settings icon
share icon
ప్రశ్న

సృష్టి Vs పరిణామం గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?

జవాబు


సృష్టి Vs. పరిణామం చర్చకు శాస్త్రీయ వాదన ఇవ్వడం ఈ సమాధానం యొక్క ఉద్దేశ్యం కాదు. సృష్టికి మరియు/లేక పరిణామమునకు వ్యతిరేకముగా శాస్త్రీయ వాదానల కొరకు, మేము ఆదికాండము మరియు Institute for Creation Research సమాధానములను అత్యధికముగా సిఫారసు చేయును. ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము, బైబిలు ప్రకారంగా, సృష్టి Vs. పరిణామం కూడా ఎందుకు ఉనికిలో వుంది అనే దానిని వివరించుట. రోమా 1:25 ప్రకటిస్తూ, “అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.”

ఈ చర్చలో ఒక కీలకమైన అంశం పరిణామంను నమ్మే శాస్త్రవేత్తలలో చాలామంది నాస్తికులు లేక దేవుని గూర్చిన జ్ఞానము లేనివారు. కొద్దిమంది ఆస్తిక పరిణామమును కొంత రూపములో పట్టుకొని మరియు ఇతరులు దేవుని ఆస్తిక చిత్రమును తీసికొనును (దేవుడు ఉన్నాడు కాని ఈ ప్రపంచములో లేదు, మరియు ప్రతీది సహజ విధానము కూడా జరుగును). కొద్దిమంది నిజముగా మరియు నిజాయితీగా సమాచారమును చూచి మరియు పరిణామం మంచిగా సమాచారమునకు సరిపడును అనే ముగింపునకు వచ్చును. అయితే, ఇవి పరిణామమును అనుకూలంగా చూచే శాస్త్రవేత్తల శాతం తేలికగా ప్రదర్శించును. విస్తారమైన పరిణామ శాస్త్రవేత్తల సంఖ్య మొత్తం జీవిత పరిణామం యే అత్యధిక ప్రాణి యొక్క జోక్యం లేకుండానే జరిగెనని అనుకొనును. పరిణామ నిర్వచనం ఒక సహజమైన శాస్త్రము.

నాస్తికత్వము నిజమవ్వాలంటే, మైయోక వివరణ వుండి తీరాలి – ఒక సృష్టికర్త కాకుండా- ఎలా ఈ విశ్వము మరియు జీవితము ఉనికిలోనికి వచ్చినది. Charles Darwin కొద్ది పరిణామం రూపమును ముందే నమ్మిక కలిగించినా, అతడు పరిణామునకు ఒక ఆమోదయోగ్యమైన రూపమును- సహజమైన ఎంపికను మొదటిగా అభివృద్ధి చేసెను. Darwin ఒకసారి తననుతాను క్రైస్తవునిగా గుర్తించెను కాని తన జీవితములో జరిగిన కొన్ని విషాదముల ఫలితముగా, ఆయన తర్వాత క్రైస్తవ విశ్వాసమును మరియు దేవుని ఉనికిని పరిత్యజించెను. పరిణామం అనేది ఒక నాస్తికుడిచే కనుగొనబడును. Darwin యొక్క లక్ష్యం దేవుని ఉనికిని లేకుండా చేసి, కాని అది పరిణామ సిద్ధాంతం యొక్క ఆఖరి ఫలితాలలో ఒకటి. పరిణామం నాస్తికత్వ మును కలిగించును. పరిణామ శాస్త్రవేత్తలు వారి లక్ష్యం జీవిత కేంద్రములకు మరియొక వివరణ ఇచ్చుట అని వారు చెప్పరు, మరియు అందువలన నాస్తికత్వమునకు ఒక పునాదిని ఇచ్చును, కాని బైబిలు ప్రకారం, అది ఖచ్చితంగా ఎందుకు పరిణామ సిద్ధాంతం ఉనికిలో వుంది.

బైబిలు మనకు చెప్తుంది, “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు” (కీర్తనలు 14:1; 53:1). బైబిలు సృష్టికర్త అయిన దేవునిని నమ్మకుండా ఉండుటకు ప్రజలకు ఏవిధమైన సాకు ఉండదని కూడా ప్రకటించును. “ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు” (రోమా 1:20). బైబిలు ప్రకారం, ఎవరైనా దేవుడు లేడని ఖండిస్తే వాడు బుద్ధిహీనుడు. ఎందుకు, అప్పుడు, చాలా మంది ప్రజలు, కొద్దిమంది క్రైస్తవులు కూడా కలిపి, పరిణామ శాస్త్రవేత్తల శాస్త్రీయ సమాచారమును నిష్పాక్షికంగా అంగీకరించుటకు ఇష్టపడిరి? బైబిలు ప్రకారం, బుద్ధిహీనులు ఉన్నారు! బుద్ధిహీనత అంటే తెలివి లేకపోవడం కాదు. చాలామంది పరిణామ శాస్త్రవేత్తలు తెలివైన మేధస్సు కలవారు. బుద్ధిహీనత జ్ఞానమును సరియైన విధానములో ఆపాదించుటలో సామర్ధ్యత లేకపోవడాన్ని సూచించును. సామెతలు 1:7 మనకు చెప్తుంది, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు”.

