ప్రశ్న
మతారాధన వ్యవ్యస్థ నిర్వచనం ఏమిటి?
జవాబు
ప్రజలు మతారాధన వ్యవస్థ అనే మాట వినినప్పుడు, వారు తరచుగా ఆ శాఖ సాతానును ఆరాధించి, జంతువులను అర్పించి, లేక చెడులో పాలుపంచుకొని, వింతగా, మరియు అన్య ఆచారాలను చేసేదానిగా ఆలోచించును. అయితే, నిజానికి, ఒక మతారాధన వ్యవస్థ అలాంటి విషయాలలో అరుదుగా పాల్గొనును. వాస్తవానికి, ఒక మతారాధన వ్యవస్థ, ఆ పదానికి విఫుల భావనలో, అది కేవలం ప్రత్యేక ఆచారాలు మారియు సంప్రదాయాలు కలిగివున్న ఒక మత వ్యవస్థ.
సాధారణంగా, ఒక మతారాధన వ్యవస్థ చాలా సూక్ష్మంగా నిర్వచింపబడినప్పటికీ, మరియు ఆ పదము ఒక ఛాందసులుకాని శాఖ సభ్యులను ఎవరైతే మతము యొక్క నిజ సిద్ధాంతాలను వక్రీకరించునో వారిని సూచించును. క్రైస్తవ సందర్భంలో, ఒక మతారాధాన వ్యవస్థ నిర్వచనం, ప్రధానముగా, “ఒకటి లేక ఎక్కువ బైబిలు సత్య మూల సిద్దాంతాలను ఖండించే ఒక మత గుంపు.” ఒక మతారాధన వ్యవస్థ, ఒకవేళ నమ్మితే, ఒక వ్యక్తి రక్షింపబడకుండా వుండిపోవుటకు కారణమగునని సిద్ధాంతాలను బోధించే గుంపు. ఒక మతరాధన వ్యవస్థ ఒక మత శాఖగా పేర్కొనబడును, అయినా ఆ మతము యొక్క అది అవసరమైన సత్యాలను ఖండించును. అందువలన, ఒక క్రైస్తవ మతారాధాన వ్యవస్థ క్రైస్తవునిగా పేర్కొంటూనే, క్రైస్తవ్యం యొక్క ఒకటి లేక మరిన్ని మూల సత్యాలను ఖండించును.
క్రైస్తవ మతారాధన వ్యవస్థ యొక్క రెండు సాధారణ బోధలు ఏవనగా యేసు దేవుడు కాదు మరియు ఆ రక్షణ కేవలం ఒక్క విశ్వాసం ద్వారా కాదు. క్రీస్తును దేవునిగా ఖండించిన ఫలితము మన పాపముల కొరకు ప్రార్థించడానికి యేసు మరణము సరిపోలేదు అనే చిత్రం. కేవలం ఒక్క విశ్వాసం ద్వారానే రక్షణ అనుటను ఖండించిన ఫలితం మన స్వంత క్రియల ద్వారా రక్షణ పొందవచ్చు అనే బోధ. సంఘము యొక్క ప్రారంభ సంవత్సరాలలో అపొస్తలులు మతారాధన వ్యవస్థలను ఎదుర్కొనెను: ఉదాహరణకు, 1 యోహాను 4:1-3 లో యోహాను అబద్ధ ప్రవక్తల బోధల గూర్చి చెప్పుచుండెను. దేవుని సిద్ధాంతమునకు యోహాను అగ్ని పరీక్ష “యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెను” (వ 2) – వంచకుల మాటకు ప్రత్యక్ష విరుద్ధము (2 యోహాను 1:7).
ఈరోజు మతారాధాన వ్యవస్థకు రెండు పేరుగాంచిన ఉదాహరణలు యెహోవా సాక్షులు మరియు మర్మోనులు. ఈ రెండు గుంపులు క్రైస్తవులు గానే పేర్కొనును, గాని రెండు క్రీస్తును దేవునిగా మరియు రక్షణ కేవలం విశ్వాసం ద్వారానే అను దానిని ఖండించును. బైబిలు బోదించేవాటిని లేక అలాంటివాటిని యెహోవా సాక్షులు మరియు మర్మోనులు చాలా విషయాలాలో ఒకే విధముగా అంగీకరించును. అయితే, వారికి ఒక మత వ్యవస్థగా అర్హతనిచ్చేది వారు క్రీస్తును దేవునిగా ఖండించి మరియు క్రియల ద్వారా రక్షణ అనే బోధ. చాలామంది యెహోవా సాక్షులు, మర్మోనులు, ఇతర మత వ్యవస్థల సభ్యులు వారు సత్యమునకే కట్టుబడునని స్వచ్చంగా నమ్మే నైతిక ప్రజలు. క్రైస్తవులుగా, మన నిరీక్షణ మరియు ప్రార్థన మతారాధన వ్యవస్థ లలో ఉన్న చాలామంది ప్రజలు ఆ అసత్యాల గుండా చూచి మరియు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ఒక్కనిలోనే రక్షణ అను సత్యమునకు తేబడాలి.
English
మతారాధన వ్యవ్యస్థ నిర్వచనం ఏమిటి?