16లో బైబిలు మానవ మనస్సాక్షి యొక్క పాత్రను వర్ణించును: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.”

ఖచ్చితమైన సత్యము యొక్క ఉనికికి రెండవ ఆధారము విజ్ఞానశాస్త్రము. విజ్ఞానము అనగా కేవలం జ్ఞానము యొక్క ముసుగు, మనకు తెలిసిన దానిగూర్చి అధ్యయనం మరియు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే తపన. అందువలన, సమస్త విజ్ఞాన అధ్యయన అవసరత లోకములో ఉన్న బాహ్య వాస్తవాల ఉనికి మరియు ఈ వాస్తవాలు కనుగొనబడి మరియు నిరూపించబడాలి అనే నమ్మికపై కనుగొనవచ్చు. సంపూర్ణతలు లేకుండా, చదవడానికి ఏముంటుంది? విజ్ఞానము యొక్క పరిశోధనలు నిజమని ఒకరు ఎలా తెలిసికొనును? వాస్తవానికి, అవే విజ్ఞాన సూత్రాలు ఖచ్చితమైన సత్యము యొక్క ఉనికిపై కనుగొనెను.

ఖచ్చితమైన సత్యము/సార్వత్రిక సత్యము యొక్క ఉనికికి మూడవ ఆధారము మతము. ప్రపంచములోని అన్ని మతములు జీవితo యొక్క అర్థము మరియు నిర్వచనం ఇచ్చు ప్రయత్నం చేయును. అవి కేవలం ఉనికి కాదు అంతకంటే ఎక్కువైన మానవాళి కోరికను బట్టి ఉద్భవించినది. మతము ద్వారా, మానవులు దేవుని వెదకును, భవిష్యత్తు కొరకు నిరీక్షించి, పాపముల క్షమాపణ, కష్టము మధ్యలో నెమ్మది, మన తీవ్రమైనమైన ప్రశ్నలకు సమాధానం కోరును. మానవాళి కేవలం ఒక అత్యధిక పరిణామ జంతువు అనేదానికి మతము నిజముగా ఆధారము. ఇది ఒక అత్యధిక వుద్దేశ్యమునకు మరియు ఎవరైతే మానవునిలో ఆయనను తెలిసికోవాలనే కోరికను పెట్టెనో, ఆ వ్యక్తగత మరియు ఉద్దేశపూర్వక సృష్టికర్త ఉనికికే ఆధారము. మరియు ఒకవేళ బహుశా ఒక సృష్టికర్త వుంటే, అప్పుడు ఆయన ఖచ్చితమైన సత్యమునకు ప్రమాణముగా మారును, మరియు ఆయన అధికారమే సత్యమును స్థాపించును.

అదృష్టవశాత్తు, అలాంటి ఒక సృష్టికర్త ఉండెను, మరియు అయన తన సత్యమును మనకు ఆయన వాక్యము, పరిశుద్ధ గ్రంధము, ద్వారా బయలుపరచెను. ఖచ్చితమైన సత్యము/సార్వత్రిక సత్యమును తెలిసికొనుట కేవలం యేసుక్రీస్తు – సత్యమును నేనే అని పేర్కొన్న ఒకనితో వ్యక్తిగత సంబంధము ద్వారానే సాధ్యము. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చూడలేడు అని చెప్పెను (యోహాను 14:6). ఖచ్చితమైన సత్యము ఉనికికి వాస్తవము ఏమిటంటే ఒక మహోన్నతుడైన దేవుడు భూమిని ఆకాశమును సృష్టించి మరియు వ్యక్తిగతంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనకుతానే మనకు బయలుపరచుకొనెను. ఇది ఖచ్చితమైన సత్యము.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

సంపూర్ణ సత్యము/ సార్వత్రిక సత్యము లాంటి ఒక విషయమేదైనా ఉంటుందా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries