ప్రశ్న
మద్యం/వైన్ సేవించుటను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?
జవాబు
మద్యం సేవించుటను గూర్చి లేఖనము అనేక విషయములను చెబుతుంది (లేవీ. 10:9; సంఖ్యా. 6:3; ద్వితీ. 29:6; న్యాయాధి. 13:4, 7, 14; సామెతలు 20:1; 31:4; యెషయా 5:11, 22; 24:9; 28:7; 29:9; 56:12). అయితే, బీరు, వైన్, లేక మద్యం కలిగియున్న ఏ ఇతర పానీయమును త్రాగుట నుండి క్రైస్తవుని లేఖనము నిషేధించదు. వాస్తవానికి, కొన్ని లేఖనములు మద్యమును గూర్చి భావార్థకముగా చర్చిస్తాయి. “ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము” అని ప్రసంగి 9:7 బోధిస్తుంది. “నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును” దేవుడు వారికి ఇస్తాడని కీర్తనలు 104:14-15 వ్యాఖ్యానిస్తుంది. సొంత ద్రాక్షతోట నుండి ద్రాక్ష రసము త్రాగుట దేవుని ఆశీర్వాదమునకు చిహ్నమని ఆమోసు 9:14 చర్చిస్తుంది. “రండి....ద్రాక్షరసమును పాలను కొనుడి” అని యెషయా 55:1 ప్రోత్సహిస్తుంది.
మద్యమును గూర్చి క్రైస్తవులకు దేవుడు ఏమని హెచ్చరిస్తాదంటే బహు మద్య పానమును నిషేధించమని (ఎఫెసీ. 5:18). బహు మద్యపానము మరియు దాని పరిణామాలను బైబిల్ ఖండిస్తుంది (సామెతలు 23:29-35). తమ శరీరములపై ఏ విషయము కూడా “అధికారం” తీసుకొనకుండా చూసుకొనమని క్రైస్తవులకు ఆజ్ఞ ఇవ్వబడెను (1 కొరింథీ. 6:12; 2 పేతురు 2:19). అధికముగా మద్యం సేవించుట ఖచ్చితముగా వ్యసనమునకు దారితీస్తుంది. ఇతర క్రైస్తవులకు ఆటంకం కలిగించు ఏ వస్తువు చేయకుండా లేక వారి మనస్సాక్షికి విరోధంగా పాపము చేయుటకు వారిని ప్రోత్సహించుట నుండి క్రైస్తవులు నిషేధించబడిరి (1 కొరింథీ. 8:9-13). ఈ నియమాల వెలుగులో, దేవుని మహిమ కొరకు తాను అధికముగా మద్యం సేవించుచున్నాడని ఒక క్రైస్తవుడు చెప్పుట చాలా కష్టము (1 కొరింథీ. 10:31).
యేసు నీటిని ద్రాక్షరసముగా మార్చెను. కొన్ని సందర్భాలలో యేసు స్వయంగా ద్రాక్షరసము త్రాగినట్లు అనిపిస్తుంది (యోహాను 2:1-11; మత్తయి 26:29). క్రొత్త నిబంధన కాలంలో, నీరు పరిశుభ్రంగా ఉండేవి కావు. ఆధునిక పరిశుభ్రతకు లేనందున, నీరు ఎక్కువగా క్రిములు, కీటకాలతో నిండియుండేవి. నేటి మూడవ-ప్రపంచ దేశాలలో కూడా ఇదే పరిస్థితి. అందు వలన, ప్రజలు ఎక్కువగా వైన్ (లేక ద్రాక్ష రసమును) త్రాగేవారు. ఎందుకంటే అది కలుషితమైయ్యే అవకాశాలు తక్కువగా ఉండేవి. నీరు త్రాగుట చాలించి (అవి అతనికి కడుపు సమస్యలు కలిగించియుండవచ్చు), బదులుగా ద్రాక్ష రసము త్రాగమని 1 తిమోతి 5:23లో పౌలు తిమోతిని హెచ్చరించుచున్నాడు. ఆ దినాలలో ద్రాక్ష రసమును నిల్వ ఉంచేవారుగాని (మద్యంగా మారుటకు), నేడు చేయునంతగా కాదు. అది ద్రాక్ష రసము కాదని చెప్పుట సరికాదు, అదే విధంగా అది నేడు ఉపయోగించు వైన్ వంటిదే అని చెప్పట కూడా సరికాదు. మరలా, బీర్, వైన్, లేక మద్యం కలిగియున్న ఇతర పానీయములను త్రాగుటను బైబిల్ నిషేధించదు. మద్యం అనిదే పాపముతో నిండియున్నది కాదు. ఒక క్రైస్తవుడు బహు మద్యపానము నుండి మరియు మద్యమునకు బానిస అగుట నుండి జాగ్రత్త పడాలి (ఎఫెసీ. 5:18; 1 కొరింథీ. 6:12).
మద్యం తక్కువ మొత్తంలో తీసుకొనుట హాని కలిగించదు మరియు వ్యసనం కూడా కాదు. వాస్తవానికి, ఆరోగ్య కారణాలకు ముఖ్యముగా గుండె కొరకు కొంత రెడ్ వైన్ త్రాగమని కొందరు వైద్యులు సలహా ఇస్తారు. కొంత మొత్తంలో మద్యం సేవించుట క్రైస్తవ స్వేచ్ఛలో భాగము. బహు మద్యపానము మరియు వ్యసనము పాపం. అయితే, మద్యం సేవించుట మరియు దాని పరిణామాలను గూర్చి బైబిల్ ఆలోచనలు, మద్యం ఎక్కువగా సేవించాలని కలిగే శోధన, మరియు ఇతరులకు హాని లేక ఆటంకం కలిగించుట వలన, ఒక క్రైస్తవుడు మద్యపానమును నిషేధించుట ఉత్తమము.
English
మద్యం/వైన్ సేవించుటను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? క్రైస్తవుడు మద్యం/వైన్ సేవించుట పాపమా?