ప్రశ్న
వినాశనము బైబిలు సంబంధమైనదా?
జవాబు
వినాశనము అనేది అవిశ్వాసులు నరకములో నిత్యమూ బాధపడరని, బదులుగా మరణము తర్వాత “ఆరిపోవుదురు” అని నమ్ముట. చాలామందికి, వినాశనము అనేది ఒక ఆసక్తికర నమ్మకం ఎందుకoటే ప్రజలు నిత్యము నరకంలో గడుపుట అనే ఆలోచన చాలా భయంకరము. వినాశనమునకు వాదించేలా కనబడే కొన్ని ప్రకరణలు ఉండెను, నరకములో నిత్యశిక్ష అనే వాస్తవం చెడ్డవారి యొక్క గమ్యమును వెల్లడిచేయుట గూర్చి సమగ్రంగా బైబిలు చెప్పేది చూడుము. ఈ క్రింది సిద్ధాంతములలో ఒకటి లేక ఎక్కువ వాటిని అనుసరించి అపార్థము చేసికొనిన ఫలితము వినాశనమును నమ్మడం: 1) పాపము యొక్క పరిణామాలు, 2) దేవుని యొక్క న్యాయం, 3) నరకము యొక్క పనితీరు.
నరకం యొక్క పనితీరు సంబంధంలో, అగ్ని సరస్సు యొక్క అర్థమును వినాశనము అపార్థము చేసికొనెను. స్పష్టముగా, ఒకవేళ ఒక మానవుడు మండుచున్న అగ్ని సరస్సులో వేయబడితే, అతడు/ఆమె దాదాపుగా తక్షణమే దహించబడును. అయితే, ఆ అగ్ని సరస్సు శారీరక మరియు ఆత్మీయ రాజ్యము రెండింటిలో ఉండును. అదే కేవలము ఒక మానవ శరీరం ఆగి సరస్సులోనికి త్రోయబడుట కాదు; అది మానవుని యొక్క శరీరము, ప్రాణం, మరియు ఆత్మ. ఒక ఆత్మీయ స్వభావం భౌతిక అగ్నిచే వినియోగింపబడలేదు. రక్షింపబడిన వారివలే రక్షింపబడనివారు కూడా నిత్యత్వమునకు సిద్ధపడిన శరీరంతో పునరుత్థానమగునట్లు కనబడును (ప్రకటన 20:13; అపొ. 24:15). ఈ శరీరములు నిత్యమైన విధికి సిద్ధపరచబడినవి.
వినాశనకారులు సంపూర్ణంగా గ్రహించుటకు విఫలమైన మరియొక విషయం నిత్యత్వము. వినాశనకారులు గ్రీకు పదము aionion, సాధారణముగా “నిత్యము” అని అనువదించబడి, కాని నిర్వచనంగా అర్థము “నిత్యము” కాదని సరిచేయును. ఇది పేర్కొన్న కాలానికి ఒక “యుగము” లేక “చాలా కాలం క్రితం” అని సూచించును. అయితే, క్రొత్త నిబంధనలో స్పష్టముగా, aionion అనేది కొన్నిసార్లు ఒక నిత్యమైన దీర్ఘ కాలమును సూచించడానికి వాడెను. ప్రకటన 20:10 అపవాది, క్రూరమృగమును, మరియు అబద్దప్రవక్తయు అగ్ని గంధకములుగల గుండములో పడవేసి మరియు “యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడునని” మాట్లాడును. ఈ మూడు అగ్ని గుండములో పడవేయుట వలన “ఆరిపోలేదు” అనేది స్పష్టము. రక్షింపబడనివారి విధి విభిన్నంగా ఎందుకు ఉండును (ప్రకటన 20:14-15)? నరకం యొక్క నిత్యత్వము గూర్చి ఎక్కువ నమ్మకము కలిగించే ఆధారం మత్తయి 25:46, “వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకు పోవుదురు.” ఈ వచనములో, చెడ్డవారు మరియు నీతిమంతుల గమ్యమును సూచించుటకు అదే గ్రీకు పదము వాడబడెను. ఒకవేళ చెడ్డవారు ఒక “యుగము” మాత్రమే బాధింపబడితే, అప్పుడు నీతిమంతులు పరలోకంలో ఒక “యుగము” మాత్రమే జీవితం అనుభవించును. ఒకవేళ విశ్వాసులు పరలోకములో నిత్యము ఉంటే, అవిశ్వాసులు నరకంలో నిత్యము ఉందురు.
వినాశనకారులు నరకం యొక్క నిత్యత్వం గూర్చి తరచుగా అభ్యంతరం చూపే మరియొకటి ఒక పరిమిత పరిమాణ పాపమునకు దేవుడు అవిశ్వాసులను నరకములో నిత్యము శిక్షించుట అన్యాయము. ఒక వ్యక్తి 70 సంవత్సరాల పాప జీవితమునకు, అతడిని/ఆమెను నిత్యము శిక్షించుట దేవునికి ఎలా మంచిది? సమాధానము మన పాపములు శాశ్వత పరిణామo కలిగియుండును, ఎందుకంటే అది ఒక శాశ్వత దేవునికి వ్యతిరేకముగా చేయబడెను. రాజైన దావీదు వ్యభిచారము మరియు హత్య అనే పాపము చేసినప్పుడు అతడు చెప్పెను, “నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను...” (కీర్తనలు 51:4). దావీదు బెత్షేబా మరియు ఊరియాకు వ్యతిరేకముగా పాపము చేసెను; దావీదు కేవలం దేవునికి వ్యతిరేకముగా పాపము చేసితినని ఎలా పేర్కొన్నాడు? పాపము అంతయు చివరిగా దేవునికి వ్యతిరేకమని దావీదు అర్థముచేసికొనెను. దేవుడు ఒక శాశ్వతమైన మరియు అపరిమితమైన వ్యక్తి. దాని ఫలితంగా, ఆయనకు విరోధంగా ఉన్న పాపమంతటి విలువ ఒక శాశ్వత శిక్ష. ఎంతకాలము పాపము చేశాము అనేది విషయం కాదు. గాని మనము ఎవరికి విరోధముగా పాపము చేశామో ఆ దేవుని గుణము.
వినాశనము యొక్క మరింత వ్యక్తిగత అంశం ఒకవేళ మనకు ఇష్టులైనవారిలో కొందరు నరకంలో నిత్యము బాధింపబడు తుంటే మనము పరలోకంలో ఆనందముగా ఉండడం సాధ్యం కాదు అనే ఆలోచన. అయితే, మనము పరలోకము చేరుకొన్నప్పుడు, మనము గురించి ఫిర్యాదు గాని లేక చింతించడం గాని ఉండదు. ప్రకటన 21:4 మనకు చెప్పుచున్నది, “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” ఒకవేళ, మన బంధువులలో ఎవరైనా పరలోకంలో లేకపోతే, మనము 100 శాతం వారు అక్కడికి చెందరని మరియు వారు యేసుక్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించుటకు వారి స్వంత తిరస్కారము వలన దండింపబడెననే పూర్తి అంగీకారంలో ఉందుము (యోహాను 3:16; 14:6). ఇది అర్థముచేసికొనుట కష్టము, కాని వారు లేకపోవడం వలన మనము దుఃఖించము. మన దృష్టి అక్కడ మన బంధువులు లేకుండా పరలోకంలో ఎలా ఆనందిస్తాము అని కాదు కాని, వారు అక్కడ ఉండేలా వారి విశ్వాసం క్రీస్తులో ఉండేలా ఎలా చూపిస్తాము అనేది విషయం.
నరకం బహుశా దేవుడు యేసుక్రీస్తును మన పాపముల వెల చెల్లించుట కొరకు ఎందుకు పంపెనో అనుటకు ఒక ప్రాధమిక కారణం. మరణము తర్వాత “ఆరిపోవడం” భయంకరమైన విధి కాదు, గాని నరకంలో నిత్యత్వము చాల ఖచ్చితము. యేసు మరణం ఒక అపరిమితమైన మరణము, నరకంలో దానిని మనము నిత్యము భరించకుండా మన పాపరుణమును చెల్లించెను (2 కొరింథీ 5:21). మనము మన విశ్వాసమును ఆయనలో ఉంచినప్పుడు, మనము రక్షిoపబడి, క్షమించబడి, కడుగబడి, మరియు పరలోకములో ఒక శాశ్వత గృహమునకు వాగ్దానం చేయబడును. కాని ఒకవేళ మనము దేవుని బహుమానమైన శాశ్వత జీవితమును తిరస్కరిస్తే, ఆ నిర్ణయమును బట్టి మనము శాశ్వత పరిణామాలు ఎదుర్కొందుము.
English
వినాశనము బైబిలు సంబంధమైనదా?