పరిణామ శాస్త్రవేత్తలు సృష్టిని వెక్కిరించు మరియు/లేక తెలివైన రూపకల్పనను ఒక అశాస్త్రీయ మరియు శాస్త్రీయ పరీక్షకు విలువలేనట్లుగా చేయును. ఒక విషయాన్ని ”విజ్ఞానము” అని పరిగణించాలంటే, వారు వాదించి, అది పరిశీలింపబడి మరియు పరీక్షింపబడాలని; అది “సహజసిద్ధమై” యుండాలి. సృష్టి నిర్వచనము ద్వారా “అతీంద్రియము.” దేవుడు మరియు అతీoద్రీయము పరిశీలించలేరు లేక పరీక్షించలేరు (వాదన కొనసాగును); అందువలన, సృష్టి మరియు/లేక తెలివైన రూపకల్పన విజ్ఞానముగా పరిగణింపబడలేవు. అయినప్పటికీ, పరిణామం కూడా పరిశీలింపబడలేదు లేక పరీక్షిoపబడలేదు, కాని అది పరిణామకులకు ఒక అభ్యంతరంగా కనబడలేదు. దాని ఫలితంగా, సమాచారమంతా యే ఇతర వివరణలు పరిగణించకుండా, ముందుగా ఏర్పరచబడి, ముందుగా ప్రతిపాదించబడి, మరియు ముందుగా అంగీకరింపబడిన పరిణామ సిద్ధాంతముగా వడపోయబడెను.

అయితే, విశ్వము యొక్క మూలము మరియు జీవితము యొక్క మూలము పరీక్షింపబడటం లేక పరిశీలింపబడటం ఉండదు. సృష్టి మరియు పరిణామo రెండు కూడా వాటి మూలాలను బట్టి విశ్వాసంపై ఆధారపడును. పరీక్షింపబడలేవు కూడా ఎందుకంటే మనము బిలియన్ (లేక వేలు) సంవత్సరాలు విశ్వము యొక్క మూలము లేక విశ్వములో జీవితం పరిశీలించుటకు వెనక్కి వెళ్లలేము. పరిణామ శాస్త్రవేత్తలు సృష్టిని తిరస్కరించి అది తార్కికంగా ఆలాగు వారిని పరిణామమును ఒక విజ్ఞాన వివరణ మూలముగా తిరస్కరించుటకు బలవంతము చేయును.పరిణామం, కనీసం మూలాల పరంగానైనా, సృష్టి కంటే “విజ్ఞానము” అనే నిర్వచనములో సరిపడదు. పరిణామం పరీక్షించగలిగిన ఏకైక మూలముగా ప్రతిపాదిoచబడెను; అందువలన ఇది ఏకైక మూలాల సిద్ధాంతమైన “విజ్ఞానము”గా పరిగణింపబడును. ఇది బుద్ధిహీనత! శాస్త్రవేత్తలు ఎవరైతే పరిణామంను ప్రతిపాదిoచునో కనీసం దాని లాభాలు కూడా నిజాయితీగా పరీక్షించుటకు ఆమోదయోగ్యమైన సిద్ధాంతమును తిరస్కరించును, ఎందుకంటే ఇది వారి తార్కికంగాకాకుండా వంకర నిర్వచనమైన “విజ్ఞానము”నకు సరిపడదు.

ఒకవేళ సృష్టి నిజమైతే, మనము బాధ్యత వహించవలసిన సృష్టికర్త ఉండును. పరిణామం నాస్తికత్వమును సశక్తపరచును. పరిణామం నాస్తికులకు సృష్టికర్తయైన దేవునికి దూరముగా జీవితం ఎలా ఉండునో వివరించుటకు ఒక ఆధారమును ఇచ్చును. పరిణామం విశ్వములో దేవుని ప్రమేయం అవసరం అనే దానిని ఖండించును. పరిణామం అనేది మత నాస్తికత్వమునకు “సృష్టి సిద్ధాంతము.” బైబిలు ప్రకారం, ఎంపిక స్పష్టము. మనము సర్వశక్తిగల మరియు సర్వజ్ఞానియైన దేవుని వాక్యము నమ్ముటకు, లేక మనము అతార్కిక పక్షపాతమైన, బుద్ధిహీనుల “విజ్ఞాన” వివరణను నమ్మవచ్చు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

సృష్టి Vs పరిణామం గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries