settings icon
share icon
ప్రశ్న

క్రీస్తు దైవత్వం బైబిల్ అనుసారమైనదేనా?

జవాబు


యేసు తనును గూర్చి తాను చేసిన కొన్ని విశేష దావాలకు తోడు, ఆయన శిష్యులు కూడ క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకున్నారు. పాపము ద్వారా దేవునికి ఆటంకం కలిగెను కాబట్టి, దేవుడు మాత్రమే చేయగలిగిన పాపములను క్షమించు కార్యమును యేసు చేయుటకు హక్కు కలిగియున్నాడని వారు వ్యాఖ్యానించారు (అపొ. 5:31; కొలస్సి. 3:13; కీర్తనలు ౧౩౦:4; యిర్మీయా 31:34). ఈ వ్యాఖ్యకు అనుగుణంగా, “సజీవులకు మృతులకు తీర్పుతీర్చువాడు” వాడు యేసు అని కూడ చెప్పబడెను (2 తిమోతి 4:1) “నా ప్రభువా నా దేవా” అని తోమా యేసునను పిలిచాడు (యోహాను 20:28). “గొప్ప దేవుడు మరియు రక్షకుడు” అని పౌలు యేసును పిలచుచున్నాడు (తీతు. 2:13). యేసును గూర్చి తండ్రియైన దేవుడు చెబుతున్నాడు: “దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది” (హెబ్రీ. 1:8). “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను” అని యోహాను వ్యాఖ్యానించుచున్నాడు (యోహాను 1:1). యేసు దైవత్వమును గూర్చి బోధించు లేఖనముల ఉదాహరణలు చాలా ఉన్నాయి (ప్రకటన 1:17, 2:8, 22:13; 1 కొరింథీ. 10:4; 1 పేతురు 2:6-8; కీర్తనలు 18:2, 95:1; 1 పేతురు 5:4; హెబ్రీ. 13:20 చూడండి), కాని క్రీస్తు అనుచరులు తనను దేవుడని పరిగణించారనుటకు దీనిలో ఒకటైనా సరిపోతుంది.

పాత నిబంధనలో యెహోవాకు (దేవుని వ్యక్తిగత పేరు) ఇచ్చిన విశేష బిరుదులు యేసుకు కూడ ఇవ్వబడెను. పాత నిబంధన బిరుదైన “విమోచాకుడు” (కీర్తనలు 130:7; హోషేయ 13:14) క్రొత్త నిబంధనలో యేసు కొరకు కూడ ఉపయోగించబడెను (తీతు. 2:13; ప్రకటన 5:9). మత్తయి 1 లో యేసు ఇమ్మానుయేలు-“దేవుడు మనకు తోడు”- అని పిలువబడెను. జెకర్యా 12:10లో యెహోవా ఇలా అంటున్నాడు, “వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచెదరు. ” కాని క్రొత్త నిబంధన దీనిని యేసు సిలువ మరణంలో ఉపయోగిస్తుంది (యోహాను 19:37; ప్రకటన 1:7). వారు పొడిచి దృష్టియుంచినది యెహోవా మీద అయినయెడల, పొడవబడి దృష్టియుంచబడినది యేసు మీద అయినయెడల, యేసే యెహోవా. యేసుకు అన్వయించుచు పౌలు ఫిలిప్పీ. 2:10-11లో యెషయా 45:22-23ను అనువదించుచున్నాడు. అంతేగాక, ప్రార్థనలో యేసు పేరు దేవునితో పాటు వాడబడెను, “మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు మీకు కృప మరియు సమాధానము కలుగునుగాక” (గలతీ. 1:3; ఎఫెసీ. 1:2). క్రీస్తు దైవం కానియెడల ఇది దైవదూషణ. బాప్తిస్మము ఇవ్వమని యేసు ఇచ్చిన ఆజ్ఞలో యేసు నామం కూడ ఉంటుంది, “తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో” (మత్తయి 28:19; 2 కొరింథీ. 13:14 చూడండి).

దేవుని ద్వారానే సాధ్యమగు కార్యములు యేసు చేసెను. యేసు మృతులను మాత్రమే లేపలేదు (యోహాను 5:21, 11:38-44), మరియు పాపములు మాత్రమే క్షమించలేదు (అపొ. 5:31, 13:38), ఆయన లోకమును సృష్టించి కొనసాగించుచున్నాడు (యోహాను 1:2; కొలస్సి. 1:6-17). సృష్టిలో తాను ఒంటరిగా ఉన్నాడని యెహోవా చెప్పిన మాటలు దీనిని మరింత స్పష్టము చేస్తాయి (యెషయా 44:24). దీనికి తోడు, దేవుడు మాత్రమే కలిగియుండదగిన లక్షణాలు క్రీస్తు కలిగియుండెను: నిత్యత్వము (యోహాను 8:58), సర్వాంతర్యామి (మత్తయి 18:20, 28:20), సర్వజ్ఞాని (మత్తయి 16:21), మరియు సర్వశక్తివంతుడు (యోహాను 11:38-44).

ఇప్పుడు, దేవుడని దావా చేయుట లేక అది సత్యమని ఒకరిని నమ్మించుట ఒక ఎత్తైతే, దానిని రుజువు చేయుట మరొక ఎత్తు. తాను దైవమని చేసిన దావాలకు రుజువులుగా యేసు ఎన్నో అద్భుత కార్యములు చేసెను. యేసు అద్భుతాలలో కొన్ని నీటిని దాక్షరసముగా మార్చుట (యోహాను 2:7), నీటిపై నడచుట (మత్తయి 14:25), భౌతిక వస్తువులను గుణించుట (యోహాను 6:11), గుడ్డివారిని (యోహాను 9:7), కుంటివారిని (మార్కు 2:3), రోగగ్రస్తులను (మత్తయి 9:35; మార్కు 1:40-42) స్వస్థపరచుట, మరియు ప్రజలను మరణం నుండి తిరిగిలేపుట (యోహాను 11:43-44; లూకా 7:11-15; మార్కు 5:35). అంతేగాక, క్రీస్తు స్వయంగా మరణం నుండి తిరిగిలేచెను. అన్య పురాణాలలో మరణించి తిరిగిలేస్తున్నారని చెప్పు దేవతలకు భిన్నంగా, ఏ మతము కూడ పునరుత్ధానమును గూర్చి దావాలు చేయలేదు, మరియు మరిఏ దావాకు కూడ ఇంత గొప్ప లేఖన రుజువులు లేవు.

యేసును గూర్చి క్రైస్తవుడు కాని విమర్శక పండితుడు కూడ యేసును గూర్చి ఒప్పుకొనే పన్నెండు చారిత్రక సత్యాలు ఉన్నాయి:

1. యేసు సిలువ మరణం పొందెను.
2. ఆయన సమాధిచేయబడెను.
3. ఆయన మరణం వలన శిష్యులు నిరీక్షణ కోల్పోయి నిరాశపొందారు.
4. కొన్ని రోజుల తరువాత యేసు సమాధి ఖాళీగా కనుగొనబడెను (లేక కనుగొనబడెనని దావా చేయబడెను).
5. తిరిగిలేచిన యేసును చూసిన అనుభవాలు వారికి ఉన్నాయని శిష్యులు నమ్మారు.
6. దీని తరువాత, శిష్యులు సందేహించువారి నుండి బలమైన విశ్వాసులుగా మార్పుపొందారు.
7. ఈ సందేశము ఆదిమ సంఘము యొక్క ప్రసంగములలో కేంద్రంగా మారెను.
8. ఈ సందేశం యెరూషలేములో ప్రకటించబడెను.
9. ఈ ప్రసంగముల కారణంగా, సంఘము జన్మించి ఎదిగెను.
10. ఆరాధనకు ముఖ్యమైన దినముగా విశ్రాంతి దినమునకు బదులు (శనివారం), పునరుత్ధాన దినమైన ఆదివారం వచ్చెను.
11. సందేహించు యాకోబు కూడ పునరుత్ధానుడైన యేసును చూచినప్పుడు మారుమనస్సు పొంది నమ్మెను.
12. క్రైస్తవ్యమునకు విరోధియైన పౌలు కూడ పునరుత్ధానుడైన యేసును చూసెనని నమ్మిన అనుభవం ద్వారా మారుమనస్సు పొందెను.

ఈ పట్టికను ఎవరైనా వ్యతిరేకించినా, పునరుత్ధానమును రుజువు చేసి సువార్తను స్థాపించుటకు కొన్ని చాలు: యేసు మరణం, సమాధి, పునరుత్ధానం, మరియు ఆయన కనిపించుట (1 కొరింథీ. 15:1-5). పైనున్న వాటిలో ఒకటి లేక రెండు సత్యాలను వివరించుటకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కేవలం పునరుత్ధానం మాత్రమే వాటిని వివరిస్తుంది. తిరిగిలేచిన యేసును చేసామని శిష్యులు దావా చేసెనని విమర్శకులు అంగీకరిస్తారు. అబద్ధాలు లేక ఊహాలు ఏవి కూడ పునరుత్ధానం వలె ప్రజలను మార్చలేవు. మొదటిగా, వారికి ఏమి లాభం కలిగేది? క్రైస్తవ్యం ఆ రోజుల్లో ఖ్యాతి పొందలేదు మరియు దాని వలన వారు సొమ్ము చేసుకొనే అవకాశం కూడ లేదు. రెండవది, అబద్ధికులు మంచి హతసాక్షులు కాలేరు. వారి విశ్వాసం కొరకు ఘోరమైన మరణములు పొందుటకు శిష్యులు చూపిన ఇష్టమునకు పునరుత్ధానము మినహా వేరే ఏ వివరణ లేదు. అవును, చాలా మంది ప్రజలు వారు నిజములనుకొనే అబద్ధాల కొరకు మరణిస్తారు, కాని వారు సత్యము కానిదని యెరిగిన దాని కొరకు ప్రజలు ఎన్నడు మరణించరు.

ముగింపుగా, తను యెహోవాను అని, తాను దేవుడని యేసు చెప్పాడు (“ఒక దేవుడు” కాదు గాని ఏకైక సత్య దేవుడు); ఆయన అనుచరులు (విగ్రహారాధన అంటే భయపడిపోయే యూదులు) అయనను నమ్మారు మరియు ఆయనను దేవుడని సంభోదించారు. అనేక అద్భుతాల ద్వారా, లోకమును మార్చు పునరుత్ధానము ద్వారా క్రీస్తు తాను దేవుడనే దావాను రుజువు చేసాడు. మరి ఏ వివరణలు ఈ సత్యములను వివరించలేవు. అవును, క్రీస్తు దైవత్వం బైబిల్ అనుసారమైనదే.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

క్రీస్తు దైవత్వం బైబిల్ అనుసారమైనదేనా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries