బైబిలు దేవదూతలు గురించి ఏమిచెప్తుంది?ప్రశ్న: బైబిలు దేవదూతలు గురించి ఏమిచెప్తుంది?

జవాబు:
దేవదూతలు అనేవి అవి ఆత్మీయజీవులు లేక అస్థిత్వాలు వాటికి బుద్ది ఙ్ఞానము, భావోద్రేకాలు మరియు చిత్తము వున్నవి. మంచి మరియు చెడు దూతలు (దయ్యములు)ఇది చాల సత్యము. దూతలు బుద్ది ఙ్ఞానమును కలిగివున్నవి (మత్తయి 8:29; 2కొరింథీయలకు 11:3; 1 పేతురు 1:12), భావాలను కనుపరుస్తాయి ( లూకా 2:13; యాకోబు 2:19; ప్రకటన 12:17), మరియు చిత్తమును అభ్యసిస్తాయి (లూకా8:28-31; 2 తిమోతి 2:26; యూదా6). దూతలు ఆత్మీయజీవులు (హెబ్రీయులు 1:14)నిజమైన శరీరములులేని జీవులు. అవి శరీరక నిర్మాణములేని జీవులైనప్పటికి అవి వ్యక్తిత్వాలు కలిగినవే.

అవిసృష్తించబడినజీవులుకాబట్టి, వాటి ఙ్ఞానము పరిమితమే. దేవుడు ఏమేమిచేస్తున్నాడో అన్ని వాటికి తెలియదు( మత్తయి 24:36). మానవులకన్న ఎక్కువైన ఙ్ఞానమును కలిగియున్నట్లు అగుపడుతుంది, ఏదిఏమైనప్పటికి, మూడు విషయాలనుబట్టి అయిఉండవచ్చు. మొదటిది, సృష్టించబడిన సృష్టమువాటన్నిటిలో మానవులకన్న దూతలకు ఎక్కువ ఙ్ఞానం ఇవ్వబడింది. అందుచేత, గొప్ప ఙ్ఞానాన్ని లోలోపల కలిగినవారు. రెండవది, దూతలు బైబిలును మరియు దేవునిని బాగా మానవులకన్నా అత్యధికముగా అభ్యసించినవారు మరియు దానినుండి ఙ్ఞానాన్ని పొందుకున్నారు (యాకోబు 2:19; ప్రకటన 12:12). మూడవది, దూతలు విసృతంగా మానవులు పాల్గొనేవిషయాలను పరిశీలించుటవలన ఙ్ఞానాన్ని పొందుకున్నారు. మానవలవలె, దూతలు గతించినవాటిని అధ్యయనం చేయరు; అవివాటిని అనుభవించారు. అందునుబట్టి, వారికి బాగ తెలుసు ఇతరులు పరిస్థితులకు ఏవిధంగా స్పందించి పతిచర్య చూపిస్తారో మరియు మనము అదేవిధమైన పరిస్థితులలో ఏవిధంగ నిఖ్ఖర్చిగా పతిస్పందిస్తామో ముందుగానే తెలుసుకొనగలవు.

వారికి చిత్తమువున్నప్పటికి, దూతలు, మిగిలిన సృష్టివలే, దేవుని చిత్తమునకు విధేయత చూపించవలసిన బద్దులైయున్నరు. మంచిదూతలు విశ్వాసులకు సహాయము చేయుటకు దేవునిచేత పంపబడ్డారు (హెబ్రీయులకు 1:14). ఇక్కడ కొన్ని పనులు దేవునిదూతలకు ఇవ్వబడినట్లు బైబిలు చెప్తున్నది: దేవుని స్తుతిస్తారు(కీర్తనలు 148:1-2; యెషయా 6:3).దేవునిని ఆరాధిస్తారు(హెబ్రీయులకు 1:6; ప్రకటన 5:8-13). దేవుడు చేసిన వాటినిబట్టి ఉత్సాహిస్తారు(యోబు 38:6-7). దేవునిని సేవిస్తారు (కీర్తనలు 103:20; పకటన 22:9). దేవునిముందు ప్రత్యక్షమవుతారు(యోబు 1:6; 2:1). దేవుని యొక్కతీర్పులో వీరును పనిముట్టులే (ప్రకటన 7:1; 8:2). ప్రార్థనలకు జవాబును తీసుకొనివస్తారు (అపోస్తలులకార్యములు 12:5-10). క్రీస్తుకొరకు వ్యక్తులను సంపాదించుటలో వీరును సహాయన్ని అందిస్తారు (అపోస్తలులకార్యములు 8:26; 10:3). క్రైస్తవ పద్డతిని, పనిని , మరియు శ్రమను ఆచరిస్తారు (1 కొరింథియులకు 4:9; 11:10; ఎఫెసీయుఅల్కు 3:10; 1 పేతురు 1:12). కష్టస్మయాలలో ప్రోత్సాహిస్తారు (అపోస్తలులకార్యములు 27:23-24). నీతిమంతుల మరణపు సమయాలలో శ్రధ్దతీసుకుంటారు (లూకా 16:22).

సృష్టి క్రమములో దూతలు మానవులకన్నా ప్రత్యేకమైన స్థాయికి చెందినవారు. మానవులు చనిపోయినతరువాత వారు దూతలు అవ్వరు. దూతలు ఎప్పటికి, ఎన్నటికి మానవులు అవ్వరు మరియు కాదు.దేవుడు మానవులను సృష్టించ్హినట్లే దేవదూతలను సృష్టించ్హాడు. బైబిలులో ఎక్కడకూడ దూతలు దేవుని స్వరూపములో మరియు పోలికచొప్పున మానవులవలే సృష్టించబడ్డారని వ్రాయబడలేదు (ఆదికాండం 1:26). దూతలు ఆత్మీయజీవులు గనుక కొంతవరకు శారీరకరూపమును కలిగివుండవచ్చు. మానవులు ప్రాధమికంగా శారీరక జీవులు, గాని ఆత్మీయ దృష్టి కలిగినవారు. పరిశుధ్ధ దూతలనుండి మనము నేర్చుకొనవల్సినదేంటంటే ప్రశ్నించకుండ, ఆకస్మికముగా దేవుని ఆఙ్ఞలకు విధేయతచూపించటం.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బైబిలు దేవదూతలు గురించి ఏమిచెప్తుంది?