ప్రశ్న
యేసు నిజముగా జీవించెనా? యేసు క్రీస్తుకు ఏదైనా చారిత్రక రుజువు ఉందా?
జవాబు
సాధారణంగా, ఈ ప్రశ్న అడిగినప్పుడు, ఈ ప్రశ్న అడిగే వ్యక్తి “బైబిల్ వెలుపల” సమాధానమును కోరుచున్నాడు. యేసు యొక్క ఉనికికి రుజువుగా బైబిల్ ను పరిగణించకూడదని మా ఆలోచన కాదు. క్రొత్త నిబంధనలో యేసుకు కొన్ని వందల సూచనలు ఉన్నాయి. సువార్త రచనలను యేసు మరణమునకు 100 సంవత్సరముల తరువాత క్రీ.శ. రెండవ శతాబ్దమునకు సంబోధించువారు కొందరు ఉన్నారు. ఒకవేళ ఇది నిజమైనా (కాని దీనిని మేము బలముగా వాదిస్తాము), పురాతన రుజువుల విషయంలో, సంఘటనలు జరిగిన తరువాత 200 సంవత్సరాల లోపు వ్రాయబడిన రచనలను ఆధార యోగ్య రచనలుగా పరిగణిస్తారు. అంతేగాక, పౌలు యొక్క లేఖలు (కనీసం వాటిలో కొన్నైనా), క్రీ.శ. ఒకటవ శతాబ్దపు మధ్య భాగంలో, అనగా యేసు మరణమునకు 40 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో, వ్రాయబడెనని ఎక్కువ మంది పండితులు (క్రైస్తవులు మరియు అన్యులు) అంగీకరిస్తారు. పురాతన ప్రతుల రుజువు విషయంలో, క్రీ.శ. మొదటి శతాబ్దపు ఆరంభంలో ఇశ్రాయేలులో యేసు అను పేరు గల వ్యక్తి జీవించెను అనుటకు ఇది బలమైన రుజువుగా ఉంది.
క్రీ.శ. 70లో రోమీయులు యెరూషలేము మీద దండయాత్ర చేసి దానిని మరియు ఇశ్రాయేలులో చాలా వరకు ధ్వంసం చేసి, దానిలోని ప్రజలను వధించారు. పట్టణములన్నీ అక్షరాల అగ్నితో నేల కూలాయి. కాబట్టి, యేసును గూర్చిన అధిక రుజువులు అప్పుడు నాశనం చేయబడినవి అనుటలో మనం ఆశ్చర్యపడకూడదు. యేసుకు ప్రత్యక్ష సాక్షులు అనేకులు చంపబడియుంటారు. యేసు యొక్క ప్రత్యేక్ష సాక్షుల సాక్ష్యమును తీసుకొనుటను ఈ విషయములు కుదించియుండవచ్చు.
యేసు యొక్క పరిచర్య చాలా వరకు రోమా సామ్రాజ్యంలోని ప్రాముఖ్యతలేని ఒక మారుమూల ప్రాంతమునకు పరిమితమైన విషయమును దృష్టిలో పెట్టుకొని, యేసును గూర్చి ఆశ్చర్యము కలిగించి మొత్తములో సమాచారమును అన్య చారిత్రక నిధుల ద్వారా మనం పొందవచ్చు. యేసును గూర్చిన ముఖ్యమైన చారిత్రక రుజువులలో కొన్ని క్రింద ఇవ్వబడెను:
మొదటి శతాబ్దపు రోమాకు చెందిన టాసిటస్, పురాతన ప్రపంచములో ఖచ్చితమైన చరిత్రకారులలో ఒకనిగా పరిగణించబడిన వ్యక్తి, తిబెరియ పరిపాలనలో పొంతు పిలాతు ఆధీనంలో శ్రమపొందిన మూఢనమకస్తులైన “క్రైస్తవులను” (క్రీస్తు అను అర్థం కలిగిన లాటిన్ భాషలో “క్రిష్టస్”) గూర్చి ప్రస్తావించాడు. మొదటి శతాబ్దములో క్రిష్టస్ (లేక క్రీస్తు) అను పేరు గల పురుషుడు జీవించాడని హద్రియన్ చక్రవర్తికి ముఖ్య సెక్రటరీ అయిన సూటోనియస్ వ్రాసాడు (Annals 15.44).
ఫ్లావియస్ జోసిఫస్ అత్యంత ప్రఖ్యాతిగాంచిన యూదా చరిత్రకారుడు. తన Antiquities అను రచనలో అతడు యాకోబును, “క్రీస్తు అని పిలువబడు యేసు యొక్క సోదరుడు” అని సంబోధించాడు. ఒక వివదాత్మక వచనం ఉంది (18:3), మరియు అది ఇలా చెబుతుంది, “అప్పుడు ఆ సమయంలో జ్ఞాని అయిన యేసు ఉండెను, అతనిని మానవుడు అని పిలుచుట చట్టబద్ధమైన యెడల. ఎందుకంటే ఆయన ఆశ్చర్యక్రియలు చేశాడు.....ఆయనే క్రీస్తు...ఆయనను గూర్చి దైవిక ప్రవక్తలు చెప్పినట్లు మరియు ఇలాంటివి పది వేల అద్భుత విషయములు చెప్పినట్లు, మూడవ రోజు వారికి సజీవంగా ప్రత్యక్షమయ్యాడు.” ఒక వెర్సన్ లో ఇలా ఉంది, “ఆ కాలమందు జ్ఞానియైన యేసు ఉండెను. ఆయన ప్రవర్తన మంచిది మరియు [ఆయన] మంచి వ్యక్తిగా పరిగణించబడెను. మరియు యూదుల నుండి ఇంకా ఇతర దేశముల నుండి ఆయనకు అనేక మంది శిష్యులయ్యారు. ఆయనకు సిలువ వేయాలని మరియు అతడు మరణించాలని పిలాతు ఆదేశించాడు. అయితే ఆయనకు శిష్యులైనవారు వారి శిష్యరికమును విడిచిపెట్టలేదు. సిలువ వేయబడిన మూడు రోజుల తరువాత ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడని, మరియు ఆయన సజీవుడని వారు చెప్పారు; ఆ విధంగా ప్రవక్తలు అద్భుతాలతో చెప్పిన మెస్సీయ ఆయనే కావచ్చు.”
క్రీస్తు మరణం తరువాత కలిగిన చీకటిని గూర్చి చర్చిస్తూ జూలియస్ ఆఫ్రికానస్ అను వ్యక్తి చరిత్రకారుడైన తాలస్ యొక్క ఉద్ధారమును చెప్పాడు (Extant Writings, 18).
ప్లినీ ది యంగర్, Letters 10:96లో, క్రైస్తవులు యేసును దేవునిగా ఆరాధించెను అని మరియు వారు నైతిక విలువలు గలవారని చెబుతూ, ఆదిమ క్రైస్తవ ఆరాధనా అభ్యాసములను మరియు ప్రేమ విందులను, బల్లారాధనను అతడు లిఖించాడు.
పస్కా పండుగ దినమున యేసు యొక్క సిలువవేయబడుటను నిర్థారిస్తూ, అయన గారడీని అభ్యసించి యూదా దైవదూషణను ప్రోత్సహించాడని బాబిలోనియన్ తాల్ముడ్ (సంహేద్రిన్ 43a) చెబుతుంది.
యేసు క్రైస్తవుల ద్వారా ఆరాధించబడెనని, క్రొత్త బోధలను పరిచయం చేసెనని, మరియు వాటి కొరకు సిలువవేయబడెనని రెండవ శతాబ్దపు గ్రీకు రచయితయైన లూసియన్ సమోసాట ఒప్పుకొనెను. యేసు బోధలలో విశ్వాసుల యొక్క సహోదరత్వము, మారుమనస్సు యొక్క ప్రాముఖ్యత, మరియు ఇతర దేవతలను విసర్జించవలసిన అవసరత ఉన్నాయని ఆయన చెప్పెను. క్రైస్తవులు యేసు నియమాలను అనుసరించి జీవించారని, వారు అమరులని నమ్మారని, మరణము పట్ల విరోధ భావం కలిగియున్నారని, స్వచ్ఛంద స్వయం-భక్తి కలవారని, మరియు ఇహలోక వస్తువులను విసర్జించారని ఆయన చెప్పాడు.
యేసు జ్ఞాని మరియు మంచి వ్యక్తిగా పరిగణించబడెనని, అనేక మంది ఆయన ఇశ్రాయేలుకు రాజు అవుతాడని యోచించారని, యూదులచే చంపబడెనని, మరియు తన అనుచరుల యొక్క బోధలలో జీవించెనని మర బార్-సెరాఫియన్ నిర్థారించాడు.
మరియు మన యొద్ద యేసును ప్రస్తావించు అనేక జ్ఞాస్తిక్ రచనలు (The Gospel of Truth, The Apocryphon of John, The Gospel of Thomas, The Treatise on Resurrection, etc.) ఉన్నాయి.
వాస్తవానికి, ఆదిమ అన్య-నిధుల ద్వారా మనం సువార్తను పునర్నిర్మించవచ్చు: యేసు క్రీస్తు అని పిలువబడెను (జోసిఫస్), “అద్భుతాలు” చేసెను, ఇశ్రాయేలును నూతన బోధలలోనికి నడిపించెను, మరియు వారి కొరకు పస్కా దినమున సిలువవేయబడెను (బాబిలోనియన్ తాల్ముడ్)యూదయాలో (టాసిటస్), అయితే దేవుడని చెప్పి మరలా వస్తానని చెప్పెను (ఎలియాజర్), ఆయనను దేవునిగా ఆరాధిస్తూ తన అనుచరులు నమ్మెను (ప్లినీ ది యంగర్).
యేసు క్రీస్తు యొక్క ఉనికిని గూర్చి అన్య మరియు బైబిల్ చరిత్రలో గొప్ప రుజువులు ఉన్నాయి. క్రీ.శ. మొదటి శతాబ్దంలో, పన్నెండు మంది శిష్యులతో సహా కొన్ని వేల మంది క్రైస్తవులు యేసు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారుటకు సిద్ధపడుట అన్నిటికంటే గొప్ప రుజువు కావచ్చు. వారు నిజమని నమ్మువాటి కొరకే ప్రజలు మరణిస్తారు, కాని వారు అబద్ధమని నమ్ముదాని కొరకు ప్రజలు మరణించరు.
English
యేసు నిజముగా జీవించెనా? యేసు క్రీస్తుకు ఏదైనా చారిత్రక రుజువు ఉందా?