settings icon
share icon
ప్రశ్న

ఏకీకృత ప్రార్థన ముఖ్యమైనదా?

జవాబు


సంఘ జీవితమునకు, ఆరాధన, శబ్దము, సిద్ధాంతము, ప్రభు బల్ల, మరియు సహవాసముతో పాటుగా ఏకీకృత ప్రార్థన ఒక ముఖ్యమైన భాగము. ప్రారంభ సంఘము అపొస్తలుల బోధయందును, రొట్టె విరుచుటయందును, మరియు ప్రార్థన చేయుటయందును ఎడతెగక తరచుగా కలుసుకొనిరి. మనము ఇతర విశ్వాసులతో కలిసి ప్రార్థించినప్పుడు, ఫలితాలు చాలా అనుకూలముగా ఉండును. ఏకీకృత ప్రార్థన మనము మన సాధారణ విశ్వాసమును పంచుకొనుచుండగా క్షేమాభివృద్ధి కలిగించి ఏకముగా ఉంచును. అదే పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిలో నివాసం చేసి మన ప్రభువును మరియు రక్షకుని స్తుతులు విన్నప్పుడు మన హృదయములకు ఉత్సాహము కలిగించి, జీవితములో ఎక్కడా కనుగొనబడని ఏకైక సహవాస బంధము నందు మనలను కలిపివుంచును.

జీవిత భారములతో ఒంటరిగా మరియు బాధపడుచున్నవారికి, ఇతరుల గూర్చి విన్నప్పుడు వారు కృపాసింహాసమునకు తేబడి ఒక గొప్ప ప్రోత్సాహముగా ఉండును. మనము వారి గురించి విజ్ఞాపన చేయుచుండగా అది మనలను ఇతరులపట్ల ప్రేమ మరియు సంబంధమును కూడా కట్టును. అదే సమయములో, ఏకీకృత ప్రార్థన కేవలం పాల్గొనే ప్రతివాని హృదయమును ప్రతిబింబించును. మనము దేవుని యొద్దకు తగ్గింపుతో (యాకోబు 4:10), సత్యముతో (కీర్తనలు 145:18), విధేయతతో (1 యోహాను 3:21-22), కృతజ్ఞతాస్తుతులతో (ఫిలిప్పీ 4:6) మరియు ధైర్యముతో వచ్చుదము. విచారకరంగా, ఏకీకృత ప్రార్థన ఎవరి మాటలైతే దేవునికి కాకుండా వారిని వినేవారి దిశగాఉండుటకు ఒక వేదికగా కూడా మారును. మత్తయి 6:5-8 లో, యేసు ఇలాంటి ప్రవర్తన గూర్చి వారిస్తూ, మన ప్రార్థనలు ఆడంబరంగా, విస్తారముగా, లేక కపటముగా కాకుండా, ప్రార్థనను కపటముగా వాడుట మాని, మన స్వంత గదులలో రహస్యముగా చేయవలెనని బుద్ధి చెప్పుచుండెను.

లేఖనములో ఎక్కడా దేవుని హస్తమును కదిలించుటకు వ్యక్తిగత ప్రార్థనల కంటే ఏకీకృత ప్రార్థనలు “చాలా శక్తివంతమైనవి” అని సూచించబడలేదు. చాలామంది క్రైస్తవులు ప్రార్థనను “దేవుని నుండి పొందుటకు” వుద్దేశించుదురు, మరియు గుంపు ప్రార్థన ప్రధానముగా ఆ అక్కరల జాబితాను మరల చెప్పుటకు అన్నట్లు మారును. బైబిలు సంబంధమైన ప్రార్థనలు, విభిన్న-ధృక్పదాలు, కలిగివున్నప్పటికీ, పరిశుద్ధ, పరిపూర్ణ, మరియు నీతిగల దేవునితో లోతైన సహవాస అనుభవంలోనికి ప్రవేశించాలనే వాంఛతో ఆవరించియుండును. అలాంటి దేవుడు తన జీవులను చెవి వంచి సమృద్ధిగా స్తుతి మరియు ఆరాధన ప్రవహింపచేసి (కీర్తనలు 27:4; 63:1-8), మనఃపూర్వకమైన మారుమనస్సు మరియు ఒప్పుకోలు కలిగించి (కీర్తనలు 51; లూకా 18:9-14), కృతజ్ఞతను మరియు కృతజ్ఞతాస్తుతులను పొంగిపొర్లేలా ఉత్పత్తిచేసి (ఫిలిప్పీ 4:6; కొలస్సీ 1:12), మరియు ఇతరుల కొరకు నిజాయితీగల ప్రార్థన విన్నపములను సృష్టించేలా (2 థెస్సలొనీకయులు 1:11; 2:16) చేయును.

