settings icon
share icon
ప్రశ్న

విచారమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? క్రైస్తవుడు ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కొనగలడు?

జవాబు


ఒత్తిడి (విచారం) ఒక విస్తృత పరిస్థితిగా ఉండి, లక్షల ప్రజలను అనగా క్రైస్తవులను మరియు క్రైస్తవులు కానివారిని ఒకే విధంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి చేత బాధపడువారు బాధ, ఆగ్రహం, నిరాశ, అలసట మరియు ఇతర వివిధ లక్షణాల యొక్క తీవ్రతను అనుభవిస్తారు.వారు ఒకప్పుడు కలసి ఆనందించిన ప్రజలలో మరియు విషయాలలో ఆశక్తిని కోల్పోయి పనికిరానివారమని భావించి ఆత్మహత్యకు పాల్పడడమును గూర్చి ఆలోచించడం మొదలుపెడతారు. మానసిక వేదన అనేది తరచు జీవితంలో వచ్చే కొన్ని పరిస్థితులను బట్టి ప్రేరేపించబడుతుంది అవేవనగా ఉద్యోగమును కోల్పోవడం, ప్రియమైన వారు మరణించడం, లేదా మానసిక సమస్యలు అనగా దుర్వినియోగం లేదా ఆత్మగౌరవంలో తక్కువతనం.

ఆనందముతో మరియు స్తోత్రములతో నింపబడాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది (ఫిలిప్పీ 4:$; రోమా 5:11), కాబట్టి మనం ఆనందముతో జీవితమును గడపాలని దేవుడు స్పష్టంగా భావిస్తున్నాడు. ఇది సందర్భానుసార నిస్పృహతో బాధపడుచున్న వ్యక్తికి సులభం కాదు, కానీ ఇది దేవుని బహుమానమైన ప్రార్థన, బైబిల్ అధ్యయనం మరియు అన్వయం, మద్దతు సమూహాలు, విశ్వాసుల మధ్య సహవాసం, ఒప్పుకోలు, క్షమాపణ, మరియు సలహాల ద్వార పరిష్కరించబడుతుంది. మనలోనే శోషితమవ్వకుండ మన ప్రయత్నాలను వెలుపలకు త్రిప్పుటకు కృషి చేయాలి. ఎప్పుడైతే మానసిక వేదనతో బాధపడువారు వారి దృష్టిని వారినుండి క్రీస్తువైపు లేదా ఇతరులవైపు త్రిప్పుతారో అప్పుడు వారి యొక్క ఒత్తిడి పరిష్కరించబడవచ్చు.

క్లినికల్ (clinical) ఒత్తిడి అనేది వైద్యుని ద్వార నిర్ధారణ చేయబడే ఒక శారీరక పరిస్థితి. ఇది దురదృష్టకర జీవిత పరిస్థితులవలన కలిగేది, లేదా లక్షణాలు ఒకరి సొంత సంకల్పంతో ఉపశమనం పొందేవి కాదు. క్రైస్తవ సమాజంలో కొంతమంది యొక్క నమ్మికకు విరుద్ధంగా, క్లినికల్ ఒత్తిడి ఎల్లప్పుడు పాపం వలన కలిగేది కాదు. కొన్నిసార్లు ఒత్తిడి శరీరక రుగ్మత ద్వార కలుగవచ్చు అది మందుల ద్వార/ లేదా సలహాల ద్వార చికిత్స చేయవచ్చు. వాస్తవంగా, ఏ విధమైన రోగమునైనను లేదా రుగ్మతనైనను దేవుడు నివారించగలడు. అయితే, కొన్నిసార్లు, ఒత్తిడి కొరకు వైద్యుడిని సంప్రదించడం అనేది గాయము కొరకు వైద్యుడ్ని సంప్రదించడానికి భిన్నత్వంగా ఉండదు.

ఒత్తిడికి గురైనవారు తమ ఆందోళనను తగ్గించడానికి చేయవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇష్టం లేకపోయినప్పుడు కూడా వాక్యంలో నిలిచియున్నారని నిర్ధారించుకొని యుండాలి. ఉద్రేకాలు మనలను దారి తప్పింపజేస్తాయి, కానీ దేవుని వాక్యం మారదు మరియు నిలిచియుంటుంది. దేవుని యందు గట్టి నమ్మకమును మనం కలిగియుండాలి మరియు శ్రమలు మరియు శోధనలలో ఉన్నప్పుడు ఆయనను మరెక్కువ గట్టిగా పట్టుకోవాలి. మనం సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన దేవుడు మనకు ఇవ్వడని బైబిల్ మనకు బోధిస్తుంది (1 కొరింథీ 10:13). ఒత్తిడిలో ఉండడం పాపం కాకపోయినప్పటికీ, అవసరమైన నిపుణుల సహాయం పొందుటతో సహాబాధపడువానికి ప్రతిస్పందించడంలో లెక్కించబడతాడు. “కాబట్టి ఆయన ద్వార మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదుము” (హెబ్రీ 13:!5).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

విచారమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? క్రైస్తవుడు ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కొనగలడు?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries