ప్రశ్న
అజ్ఞేయం అనగానేమి?
జవాబు
అజ్ఞేయం అనగా దేవుడు ఉన్నాడు అనేది తెలిసికొనుట అసాధ్యము లేక నిరూపించలేమనే దృక్పథం. “అజ్ఞేయం” అనే పదానికి అవసరమైన అర్ధము “జ్ఞానం లేని.” అజ్ఞేయం అనేది నాస్తికత్వమునకు మేధస్సుగల మరిఎక్కువైన నిజాయితీ రూపము. నాస్తికత్వం దేవుడు లేడనే- ఒక నిరూపించలేని స్థానమును పేర్కొనును. అజ్ఞేయం దేవుడు ఉనికిని నిరూపించడం లేక నిరూపించలేకపోవడం, దేవుడు ఉన్నాడా లేదా అనేది తెలిసికోవడం అసాధ్యమనే దానిగూర్చి వాదించును. ఇందులో, అజ్ఞేయం సరియైనది. దేవుడు ఉన్నాడు అనేది నిరూపించడం లేక ఖండించడం అనేది ఆమోదయోగ్యమైనది కాదు.
దేవుడు ఉన్నాడు అనేది విశ్వాసముతో అంగీకరించాలని బైబిలు మనకు చెప్పుచున్నది. హెబ్రీ 11:6 విశ్వాసములేకుండ “దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” అని చెప్పుచున్నది. దేవుడు ఆత్మ (యోహాను 4:24) గనుక ఆయనను చూడలేము లేక తాకలేము. దేవుడు తననుతాను కనపరచుకోవాలని ఎంచుకొంటేతప్ప, ఆయన మన ఇంద్రియములకు అదృశ్యముగా ఉండును (రోమా 1:20). దేవుని ఉనికి విశ్వములో స్పష్టముగా కనబడును (కీర్తనలు 19:1-4), సహజముగా భావింపబడి (రోమా 1:18-22), మరియు మన స్వంత హృదయాలలో నిర్థారింపబడుటను (ప్రసంగి 3:11) బైబిలు ప్రకటించును.
దేవుని ఉనికికి అనుకూలంగా కాని వ్యతిరేకంగాగాని అజ్ఞానులు ఒక నిర్ణయము తీసికొనుటకు ఇష్టపడరు. ఇది “కంచెను అడ్డుకొనే” అంతిమ స్థానము. ఆస్తికులు దేవుడు ఉన్నాడని నమ్మును. నాస్తికులు దేవుడు లేడని నమ్మును. దేవుని గూర్చిన జ్ఞానము లేనివారు దేవుని ఉనికిని విశ్వసించడం కాని విశ్వసించకపోవడం గాని చేయకూడదని నమ్మును, ఎందుకంటే ఇంకొక మార్గంలో తెలిసికొనుట అసాధ్యం.
వాదనల కోసo, మనం దేవుని ఉనికిని కాదనలేని ఆధారములను ప్రక్కన పడేద్దాము. ఒకవేళ మనము ఆస్తిక మరియు అజ్ఞేయ స్థానాలను సమాన హోదాలో పెడితే, అది మరణము తర్వాత జీవితం గూర్చిన సాధ్యాలను బలముగా నమ్మే “భావన”ను కలిగించును? ఒకవేళ దేవుడు లేకపోతే, ఆస్తికులు మరియు దేవుని గూర్చిన జ్ఞానము లేనివారు వారు మరణించినప్పుడు ఒకేవిధముగా ఉనికిని కోల్పోవుదురు. ఒకవేళ దేవుడు ఉంటే, ఆస్తికులు మరియు దేవుని గూర్చిన జ్ఞానం లేనివారు ఇద్దరికి వారు చనిపోయినప్పుడు వారికి సమాధానం చెప్పేవారు ఒకరుoదురు. ఈ విధానము నుండి, ఒక అజ్ఞానిగా ఉండుటకంటే ఒక ఆస్తికునిగా ఉండడం ఖచ్చితముగా ఎక్కవ “భావన” కలిగించును. ఒకవేళ వేరే స్థానం నిరుపించబడినా లేక లేకపోయినా, బాగుగా పరిశీలించి ఎక్కువగా కోరుకొనిన అపరిమితమైన మరియు నిత్యమైన చివరి ఫలితము యొక్క స్థానమునకు చేసిన ప్రతి ప్రయత్నము తెలివిగా కనబడును.
సందేహములు ఉండుట సహజం. ఈ లోకములో మనకు అర్ధముకానివి చాలా విషయాలు ఉన్నవి. తరచుగా, ప్రజలు దేవుని ఉనికిని అనుమానించును ఎందుకంటే వారు ఆయన చేసినవి మరియు కలిగించిన విషయాలను అర్ధంచేసికొనరు లేక అంగీకరించరు. అయితే, పరిమితమైన మానవులుగా అపరిమితమైన దేవునిని గ్రహించగలగడం మనము ఊహించకూడదు. రోమా 11:33-34 గట్టిగా చెప్పును, “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు?” మనము దేవునిని విశ్వాసం ద్వారా మరియు ఆయన మార్గములను విశ్వాసం ద్వారా నమ్మవలెను. దేవుడు ఆయనను నమ్మినవారికి అద్బుతమైన విధానములలో తననుతాను కనుపరచుకొనుటకు సిద్ధముగా మరియు ఇష్టపూర్వకముగా ఉండును. ద్వితీయోపదేశకాండము 4:29, “అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును” అని ప్రకటించును.
English
అజ్ఞేయం అనగానేమి?