ప్రార్థన అప్పుడు, మన చిత్తమునకు ఆయనను వంచడం కాదుకాని, ఆయన ప్రణాళికను జరిగించుటకు దేవునితో సహకరించడం. మనము మన స్వంత ఆశలను ఎవరికైతే మన పరిస్థితులన్నీ మనకంటే బాగుగా తెలిసికొని మరియు “మనము అడగక మునుపే మన అక్కర తెలిసిన” (మత్తయి 6:8) వానికి లోబడి పరిత్యజించుచుండగా, మన ప్రార్థనలు వాటి సర్వోన్నతమైన స్థానమునకు చేరును. దైవిక చిత్తమునకు లోబడిచేసే ప్రార్థనలు, అందువలన, ఒకరుగా చేసిన లేక వెయ్యిమంది చేసినా, ఎల్లప్పుడు అనుకూలముగా జవాబివ్వబడును.

మత్తయి 18:19-20, “మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నా తండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారు మధ్యన ఉందునని చెప్పెను” ప్రకారము ఏకీకృత ప్రార్థనలు చాలా వరకు దేవుని హస్తమును కదిలించుననే ఆలోచన తప్పుడు అనువాదము నుండి వచ్చినది. ఈ వచనములు సంఘము ఒక తప్పిదము చేసిన సహోదరుని సరిచేయు క్రమముననుసరించి వచ్చిన పెద్ద ప్రకరణము నుండి వచ్చినవి. వాటిని దేవునిని ఏదైనా అంగీకరించి అడుగుటకు వాడే ఖాళి చెక్కులా, వారెంత పాపులైన లేక మూర్ఖులైనా, అది సంఘ క్రమశిక్షణ సందర్భములో ఇమడక, మిగతా లేఖనములను నిరాకరించి, మరిముఖ్యముగా దేవుని అధికారమును నిరాకరించినట్లు అనువదించగలము.

దానికితోడుగా, “ఇద్దరు లేక ముగ్గురు కలిసి” ప్రార్థించినప్పుడు నమ్మడం, బైబిలు ప్రకారంగా సహకరించకపోయినా మన ప్రార్థనలకు ఒక అద్భుత శక్తిని దానికదే అన్వయించును. అయినా, యేసు ఇద్దరు లేక ముగ్గురు ప్రార్థించినా వారి మధ్య ఉండును, కాని ఇతరులకు వేళ్ళ మైల దూరములోనున్న, ఆయన ఒక విశ్వాసి ఒంటరిగా ప్రార్థించినా అక్కడ కూడా సమానముగా ఉండును. ఏకీకృత ప్రార్థన ముఖ్యమైనది ఎందుకంటే అది ఐకమత్యమును సృష్టించును (యోహాను 17:22-23), మరియు విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకొనే మూల విషయముగా (1 థెస్సలొనీకయులు 5:11) మరియు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకొనేలా (హెబ్రీ 10:24) చేయును.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

ఏకీకృత ప్రార్థన ముఖ్యమైనదా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries