బైబిలు దయ్యముచే పీడింపబడుట/దయ్యపు స్వాధీనములోనుండుట గూర్చి ఏమి చెప్తుంది?ప్రశ్న: బైబిలు దయ్యముచే పీడింపబడుట/దయ్యపు స్వాధీనములోనుండుట గూర్చి ఏమి చెప్తుంది?

జవాబు:
బైబిలు కొంతమంది దయ్యముచే పీడింపబడుట/దయ్యపు స్వాధీనములోనుండుట గూర్చి కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఈ ఉదాహరణలనుండి మనము దయ్యముచే ప్రభావితంచేయబడినప్పుడు ఏవిధమైన సూచనలు కల్గియుంటాడో మరియు ఒకరిని ఏవిధంగా దయ్యమునకు లోనైతాడో కొన్ని లోలోతుల విషయాలను తెలిసికొనవచ్చు. ఇక్కడ కొన్ని బైబిలు పాఠ్యాభాగలు నుదహరించబడినవి: మత్తయి 9:32-33; 12:22; 17:18; మార్కు 5:1-20; 7:26-30; లూకా 4:33-36; లూకా 22:3; అపోస్తలుల కార్యములు 16:16-18. ఈ కొన్ని పాఠ్యాభాగాలలో, దయ్యమునకు లోనైన వాడు ఏవిధంగా శారీరక రుగ్మతలకు అంటే మట్లాడుటకు శక్తి లేక, మూర్ఛ వచ్చిన సూచనలు, గ్రుడ్డితనము, మొదలగునవి. మరి కొంతమంది విషయములో, చెడు చేయటానికి పురికొల్పుతుంది, యూదా ముఖ్యమైన ఉదాహరణ. అపోస్తలులాకార్యములు 16:16-18, ఆత్మ దాసిగా ఉన్న చిన్నదానికి స్పష్టముగా తాను నేర్చుకున్న విషయములకంటె మరి ఎక్కువగా గ్రహించుటకు స్థోమత ఇచ్చాడు. గెరసేనీయులకు చేందిన మనుష్యుడు అపవిత్రాత్మ పట్టినవాడు, (సేనా) అను దయ్యముల అంటే రెండు వేల కంటే ఎక్కువగానున్న దయ్యములు, ఎక్కువ బహు బలముకలిగినవాడుగా మరియు సమాధులమధ్య బట్టలు లేకుండా జీవించేవాడు. రాజైన సౌలు, ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత, దురాత్మద్వార వెరపించబడెను (1 సమూయేలు 16:14-15; 18:10-11; 19:9-10) బహిర్గంగా కనపడే నిరాశ నిస్పృహల స్వభావముకలిగినవాడై మరియు దావీదు మీద పెరుగుతున్న అధిక ద్వేషభావంతో అతనిని చంపదలచెను.

ఆవిధంగా, వేర్వేరు రకాలుగా అపవిత్రాత్మ పట్టిన సూచనలు, అంటే శారీరక రుగ్మతలు గాని అవి నిజంగా శారీరకమైన సమస్యే అని చెప్పలేకపోవచ్చు, వ్యక్తిత్వాములో మార్పులు కావచ్చు అంటే నిరాశ లేక శతృత్వ ధోరణి, అసమాన్యమైన శక్తి, కొంటెతనము, సాంఘీక విద్రోహక ప్రవర్తన, మరియు ఎవరూ సామాన్యముగా చెప్పలేని విషయాలను చెప్పుటకు తనకున్న శక్తితొ చెప్పవచ్చు. ఇది గమనించుట ప్రాముఖ్యమైనది సుమారుగా అందరు, ఒకవేళ అందరు కాకపోయిన,ఇలాంటి లక్షణాలు వేరేవిధమైన సంజాయిషీలు చెప్పవచ్చు, గనుక ఇది ప్రాముఖ్యమైనది ఎందుకంటే అందర్ని ఒకేవిధంగా ఇతడు నిస్పృహలో నున్నాడు అని లేక మూర్ఛరోగముకలిగినవాడని అపవిత్రాత్మ పట్టినవానిని యెంచకూడదు. మరియొక వైపు, పాశ్చాత్య దేశ సంస్కృతులు వ్యక్తులజీవితాలలో సాతాను యొక్క సంబద్దతను అపాయకరమైనదానిగా భావించారు.

వీటికి తోడుగా శారీరక లేక భావోద్రేకా విలక్షణాలు, ఒకరు అతని ఆత్మీయా గుణగణాలును చూస్తే దయ్యముచే ప్రభావితం చేయబడటంను చూపిస్తుంది. ఇవి ఒకరిని క్షమించుటను వ్యతిరేకించే గుణంను తోడుచేస్తుంది (2 కొరింథీయులకు 2:10-11) మరియు తప్పుడు సిధ్దాంతములో నమ్ముటలో మరియు దానిని విస్తరిస్తూ, ప్రత్యేకంగా యేసుక్రీస్తును మరియు ఆయన ప్రాయాశ్చిత్తార్థమైన పానిని గురించి(2 కొరింథీయులకు11:3-4, 13-15; 1 తిమోతి 4:1-5; 1 యోహాను 4:1-3).

కైస్తవుల జీవితాలలో దయ్యముల సంబద్దతను గమనించినట్లయితే, అపోస్తలుడైన పేతురు ఒక విశ్వాసి ద్సయ్యముచే ప్రాభావితం చేయబడతాడని ఒక ఉదాహరణలో చెప్పాడు (మత్తయి 16:23). కొంతమంది క్రైస్తవులును చూచినపుడు ఎక్కువగా సాతాను అధికారములో నున్నవానిని వీడు "దయ్యము పట్టినవాడు," గాని లేఖానాభాగాలలో ఎక్కడకూడ ఒక క్రైస్తవ విశ్వాసి దయ్యముచే స్వాధీనపరచబడతాడని లేదు. చాలమంది వేదాంత పండితులు నమ్మిక ఏటంటే ఒక విశ్వాసిలో పరిశుధ్ధాత్ముడు ఉంటాడు కాబట్టి దయ్యము అధికారములో ఉండడు (2 కొరింథీయులకు 1:22; 5:5; 1 కొరింథీయులకు 6:19), మరియు దేవుని ఆత్మ దయ్యపు ఆత్మతో తన నివాసస్థలాన్ని పంచుకొనడు.

ఒకడు ఏవిధంగా తమ హృదయాన్ని స్వాధీనపరచబడటానికి అవాకాశమిశ్తాడో అన్నాది బహిర్గతం చేయలేదు. యూదా విషయములో మత్రమే ప్రత్యామ్నాయంగా , దురాస్దమేరకు తన హృదయాన్ని సాతానుకు అప్పగించాడు (యోహాను12:6). గనుక అది సాధ్యమవుతుంది ఎప్పుడంటే ఒక వ్యక్తి తన హృదయాన్ని తనకు అలవాటైన పాపానికి తావు ఇచ్చినట్లయితే సాతాను స్థావరము ఆ వ్యక్తి జీవితములోనికి లోనికి ప్రవేశించి స్థావరము ఏర్పాటు చేసుకోడానికి అవకాశమిచ్చినట్లవుతుంది. మిషనెరీల జీవితపు అనుభవాలనుండి, దయ్యములచే పట్టబడటం అనేది, అన్న్య దేవతల ఆరాధనకు మరియు వాటికి సంభంధించిన గూఢమైన పదార్థాలతో కలిగియున్నట్లుగా సూచిస్తుంది.లేఖనములు పర్యయముగా దేవతలను ఆరాధించటమే దయ్యములను ఆరాదించినట్లని చెప్తుంది (లేవీకాండం 17:7; ద్వితియోపదేశకాండం 32:17; కీర్తనలు 106:37; 1 కొరింథీయులకు 10:20), గనుక విగ్రాహారాధనతో పాలుపొందటం దయ్యములకు సంభంధించినదే అనిఅనుటకు ఆశ్చర్యము కాదు.

పైన చెప్పబడిన లేఖనభాగాలననుసరించి మరియు మిషనరీల అనుభవాలనుబట్టి, మనము సమాప్తిచేయగలిగేదేటంటే చాలమంది దయ్యముల ప్రభావితానికి వారు తమ జీవితాలను తెరచి పాపముచేయుటకు దానిని హత్తుకొనుటవలన లేక భక్తి భఃఅవంతొ పాల్గొనేవిధాన ద్వారా చేయుటవలన ( తెలిసియో లేక తెలియకనో). ఉదాహరణకు అపవిత్రత, మత్తుమందు/ మద్య పానీయములను సేవించుటవలన అది ఒకని సచేతనత్వంను నుండి, తిరుగుబాటు, చేదుస్వాభావమును, మరియు ఇంద్రియాతీత ధ్యానాన్నికి మార్చును.

ఒక అధికమైన కారణమువుంది. సాతాను మరియు వాటి సమూహము దేవుని అనుమతిలేకుండ అవి ఏమియు చేయుటకు దేవుడు అనుమతినివ్వడు (యోబు 1-2). ఇదే అయినట్లయితే , సాతాను, అతడు తన స్వంత ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్నట్లు ఆలోచిస్తాడు, అయితే యూదా నమ్మించి ద్రోహముచేయుటలో దేవుని గొప్ప ఉద్దేశ్యాన్ని సంపూర్తిచేసినట్లే దేవుని ఉద్డేశ్యాని నెరవేర్చును. కొంతమంది అనారోగ్యకరమైన వ్యామోహముతో గూఢమైన మరియు దయ్యపు క్రియలను వృధ్దిచేసుకుంటారు. ఇది అఙ్ఞానమైనది మరియు బైబిలువేతరమైనది. మనము దేవునిని వెదకినట్లయితే, ఆయన సర్వాంగ కవచమును ధరించి మరియు ఆయననిచ్చే బలముపై ఆధారపడినట్లయితే (ఎఫెసీయులకు 6:10-18), సాతానును సంభంధమైన విషయాల గూర్చిన భయము మనకు అవసరములేదు, ఎందుకంటే దేవుడే సమస్తాన్ని పరిపాలించువాడు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బైబిలు దయ్యముచే పీడింపబడుట/దయ్యపు స్వాధీనములోనుండుట గూర్చి ఏమి చెప్తుంది?