రక్షణ నిశ్చయతను నేను ఏలాగు కలిగియుండగలను?ప్రశ్న: రక్షణ నిశ్చయతను నేను ఏలాగు కలిగియుండగలను?

జవాబు:
నీవు రక్షణ పొందిన విషయాన్ని ఖచ్చితముగా ఎలాగు తెలిసికోగలవు? 1యోహాను 5:11-13 ను ఆలోచించు " ఆ సాక్ష్యమేమనగా- దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను."కుమారునియందున్నది ఎవరు? వారు, అంటే ఆయనయందు విశ్వాసముంచి, అంగీకరించినవారు (యోహాను 1:12). నీలో యేసు ఉన్నట్లయితే నీలో జీవమున్నట్లే. తాత్కాలికమైన జీవం కాదు గాని శాశ్వతమైనది.

దేవుడు మననుండి కోరుకొనేది మన రక్షణ పట్ల నిశ్చయత కలిగియుండాలని. మనము నిజంగా రక్షింపబడ్డమాలేదా అంటూ అశ్చర్యపోతూ, లేక విచారిస్తూ క్రైస్తవ జీవితాన్ని జీవించలేం. అందుకే బైబిలు రక్షణ ప్రణాళికను చాల స్పష్టముగా వివరిస్తుంది. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షింపబడుదువు ( యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 16:31). మన పాపములకొరకై ప్రాయశ్చిత్తముగా వెలచెల్లించాడని మన నిమిత్తమై ఆయన మరణించాడని, రక్షకుడని నీవు యేసునందు విశ్వాసమును చూపగలవా ( రోమా 5:8; 2కొరింథి 5:21)? నీ రక్షణకొరకు ఆయనయందు మాత్రమే నమ్మికయుంచుతున్నావా? నీ జవాబు అవును అని అన్నట్లయితే నీవు రక్షిణపొందినావు. నిశ్చయత అనగా "అనుమానాన్ని అధిగమించి నీవునమ్మటం." నీ హృదయం దేవుని వాక్యానికి కేంద్రమయితే "అనుమానాన్ని అధిగమించి" నీవు నిత్య రక్షణ గూర్చిన సత్యాన్ని, వాస్తవాలను నమ్ముతావు.

యేసు తన్ను తానే ఆయనయందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారి విషయమై ధృఢపరుస్తున్నాడు "నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు"( యోహాను 10:28-29). నిత్యజీవము అంటే అది ఎన్నడూ -నిత్యమే. యేసుక్రిస్తు ఉచితముగా యిచ్చిన రక్షణా కృపావరమును, నీవుగాని మరి యింకెవరును నీయొద్దనుండి తీసివేయలేరు.

వాక్యమును మన హృదయములో ఉంచుకొనుట ద్వారా ఆయనకు వ్యతిరేకముగా పాపము చేయలేము (కీర్తనలు 119:11)ఇది పాపమునుగూర్చిన అనుమానాన్ని నివృత్తిచేయును. దేవుని వాక్యము నీకు ఏదైతే భోధిస్తుందో దానిని యందు నీవు సంతోషించు అప్పుడు నీవు అనుమానించుటకు బదులు భరోసా కలిగి జీవించగలవు. క్రీస్తు సొంతమాటల ఆధారంగా మనము నిశ్చయత కలిగి మన రక్షణ ఎన్నటికి ప్రశ్నార్థకం కాదు. మన నిశ్చయత దేవుని ప్రేమ యేసుక్రీస్తు ద్వార మనకు వెల్లడి అగుటపై ఆధారపడివుంది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


రక్షణ నిశ్చయతను నేను ఏలాగు కలిగియుండగలను?