ప్రశ్న
కాలాయాపనను గూర్చి/ప్రేమాభ్యర్థన గూర్చి బైబిల్ ఏమి చెప్తుంది?
జవాబు
“ప్రేమాభ్యర్థన” మరియు “కాలాయాపన” అను పదములు బైబిల్లో కనబడకపోయినప్పటికీ, వివాహమునకు ముందు సమయంలో క్రైస్తవులు పాటించవలసిన నియమాలు మనకు ఇవ్వబడినవి. మొదటిది ఏంటంటే కాలయాపనను గూర్చి లోకము అర్థం చేసుకొన్న విధంగా మనం ఉండకూడదు ఎందుకంటే దేవుని మార్గాలు లోక దృష్టికి వ్యతిరేకంగా ఉంటాయి (2 పేతురు. 2:20). బహుశా లోక దృష్టి ఏంటంటే ఆమెకు/అతనికి ఒప్పందం చేసుకొనే ముందు వారు ఎలాటివారో అను ప్రాముఖ్యమైన విషయమును గూర్చి తెలుసుకొనుటకు మనకు కావలసినంత సమయం చుట్టుప్రక్కల తిరగడం. క్రీస్తు ఆత్మ ద్వార ఆ వ్యక్తి తిరిగి జన్మించాడా అని తెలుసుకొనుటకు (యోహాను 3:3-8) మరియు ఒకవేళ ఆమె/అతడు క్రీస్తును పోలియున్నట్లుగా తమ కోరికలను పంచుకుంటే (ఫిలిప్పీ. 2:5). కాలయాపనకు మరియు ప్రేమాభ్యర్థనకు గల కడవరి ఉద్దేశం ఏంటంటే జీవిత భాగస్వామిని కనుగొనడం. బైబిల్ మనకు చెప్తుంది, క్రైస్తవులంగా, మనం అవిశ్వాసిని పెండ్లిచేసికొనకూడదు (2 కొరింథీ. 6:14-15) ఎందుకంటే క్రీస్తుతో మనకున్న సంబంధమును ఇది బలహీనపరుస్తుంది మరియు మన నడతలను మరియు లక్షణాలతో రాజీపడుతుంది.
ఎప్పుడైతే ఒకరు నమ్మకమైన ఒప్పందం కలిగిన సంబంధములో ఉంటే. కాలాయాపనైనా లేదా ప్రేమాభ్యర్తనైనా, ఆన్నిటికంటే పైగా ప్రభువును ప్రేమించాలను ముఖ్యమైన విషయమును జ్ఞాపకం చేసుకోవాలి (మత్తయి 10:37). ఇతర వ్యక్తి “అన్నియు” ఆయనే అని చెప్పడం లేదా నమ్మడం లేదా ఒకరి జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం విగ్రహారాదన, అనగా పాపం (గలతీ. 5:20; కొలస్సీ. 3:5). జారత్వము కలిగియుండి మన శరీరములను పాడుచేసుకొనకూడదు (కొరింథీ. 6:9, 13; 2 తిమోతీ. 2:22). జారత్వము పాపం దేవునికి వ్యతిరేకమే కాదు గానీ మన సొంత శరీరములకు వ్యతిరేకం (1 కొరింథీ. 6:18). మనల్ని ప్రేమించుకున్న విధంగా ఇతరులను ప్రేమించడం మరియు గౌరవించడం ప్రాముఖ్యం (రోమా. 12:9-10), మరియు ఇది కాలాయాపనకు లేదా ప్రేమాభ్యర్థన సంబంధముకు ఖచ్చితంగా నిజం. కాలాయాపనైనా లేదా ప్రేమాభ్యర్థనైనా, ఈ బైబిల్ నియమాలను అనుసరించడం వివాహమునకు భద్రత పునాదికి ఉత్తమ మార్గం. ఇది మనం చేసుకొనే అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి, ఎందుకంటే ఇద్దరు వివాహం చేసికొన్నప్పుడు, వారు ఒకరినొకరు హత్తుకొంటారు మరియు దేవుని యొక్క శాశ్వత ప్రణాళికమును అనుసరించి సంబంధంలో ఏకశరీరమౌతారు (ఆది. 2:24; మత్తయి. 19:5).
English
కాలాయాపనను గూర్చి/ప్రేమాభ్యర్థన గూర్చి బైబిల్ ఏమి చెప్తుంది?