settings icon
share icon
ప్రశ్న

దేవుడు చెడును సృష్టించాడా?

జవాబు


దేవుడు అన్నిటిని సృష్టించిన యెడల, చెడు కూడా దేవుడే సృష్టించాడని ఆరంభంలో అనిపిస్తుంది. అయితే, చెడు అనేది ఒక రాయి లేక విద్యుత్తు వలె ఒక “వస్తువు” కాదు. మీరు ఒక గిన్నెడు చెడును కలిగియుండలేరు. చెడు దానంతట అదే ఉండదు; అది వాస్తవానికి మంచి లేకుండా ఉండుట. ఉదాహరణకు, గుంటలు వాస్తవాలేగాని అవి ఏదోఒకదానిలో ఉంటాయి. మట్టి లేకపోవుటను మనం గుంట అని అంటాం, అయితే దానిని మట్టి నుండి వేరుచేయలేము. కాబట్టి దేవుడు సృష్టిని చేసినప్పుడు, ఆయన సృష్టించిన ప్రతిది మంచిదే అన్న మాట నిజమే. దేవుడు చేసిన ఒక మంచిది ఏమిటంటే మంచిని ఎన్నుకొనే శక్తి కలిగిన జీవులను చేయుట. ఒక నిజమైన వికల్పం కలిగియుండుటకు, నిర్ణయించుటకు మంచికి వేరుగా మరొకటి ఉండుటకు దేవుడు ఏదోకదానికి అనుమతి ఇవ్వాలి. కాబట్టి, మంచిని ఎన్నుకొనుటకు లేక మంచిని తిరస్కరించుటకు (చెడు) ఈ స్వతంత్ర దూతలకు మరియు మానవులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. రెండు మంచి వస్తువుల మధ్య ఒక చెడ్డ సంబంధం ఉన్నప్పుడు దానిని మనం చెడు అని పిలుస్తాము, కాని అది దేవుడు సృష్టించిన “వస్తువై” ఉండవలసిన అవసరం లేదు.

మరొక ఉదాహరణ సహాయం చేస్తుంది అనుకుంటున్నాను. “చలి ఉందా?” అని ఒక వ్యక్తిని అడిగినప్పుడు, “అవును” అని జవాబు కావచ్చు. అయితే, ఇది సరికాదు. చలి ఉండదు. చలి అనేది వేడి లేకపోవుట. అదే విధంగా, చీకటి ఉండదు; అది వెలుగు లేకపోవుట. చెడు అనగా మంచి లేకపోవుట, లేదా, చెడు అనగా దేవుడు లేకపోవుట. దేవుడు చెడును సృష్టించవలసిన అవసరం లేదు, కాని ఆయన మంచి లేకపోవుటకు అనుమతి ఇచ్చాడు.

దేవుడు చెడును సృష్టించలేదు, కాని అయన చెడుకు అనుమతి ఇచ్చాడు. చెడు యొక్క సాధ్యతను దేవుడు అనుమతించని యెడల, మానవులు మరియు దూతలు దేవుని ఒక బాధ్యతగా సేవిస్తారేగాని, నిర్ణయాత్మకంగా సేవించరు. తమ “ప్రోగ్రామింగ్” వలన ఆయనకు ఇష్టమైన విధంగా మాత్రమే పని చేసే “రోబో”లను ఆయన కోరలేదు. మనకు నిజముగా స్వయెచ్చ ఉండుటకు మరియు ఆయనను సేవించాలా వద్దా అని మనం సొంతగా ఎన్నుకొనుటకు వీలుగా దేవుడు చెడు యొక్క సాధ్యతను అనుమతించాడు.

మితమైన మానవులుగా, అమితమైన దేవుని మనం ఎన్నడు పూర్తిగా అర్థం చేసుకోలేము (రోమా. 11:33-34). కొన్ని సార్లు దేవుడు ఒక విషయమును ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థమైయ్యింది అని అనుకుంటాము, కాని అది వేరే ఉద్దేశం కొరకు దేవుడు చేశాడని తరువాత కనుగొంటాము. దేవుడు విషయములను పవిత్రమైన నిత్య దృష్టితో చూస్తాడు. మనం విషయములను పాపపు, భూలోక, తాత్కాలిక దృష్టి నుండి చూస్తాము. ఆదాము హవ్వలు పాపము చేస్తారని మరియు తద్వారా మానవజాతి అంతటికీ చెడు, మరణం, మరియు శ్రమను తెస్తారని తెలిసికూడా దేవుడు మనుష్యుని భూమి మీద ఎందుకు ఉంచాడు? దేవుడు మనందరినీ సృష్టించి శ్రమలు లేని పరిపూర్ణమైన పరలోకంలో ఎందుకు ఉంచలేదు? నిత్యత్వమునకు ఈ వైపు నుండి ఈ ప్రశ్నలకు సరైన జవాబులు మనం ఇవ్వలేము. దేవుడు చేయు ప్రతిది పవిత్రమైనదని పరిపూర్ణమైనదని మరియు తుదకు దేవునికి మహిమను తెస్తుందని మాత్రం మనకు తెలుసు. మనం ఆయనను ఆరాధన చేయుటలో మనకు నిజమైన వికల్పమును ఇచ్చుటకు దేవుడు చెడు యొక్క సాధ్యతను అనుమతించాడు. దేవుడు చెడును సృష్టించలేదుగాని, దానిని అనుమతించాడు. అయన చెడును అనుమతించని యెడల, మన సొంత చిత్తము యొక్క నిర్ణయముతో గాక ఒక బాధ్యతగా మనం ఆయనను ఆరాధించేవారము.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

దేవుడు చెడును సృష్టించాడా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries