settings icon
share icon
ప్రశ్న

ఒక మతారాధన వ్యవస్థ లేక తప్పుడు మతంలో ఉన్న ఎవరినైనా సువార్తీకరించుటకు శ్రేష్ఠమైన మార్గము ఏమిటి?

జవాబు


మతారాధన వ్యవస్థలో లేక తప్పుడు మతంలో పాల్గొనేవారి గురించి మనము చేయగలిగిన చాలా ప్రాముఖ్య విషయం వారిగూర్చి ప్రార్థించడం. దేవుడు వారి హృదయాలను మార్చి మరియు సత్యమునకు వారి నేత్రములను తెరవాలని మనము ప్రార్థించవలసిన అవసరం ఉంది (2 కొరింథీ. 4:4). యేసుక్రీస్తు ద్వారా వారికి అవసరమైన రక్షణకు వారిని దేవుడు ఒప్పించాలని మనం ప్రార్థించాలి (యోహాను 3;16). దేవుని శక్తి మరియు పరిశుద్ధాత్మ ఒప్పింపు లేకుండా ఎవరిని మనము ఎప్పటికీ సత్యమునకు ఒప్పింప చేయడంలో సఫలము కాము (యోహాను 16:7-11).

మనము కూడా ఒక దైవభక్తిగల క్రైస్తవ జీవితమును జీవించాలి, దానిద్వారా మత వ్యవస్థలో మరియు మతాలలో చిక్కుకున్నవారు దేవుడు మన స్వంత జీవితాలలో చేసిన మార్పును చూడవచ్చు (1 పేతురు 3: 1-2). వారికి ఒక శక్తివంత మైన విధములో ఎలా పరిచర్య చేయాలో జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి (యాకోబు 1:5). ఇదంతటి తర్వాత, మనము నిజముగా సువార్తను పంచుకొనడంలో ధైర్యముగా ఉండాలి. మనము యేసుక్రీస్తు ద్వారా రక్షణ సువార్తను మనము ప్రకటించాలి (రోమా. 10:9-10). మన విశ్వాసమును కాపాడుకొనుటకు ఎల్లప్పుడు మనము సిద్ధంగా ఉండాలి (1 పేతురు 3:15), కాని మనము అలా మృదువుగా మరియు గౌరవంతో చేయాలి. మనము సిద్ధాంతమును సరిగా ప్రకటించాలి, వాక్యముల యొక్క యుద్ధమును గెలవాలి, మరియు ఆగ్రహమను ఆధిపత్య వైఖరి వలన కలిగే ఇంకా అవరోధం కలుగును.

చివరిగా, దేవునికి సాక్ష్యమిచ్చిన వారి గూర్చిన రక్షణను వదిలివేయాలి. మన ప్రయత్నాలు కాదుకాని, ప్రజలను రక్షించుట దేవుని శక్తి మరియు కృప. ఒక తీవ్రమైన రక్షణకు మరియు తప్పుడు నమ్మకాలను గూర్చిన జ్ఞానం కలిగియుండుటకు సిద్ధపడియుంటుండగా, ఏ మత వ్యవస్థలు మరియు తప్పుడు మతాలలో చిక్కుకొనిన వారి మార్పుకు ఈ విషయాలేవీ ఫలితం చూపవు. మనము చేయగలిగిన శ్రేష్ఠమైన పని వారికోసం ప్రార్థన చేయడం, వారికి సాక్ష్యంగా ఉండడం, మరియు వారిముందు క్రైసవ జీవితమును జీవించడం, వారిని ఆకర్షించడం, ఒప్పింపచేయడం, మరియు మార్చే పనికి పరిశుద్ధాత్మను నమ్మడం.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

ఒక మతారాధన వ్యవస్థ లేక తప్పుడు మతంలో ఉన్న ఎవరినైనా సువార్తీకరించుటకు శ్రేష్ఠమైన మార్గము ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries