ప్రశ్న
అన్యుడితో కాలయాపన చేయుట లేదా వివాహమాడుట క్రైస్తవుడికి తగునా?
జవాబు
క్రైస్తవుడు అన్యుడితో కాలయాపన చేయడం జ్ఞానం లేని పని,మరియు ఒకరిని వివాహమాడుట అనేది అభిలషీయమైనది కాదు. రెండవ కొరింథీ 6:14 చెప్తుంది (KJV) అవిశ్వాసులతో “జోడుగా” ఉండకుడి. చిత్రము ఏంటంటే రెండు జతకాని ఎద్దులు ఒకే కాడిని పంచుకోవడం. భరువును లాగుటకు కలసి పనిచేయుటకంటే, వారు ఒకరికొకరు వ్యతిరేకంగా పని చేస్తారు. ఈ వాక్యభాగం ప్రత్యేకంగా వివాహము గూర్చి మాట్లాడకపోయినప్పటికీ, వివాహమునకు ఖచ్చితంగా అన్యయము ఉంది. క్రీస్తుకు బెలియాలుతో (సాతాను) సంబంధములేదు అని చెప్తుంది వాక్యభాగం. క్రైస్తవుడికి మరియు అన్యుడికి మధ్య వివాహంలో ఆత్మీయ సంబంధం ఉండదు. విశ్వాసుల యొక్క హృదయాలను రక్షణపై కేంద్రీకృతపరచే పరిశుద్ధాత్మకు వారు ఆలయమని పౌలు వారికి జ్ఞాపకం చేసాడు (2 కొరింథీ 6:15-17). అందుచేత, వారు లోకమునకు వేరుగా ఉండాలి– లోకములో, కానీ లోకమును నుండి కాదు – మరియు ఏ స్థలమైన కూడా జీవితం యొక్క అత్యంత సన్నిహిత సంబంధమైన – వివాహం కంటే ఎక్కువ కాదు.
“మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని బైబిల్ కూడా చెప్తుంది (1 కొరింథీ. 15:33). అవిశ్వాసితో ఎటువంటిసన్నిహిత సంబంధం కలిగి ఉన్నను క్రీస్తుతో మన నడవడిని అడ్డగిస్తుంది. నశించిన వారికి సువార్త చెప్పడానికి మనం పిలువబడ్డాము, కాని వారితో సన్నిహితంగా ఉండుటకు కాదు. అవిశ్వాసులతో మంచి సంబంధమును కట్టుకొనుటలో తప్పేమీ లేదు, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నీవు అవిశ్వాసితో కాలాయాపన చేస్తే, నిజాయితీగా మన ప్రాధాన్యత ఏంటంటే శ్రుంగారమా లేదా క్రీస్తు కొరకు ఆత్మను రక్షించడమా? ప్రపంచంలో కీలకమైన అంశమును – ప్రభువైన యేసుక్రీస్తును తిరస్కరిస్తే నాణ్యతయైన వివాహం ఎలా కట్టబడుతుంది మరియు ఎలా కాపాడబడుతుంది?
English
అన్యుడితో కాలయాపన చేయుట లేదా వివాహమాడుట క్రైస్తవుడికి తగునా?