ప్రశ్న
డైనోసార్ల గురించి బైబిల్ ఏమి చెబుతుంది? బైబిల్ లో డైనోసార్లు ఉన్నాయా?
జవాబు
డైనోసార్ యొక్క అంశం భూమి యొక్క వయస్సు, ఆదికాండము యొక్క సరైన అనువాదం, మరియు మన చుట్టూ ఉన్న శారీరక రుజువులను మనం ఎలా అనువదించాలి అను వాటిపై క్రైస్తవ సమాజంలో తరాలుగా జరుగుచున్న గొప్ప వాదనలో భాగమైయుంది. భూమికి ఎక్కువ వయస్సు ఉంది అని నమ్మువారు బైబిల్ డైనోసార్లను గూర్చి చెప్పదని అంగీకరిస్తారు, అందుకంటే, వారి ఆలోచన ప్రకారం, మొదటి వ్యక్తి భూమి మీద నివసించుటకు కొన్ని లక్షల సంవత్సరాల మునుపే డైనోసార్లు అంతరించాయి. బైబిల్ వ్రాసిన వారు జీవించు డైనోసార్లను చూసియుండకపోవచ్చు.
భూమి యొక్క యవ్వన వయస్సును నమ్మువారు, బైబిల్ “డైనోసార్” అను పదమును సూటిగా ఉపయోగించకపోయినప్పటికీ, డైనోసార్ల ప్రస్తావన బైబిల్ లో ఉందని అంగీకరిస్తారు. బదులుగా అది tanniyn అనే హెబ్రీ పదమును ఉపయోగిస్తుంది, మరియు ఆంగ్ల బైబిల్ లో ఇది పలు విధాలుగా అనువదించబడినది. కొన్ని సార్లు అది “సముద్ర జీవిగా” మరికొన్ని సార్లు “సర్పముగా” అనువదించబడింది. Tanniyn అను మాట ఒక బహు పెద్ద జంతువును సూచిస్తుంది. ఈ జీవులు పాత నిబంధనలో సుమారుగా ముప్పై సార్లు ప్రస్తావించబడినవి మరియు అవి భూమిమీద మరియు నీటిలో కూడా కనుగొనబడినవి.
ఈ పెద్ద జంతువుల యొక్క ప్రస్తావనతో పాటుగా, రచయితలు డైనోసార్లను వర్ణిస్తున్నారని పండితులకు నమ్మకమును కలిగించు కొన్ని జీవులను బైబిల్ వివరిస్తుంది. దేవుని సృష్టి అంతటిలో నీటి గుఱ్ఱము అత్యంత బలమైనది, మరియు దాని తోక దేవదారు వృక్షముతో పోల్చబడినది (యోబు 40:15). నీటి గుఱ్ఱమును ఏనుగుతోను లేక నీటి ఏనుగుతోను గుర్తించుటకు కొందరు పండితులు ప్రయత్నిస్తారు. ఏనుగులకు మరియు నీటి ఏనుగులకు దేవదారు వృక్షములతో ఎలాంటి పోలిక లేకుండా చాలా సన్నని తోకలు ఉంటాయని మరికొందరు సూచిస్తున్నారు. బ్రకియోసరస్ మరియు డిప్లోడొకస్ వలె డైనోసార్కు దేవదారు వృక్షముతో పోల్చదగిన పెద్ద తోకలు ఉంటాయి.
ప్రతి పురాతన నాకరికతలో పెద్ద జంతువుల వంటి జీవులను సూచించు కళా ఫలకములు ఉన్నాయి. ఉత్తర అమెరికాలో కనుగొనబడిన పెట్రోగాలైఫ్, వివిధ కళలు, మరియు చిన్న చిన్న మట్టి బొమ్మలు కూడా ఆధునిక డైనోసార్లను పోలియున్నాయి. దక్షిణ అమెరికాలో కనుగొన్న రాతి ఫలకములు డిప్లోడోకాస్ వంటి జీవులపై సవారీ చేయుచున్న పురుషులను చిత్రిస్తుంది, మరియు వీటిలో ట్రైసిరోటాప్స్ వంటి, టెరోడాక్టైల్ వంటి, టైరనోసారస్ రెక్స్ వంటి సుపరిచిత బొమ్మలు కూడా దానిలో ఉన్నాయి. రోమా రంగుల చిత్రాలు, మాయన్ పద్యములు, మరియు బబులోను పట్టణ గోడలు అన్ని ఇట్టి జీవులపై మానవుని యొక్క భౌగోళిక మరియు సంస్కృతిపరమైన అంతులేని ఆసక్తిని తెలుపుచున్నవి. మార్కో పోలో యొక్క Il Milione వంటి శాంతికరమైన కథనములు నిధులు కలిగియున్న ఇట్టి మృగాలతో ప్రజలు కలసిన అద్భుత కథలను తెలియజేస్తున్నాయి. డైనోసార్లు మరియు మానవుల యొక్క సహజీవనమునకు చారిత్రక మరియు మానవిక రుజువులకు తోడుగా, ఉత్తర అమెరికా మరియు పశ్చిమ మధ్య ఆసియాలో కనుగొనిన మానవుల మరియు డైనోసార్ల కాలి ముద్రల వంటి భౌతిక రుజువులు కూడా ఉన్నాయి.
కాబట్టి, బైబిల్ లో డైనోసార్లు ఉన్నాయా? ఈ విషయం ఇంకా తేల్చబడలేదు. ఇది మీ యొద్ద ఉన్న రుజువులను మేరు ఎలా అనువదిస్తారు, మరియు మీ చుట్టూ ఉన్న లోకమును ఎలా చూస్తారు అన్న దాని మీద ఆధారపడియున్నది. బైబిల్ ను అక్షరార్థంగా అనువదించినయెడల, భూమి యొక్క యవ్వన వయస్సును నమ్మటం జరుగుతుంది, మానవులు మరియు డైనోసార్లు కలిసి జీవించాయి అను ఆలోచనను అంగీకరించవచ్చు. డైనోసార్లు మరియు మానవులు కలిసి జీవించియుంటే, డైనోసార్లకు ఏమైయ్యింది? బైబిల్ ఈ విషయమును గూర్చి ఎలాంటి చర్చ చేయనప్పటికీ, జలప్రళయం తరువాత వాతావరణంలో కలిగిన మార్పుల వలన మరియు మానవుల ద్వారా తరచుగా వేటాడబడుట వలన డైనోసార్లు మరణించి అంతరించియుండవచ్చు.
English
డైనోసార్ల గురించి బైబిల్ ఏమి చెబుతుంది? బైబిల్ లో డైనోసార్లు ఉన్నాయా?