settings icon
share icon
ప్రశ్న

బైబిలు అపొస్తలుల మరణమును భద్రప్రరచినదా? ప్రతి అపొ’స్తలుడు ఎలా మరణించెను?

జవాబు


బైబిలులో చెప్పబడిన ఒకేఒక అపొస్తలుని మరణము యాకోబుది (అపొ. 12:2). రాజైన హేరోదు యాకోబును “ఖడ్గముతో చంపించెను,” బహుశా తలనరకడమును సూచించును. ఇతర అపొస్తలుల మరణములు సంఘ ఆచారాలకు సంబంధిoచినవి, అందువలన మనము ఏ ఇతర వాటిపై మరిఎక్కువ బరువు పెట్టకూడదు. చాలా సాధారణముగా ఒక అపొస్తలుని మరణము గూర్చి సంఘ సంప్రదాయం అంగీకరించేది యేసు యొక్క ప్రవచనము బట్టి అపొస్తలుడైన పేతురు రోమాలో x-ఆకారంలో నున్న సిలువపై తలక్రిందులుగా సిలువవేయబడెను (యోహాను 21:18). ఈ క్రిందవి ఇతర అపొస్తలుల మరణము గూర్చిన చాల ప్రసిద్ధమైన “సంప్రదాయాలు”:

మత్తయి ఇతియోపియాలో ఖడ్గముతో గాయపరచబడి, బలిదానమును అనుభవించెను. యోహాను రోమా శ్రమలలో ఒక పెద్ద నూనె మరుగుచున్న కుండలో మరిగించాబడి బలిదానం ఎదుర్కొనెను. అయితే, అతడు ఆశ్చర్యకరంగా మరణమునుండి విడిపింపబడెను. యోహాను అప్పుడు పత్మాసు ద్వీపములోనున్న ఖైదులో ఉరితీయబడుటకు పంపబడెను. అతడు తన ప్రవచానాత్మకమైన పుస్తకము ప్రకటనను పత్మాసులోనే వ్రాసెను. అపొస్తలుడైన యోహాను తర్వాత విడిపింపబడి మరియు ఇప్పుడు ఏదైతే ఆధునిక టర్కీగా ఉండెనో దానికి తిరిగి వెళ్లెను. అతడు ఒక వృద్ధునిగా మరణించెను, ప్రశాంతముగా చనిపోయిన ఒకేఒక అపొస్తలుడు.

యాకోబు, యేసు యొక్క సహోదరుడు (అధికారికంగా ఒక అపొస్తలుడు కాదు), యెరూషలేములో సంఘము యొక్క నాయకుడు. అతడు ఆగ్నేయ పర్వత శిఖరమునుండి (వంద అడుగుల పైగా లోతుకు) క్రీస్తులో తన విశ్వాసమును ఖండించుటకు తిరస్కరించెనో త్రోయబడెను. వారు అతడు పడినప్పటికీ జీవించియున్నాడని కనుగొనినప్పుడు, అతని శత్రువులు యాకోబును కర్రతో కొట్టి చంపెను. ఈ పర్వతశిఖరము సాతాను యేసు శోధించడానికి తీసుకువెళ్లినదే అని ఇది ఆలోచన.

బర్తలొమయి, నతానియేలుగా కూడా తెలియబడి, ఆసియాకు ఒక మిషనరీ. అతడు ప్రస్తుత టర్కీలో సాక్ష్యమిచ్చెను మరియు అతడు ఆర్మేనియాలో తన బోధ వలన, కొరడాలతో చీల్చబడి మరణమునకు బలియాయెను. అoద్రెయ గ్రీసులో x ఆకారములో నున్న సిలువపై సిలువవేయబడెను. ఏడుగురు సిపాయిలచే తీవ్రంగా కొరడాలతో కొట్టబడిన తర్వాత, అతని బాధను పొడిగించుటకు అతని శరీరమును సిలువకు తాళ్లతో కట్టిరి. అతని అనుచరులు అతడు సిలువ వైపు వెళ్తుండగా, అoద్రెయ దానిని ఈ మాటలలో వందనం చేసెను అని చెప్పెను: “ఈ సంతోషకరమైన గడియ కొరకు నేను చాలాకాలంగా ఆశిస్తూ మరియు ఎదురుచూచు చున్నాను. క్రీస్తు శరీరం దానిపై వ్రేలాడదీయబడడం వలన ఆ సిలువ పరిశుద్ధపరచబడెను.” అతని హింసించుచున్న వారికి అతడు చనిపోయేవరకు రెండు రోజులు బోధించుట కొనసాగించెను. అపొస్తలుడైన తోమా భారతదేశంలో సంఘమును స్థాపించుటకు మిషనరీ యాత్రకు వచ్చినప్పుడు అక్కడ ఈటెతో పొడవబడెను. మత్తయి, ద్రోహియైన యూదా ఇస్కరియోతును భర్తీచేయుటకు అపొస్తలునిగా ఎంపికచేయబడెను, రాళ్లతో కొట్టబడి మరియు తల నరికివేయబడెను. 67 A.D లో చెడు చక్రవర్తియైన నీరోచే రోమాలో అపొస్తలుడైన పౌలు హింసింపబడి మరియు తలనరికివేయబడెను . ఇవి ఇతర అపొస్తలుల గూర్చిన సంప్రదాయాలను కూడా, కాని ఏదీకూడా చారిత్రిక లేక సంప్రదాయ సహకారముపై ఆధారపడలేదు.

అపొస్తలులు ఎలా చనిపోయారనేది చాలా ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యం అంటే వారందరు వారి విశ్వాసము కొరకు ఇష్టపూర్వకముగా మరణించారనే వాస్తవము. ఒకవేళ యేసు పునరుత్థానము చెందకపోతే, అది శిష్యులకు తెలిసి యుండును. ఒక అబద్ధమని తెలిసిన ఏదోఒక దానికోసం ప్రజలు చనిపోరు. అపొస్తలులందరూ భయంకరముగా చనిపోవుటకు సిద్ధపడిన వాస్తవం, క్రీస్తులో వారి విశ్వాసమును వదలిపెట్టుటకు తిరస్కరించుట, అనేది వారు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును నిజముగా సాక్ష్యమిచ్చెనని ఒక గొప్ప ఆధారం.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

బైబిలు అపొస్తలుల మరణమును భద్రప్రరచినదా? ప్రతి అపొ’స్తలుడు ఎలా మరణించెను?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries