settings icon
share icon
ప్రశ్న

బైబిల్ అధ్యయమునకు సరైన విధానం ఏది?

జవాబు


లేఖనము యొక్క అర్థమును నిర్థారించుట ఒక విశ్వాసి జీవితంలో అతి ప్రాముఖ్యమైన పనులలో ఒకటి. మనం బైబిల్ ను కేవలం చదవాలని దేవుడు మనకు చెప్పుట లేదు. మనం దానిని చదివి సరిగా విభజించాలి (2 తిమోతి 2:15). లేఖనములు అధ్యయనం చేయుట ఒక పరిశ్రమ. బైబిల్ ను శ్రద్ధ లేకుండా క్లుప్తంగా చదువుట వలన కొన్ని తప్పిదములు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, లేఖనముల యొక్క సరైన అర్థమును నిర్థారించుటకు అనేక నియమాలను అర్థం చేసుకొనుట చాలా అవసరము.

మొదటిగా, గ్రహింపును ఇవ్వమని బైబిల్ విద్యార్థి ప్రార్థించి పరిశుద్ధాత్మను అడగాలి, ఎందుకనగా అది ఆయన పనులలో ఒకటి. “అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును” (యోహాను 16:13). క్రొత్త నిబంధన వ్రాయుటలో పరిశుద్ధాత్మ అపొస్తలులను నడిపించినట్లే, లేఖనమును అర్థం చేసుకొనుటలో ఆయన మనకు మార్గదర్శకం ఇస్తాడు. మీరు క్రైస్తవుడు అయిన యెడల, లేఖనముల యొక్క రచయిత-పరిశుద్ధాత్మ-మీలో నివసిస్తాడు, మరియు ఆయన వ్రాసినది మీరు అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు.

రెండవదిగా, మనం లేఖన భాగమును దాని చుట్టూ ఉన్న వచనముల నుండి బయటకు తీసి సందర్భానికి వెలుపల వచన అర్థమును నిర్థారించుటకు ప్రయత్నించకూడదు. సందర్భాన్ని గ్రహించుటకు చుట్టూ ఉన్న వచనములను మరియు అధ్యాయాలను మనం చదవాలి. లేఖనమంతా దేవుని నుండి వచ్చినప్పటికీ (2 తిమోతి 3:16; 2 పేతురు 1:21), దానిని వ్రాయుటకు దేవుడు పురుషులను ఉపయోగించాడు. ఈ పురుషుల మదిలో ఒక అంశం, వ్రాయుటకు ఒక ఉద్దేశం, మరియు వారు ఎదుర్కొను ఒక విశేష సమస్య ఉన్నాయి. ఒక పుస్తకమును చదువునప్పుడు అది ఎవరు వ్రాసారు, ఎవరి కొరకు అది వ్రాయబడింది, ఎప్పుడు వ్రాయబడింది, మరియు ఎందుకు వ్రాయబడింది అను వాటిని కనుగొనుటకు ఆ బైబిల్ పుస్తకము యొక్క సందర్భమును చదవాలి. అంతేగాక, లేఖనము దాని కొరకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కొన్ని సార్లు వారికి కావలసిన అనువాదమును పొందుకొనుటకు ప్రజలు వారి సొంత అర్థాలను పదాలకు ఇస్తారు.

మూడవదిగా, మన బైబిల్ అధ్యయనంలో పూర్తిగా స్వతంత్రులుగా ఉండుటకు మనం ప్రయత్నించకూడదు. లేఖనములను చదివి జీవితాంతము దానిని అర్థం చేసుకొనుటకు ప్రయత్నించిన వారి కృషి మనం జ్ఞానమును పొందలేము అని ఆలోచించుట అహంకార భావము. కొందరు పరిశుద్ధాత్మ మీద మాత్రమే ఆధారపడి లేఖనములో దాగియున్న సత్యములన్ని కనుగొంటాము అనే తప్పిద ఆలోచనతో బైబిల్ ను సంప్రదిస్తారు. పరిశుద్ధాత్మను ఇచ్చుట ద్వారా క్రీస్తు ప్రజలకు క్రీస్తు శరీరము కొరకు ఆత్మీయ వరములు ఇచ్చాడు. ఈ ఆత్మీయ వరములలో ఒకటి బోధ (ఎఫెసీ. 4:11-12; 1 కొరింథీ. 12:28). లేఖనములను సరిగా అర్థం చేసుకొనుటకు మరియు దానిని అనుసరించుటకు మనకు సహాయం చేయుట కొరకు ప్రభువు మనకు బోధకులను ఇచ్చెను, దేవుని వాక్యము యొక్క సత్యమును గ్రహించి దానిని అన్వయించుటలో ఒకరికొకరు సహాయం చేసుకొనుచు, ఇతర విశ్వాసులతో కలసి బైబిల్ చదువుట వివేకవంతమైన పని.

కాబట్టి, సారాంశంగా, బైబిల్ అధ్యయనంలో సరైన విధానం ఏది? మొదటిగా, ప్రార్థన మరియు వినయముతో, మనకు గ్రహింపును ఇచ్చుటకు పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. రెండవదిగా, బైబిల్ స్వయంగా వివరణ ఇస్తుందని గ్రహించి, లేఖనమును ఎల్లప్పుడూ సందర్భము యొక్క వెలుగులో చదవాలి. మూడవదిగా, బైబిల్ ను సరిగా అధ్యయనం చేయుటకు ప్రయత్నించినవారి, ఇప్పుడు మరియు మునుపు, యొక్క ప్రయత్నాలను మనం గౌరవించాలి. దేవుడు బైబిల్ యొక్క రచయిత అని మరియు మనం దానిని అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడని మనం గుర్తుంచుకోవాలి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

బైబిల్ అధ్యయమునకు సరైన విధానం ఏది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries