settings icon
share icon
ప్రశ్న

జనన నియంత్రణను గూర్చి బైబిలు చెప్పుచున్నది? జనన నియంత్రణను క్రైస్తవులు ఉపయోగించవచ్చా?

జవాబు


“ఫలించి మరియు అభివృద్ధి పొందుడి” (ఆది. 1:28) అని మానవుడు దేవునిచే ఆజ్ఞాపించబడినాడు. ఒక స్థిరమైన వాతావరణములో పిల్లలను కనుటకు మరియు పెంచుటకు వివాహము దేవునిచే స్థాపించబడెను. నేడు పిల్లలు కొన్నిసార్లు ఒక అర్థములేనివారుగా మరియు ఒక భారంగా భావించబడుత చాలా బాదాకరం. వారు ప్రజల యొక్క మార్గాలలో ఉపాది దారులు మరియు ఆర్ధిక గురులుగా నిలవబడి యున్నారు, మరియు వారు సాంఘికముగా “మన శైలిని క్షీనింపజేస్తున్నారు.” చాలా సార్లు ఈవిధమైన స్వార్థం అట్టి జనన నియంత్రణ పద్ధతులను ఉపయోగించుటకు కారణంగా ఉంది.

ఈ జనన నియంత్రణ వినియోగము వెనుక ఉన్న స్వీయ కేంద్రీకృత ఆలోచనలకు విరుద్దంగా, పిల్లలు దేవుడు అనుగ్రహించు బహుమానముగా బైబిలు తెలుపుతుంది (ఆది. 4:1; ఆది. 33:5). పిల్లలు దేవుని నుండి ఒక స్వాస్థ్యము (లూకా 1:42). పిల్లలు వృద్ధులకు కీరీటం వంటివారు (సామెతలు 17:6). దేవుడు గొడ్రాలైన స్త్రీలను పిల్లలతో దీవిస్తాడు (కీర్తనలు 113:9; ఆది. 21:1-3; 25:21-22; 30:1-2; 1 సమూ. 1:6-8; లూకా 1:7, 24-25). దేవుడు పిల్లలను గర్భంలో రూపిస్తాడు (కీర్తనలు 139:13-16). జననమునకు ముందే దేవుడు పిల్లలను ఎరిగియుంటాడు (యిర్మీయా 1:5; గలతీ. 1:15).

జనన నియంత్రణను ఖండించుటకు దగ్గరగా లేఖనము ఆదికాండము 38వ అధ్యాయంలో వస్తుంది, అది యూదా కుమారులైన ఏరు మరియు ఓనాను యొక్క కథనం. ఏరు తామారు అను స్త్రీని వివాహము చేసుకున్నాడు, కాని అతడు దుష్టుడు కాబట్టి, తామారుకు పిల్లలు కలుగకుండా దేవుడు వానిని చంపివేశాడు. ద్వితీ. 25:5-6లో ఉన్న లేవియ వివాహ నియమాల ప్రకారం ఏరు కుమారుడైన ఓనానుకిచ్చి తామరుకు వివాహం చేశారు. తన సహోదరుని కొరకు పిల్లలను కని ఓనాను తన వారసత్వమును విభజించాలని ఆశించలేదు, కాబట్టి పురాతన జనన నియంత్రణ పద్ధతియైన రేతస్సు నేల విడచుటను ఉపయోగించాడు. “అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను” అని ఆది. 38:10 చెబుతుంది. ఓనాను యొక్క ఆలోచన స్వార్థంతో కూడినది; తాను తామారును తన ఆహ్లాదం కొరకు వాడుకున్నాడుగాని, చనిపోయిన తన అన్న కొరకు వారసుని కనవలసిన చట్టబద్ధమైన బాధ్యతను నెరవేర్చుటను నిరాకరించాడు. దేవుడు జనన నియంత్రణను అంగీకరించడు అనుటకు రుజువుగా ఈ లేఖన భాగమును ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, రేతస్సును నేల విడచుట వలన మాత్రమే దేవుడు ఓనానును చంపలేదు; కారణం ఆ క్రియ వెనుక ఉన్న ఓనాను యొక్క స్వార్థపూరిత ఆలోచనలు.

లోకము చెప్పునట్లుగా గాక, దేవుడు చూసే విధంగా పిల్లలను చూడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇలా చెప్పిన తరువాత, జనన నియంత్రణ పద్ధతులను బైబిల్ నిషేధించదు. జనన నియంత్రణ పద్ధతి అంటే గర్భ ధారణకు వ్యతిరేకం అంతే. జనన నియంత్రణ పద్ధతి మాత్రమే దానిని తప్పు లేక ఒప్పు చెయ్యదు. ఓనాను జీవితము నుండి మనం నేర్చుకున్నట్లు, జనన నియంత్రణ పద్ధతి వెనుక ఉన్న ఉద్దేశం దానిని తప్పు లేదా ఒప్పుగా చేస్తుంది. వివాహమైన దంపతులు తమ స్వార్థం కొరకు ఎక్కువ కలిగియుండాలని జనన నియంత్రణ పద్ధతిని ఉపయోగిస్తే అది తప్పు అవుతుంది. దంపతులు పరిపక్వత చెందుటకు మరియు ఆర్థికంగా మరియు ఆత్మీయంగా మరింత సిద్ధపడుటకు కొంత కాలం నియంత్రణ పద్ధతిని ఉపయోగిస్తే, కొంత కాలం వరకు జనన నియంత్రణ పద్ధతిని ఉపయోగించుట అనుమతించబడవచ్చు. మరలా, అంతా దాని వెనుక ఉన్న ఉద్దేశము మీద ఆధారపడియుంటుంది.

పిల్లలను కలిగియుండుట మంచి విషయమని బైబిల్ ఎల్లప్పుడూ చెబుతుంది. భార్య మరియు భర్త పిల్లలను కలిగియుండాలని బైబిల్ “ఆశిస్తుంది.” పిల్లలను కనుటలోని అసమర్థతను ఎల్లప్పుడూ చెడుగా బైబిల్ పరిగణించింది. పిల్లలు కనకూడదనే ఆశను వ్యక్తపరచినవారు బైబిల్ లో ఎవ్వరు లేరు. అదే సమయంలో, కొంత కాలం పాటు జనన నియంత్రణను ఉపయోగించుట పూర్తిగా తప్పు అని బైబిల్ నుండి వాదించలేము. పిల్లలను కనుటకు వారు ఎప్పుడు ప్రయత్నించాలి మరియు ఎంత మంది పిల్లలు వారు కలిగియుండాలి అను విషయములను గూర్చి వైవాహిక దంపతులు దేవుని చిత్తమును వెదకాలి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

జనన నియంత్రణను గూర్చి బైబిలు చెప్పుచున్నది? జనన నియంత్రణను క్రైస్తవులు ఉపయోగించవచ్చా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries