settings icon
share icon
ప్రశ్న

క్రైస్తవులు వారి పిల్లలను ఎలా క్రమశిక్షణలో ఉంచాలి? బైబిలు ఏమి చెప్తుంది?

జవాబు


పిల్లలను క్రమశిక్షణలో మంచిగా ఎలా ఉంచాలి అని నేర్చుకొనడం కష్టమైన పని, కాని అది కీలకంగా ప్రాముఖ్య మైనది. కొద్దిమంది శారీరక క్రమశిక్షణ పిరుదలపై (భౌతిక శిక్ష) లాంటి ఒకేఒక్క పద్ధతి బైబిలు మద్దతిచ్చునని పేర్కొనును. ఇతరులు అది “సమయాతీతమని” సమర్ధించి మరియు ఇతర శిక్షలు చాలా ప్రభావితమైన శారీరక క్రమశిక్షణలో ప్రమేయం కలిగియుండవు. బైబిలు ఏమి చెప్పెను? బైబిలు శారీరక క్రమశిక్షణ సరియైనది, లాభదాయకం, మరియు అవసరం అని బోధించును.

అపార్థము చేసికొనకుడి – మనము ఏవిధముగా పిల్లల దుర్వినియోగమును ప్రతిపాదించుటలేదు. ఒక పిల్లవానికి వాస్తవంగా శారీరక హాని జరిగేంత వరకు భౌతిక క్రమశిక్షణ వెళ్లకూడదు. బైబిలు ప్రకారం, ఒక పిల్లవానికి తగిన మరియు నియంత్రణగల శారీరక క్రమశిక్షణ మంచి విషయమే అయినప్పటికీ మరియు అది పిల్లవాని శ్రేయస్సుకు మరియు సరియైన పెంపకమునకు కారణమగును.

చాలా లేఖనములు నిజానికి శారీరక క్రమశిక్షణను ప్రచారం చేయును. “నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును” (సామెతలు 23:13-14; 13:24; 22:15;20:30 కూడా చూడుము). బైబిలు క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యతపై బలముగా ఒత్తిడి చేయును; అది మనందరికీ ఉండవలసినది ఎందుకనగా ప్రజలు ఫలవంతముగా ఉండుటకు, మరియు మనము యవ్వనముగా ఉన్నప్పుడే అది మరింత సులువుగా నేర్చుకొనవచ్చు. క్రమశిక్షణ లేని పిల్లలు తరచుగా తిరుగుబాటుతో పెరుగుదురు, అధికారముపై గౌరవం లేకుండా, మరియు దాని ఫలితముగా ఇష్టపూర్వకముగా విధేయత చూపి మరియు దేవుని అనుసరించుటకు కష్టముగా కనుగొనును. దేవుడు తానే మనలను సరిచేయుటకు మరియు సరియైన మార్గములో మనలను నడిపించుటకు మరియు మన తప్పుడు క్రియలకు మారుమనస్సును ప్రోత్సహించుటకు క్రమశిక్షణను ఉపయోగించును (కీర్తనలు 94: 12; సామెతలు 1:7; 6:23; 12:1; 13:1; 15:5; యెషయా 38:16; హెబ్రీ. 12:9).

క్రమశిక్షణను సరిగా మరియు బైబిలుసంబంధ ప్రకారం అన్వయిoచుటకు, తల్లితండ్రులు క్రమశిక్షణ గూర్చిన లేఖనముల సలహాలను బాగుగా తెలిసికొనవలెను. సామెతల గ్రంధము పిల్లల పెంపకమును గూర్చి అపార జ్ఞానమును కలిగి, ఇలాంటి, “బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును” (సామెతలు 29:15). ఈ వచనము బాలుడు శిక్షిoపబడకపోతే కలిగే పరిణామాలను బాహ్యముగా చూపును – తల్లితండ్రులు అవమానపడుడురు. అయితే, క్రమశిక్షణ తన లక్ష్యం బాలుని మంచికే మరియు పిల్లలను కష్టపెట్టి మరియు దుర్వినియోగముగా న్యాయంతీర్చుటకు ఎప్పటికీ ఉపయోగించరాదు. అది ఎన్నడూ కోపమును బయటకు చూపే దానిగా లేక నిరాశకు వాడరాదు.

క్రమశిక్షణ సరియైన మార్గములో వెళ్ళుటకు ప్రజలను సరిచేసి మరియు తర్ఫీదుకు ఉపయోగించును. “మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును” (హెబ్రీ 12:11). దేవుని క్రమశిక్షణ ప్రేమకలిగి, బాలుడు మరియు తల్లితండ్రుల మధ్య ప్రేమవలే ఉండును. శారీరక క్రమశిక్షణ ఎప్పుడు శారీరక హాని లేక నొప్పి కలిగించేలా వాడకూడదు. భౌతిక శిక్ష ఎల్లప్పుడు వెంటనే బాలుని అతడు/ఆమె ప్రేమించబడుచున్నారని నిర్దారింపబడుటకు ఆదరించబడాలి. ఈ క్షణాలు బాలునికి బోధించుటకు సరియైన సమయము, దేవుడు మనలను క్రమశిక్షణ చేయును ఎందుకంటే ఆయన మనలను ప్రేమించును మరియు, తల్లితండ్రులుగా, మనము మన పిల్లలకు అలాగే చేయుదుము.

ఇతర క్రమశిక్షణ రకాలు, “సమయాతీత” లాంటివి, శారీరక క్రమశిక్షణకు బదులుగా ఉపయోగించవచ్చా? కొద్దిమంది తల్లితండ్రులు వారిపిల్లలు శారీరక క్రమశిక్షణకు సరిగా ప్రతిస్పందించరని కనుగొనును. కొద్దిమంది తల్లితండ్రులు “సమయాతీతం,” నిలుపుదల, మరియు/లేక ఏదైనా ఒకటి పిల్లలనుండి తీసివేసికోవడం ప్రవర్తన మార్పులో ఎక్కువ సమర్దవంతముగా ప్రోత్సహించును. ఒకవేళ అదే విషయమైతే, అన్నిటి ద్వారా, తల్లితండ్రులు ప్రవర్తన మార్పుకు అవసరమైన శ్రేష్ఠమైన పద్ధతులు నియమించాలి. బైబిలు శారీరక క్రమశిక్షణను ఖండించకుండా ప్రతిపాదించును, లక్ష్యమును ఉత్పత్తి చేయు ఖచ్చితమైన పద్ధతి కంటే, బైబిలు దైవిక స్వభావమును కట్టు లక్ష్యము కొరకు సంబధించినది.

ఈ సమస్యను ఇంకా కష్టముగా చేయుటకు ప్రభుత్వాలు ప్రతివిధమైన భౌతిక క్రమశిక్షణను బాల్య దుర్వినియోగముగా విభాగించుటకు ప్రారంభించుచుండెననునది వాస్తవం. చాలామంది తల్లితండ్రులు వారి పిల్లలను బెత్తముతో కొట్టుటకు ప్రభుత్వమునకు నివేదించునని మరియు వారి పిల్లలు దూరముగా తీసికొనిపోవు ప్రమాదం కలుగునని భయపడును. ఒకవేళ ప్రభుత్వము పిల్లలను శారీరకముగా శిక్షించుట అన్యాయముగా మారిస్తే తల్లితండ్రులు ఏమి చేయవలెను? రోమా 13:1-7 ప్రకారం, తల్లితండ్రులు ప్రభుత్వమునకు లోబడాలి. ఒక ప్రభుత్వము దేవుని వాక్యముతో ఎన్నడు విభేదిoచకూడదు, మరియు శారీరక క్రమశిక్షణ అనగా, బైబిలుసంబంధంగా మాట్లాడితే, పిల్లల యొక్క శ్రేష్ఠమైన ఆసక్తి. అయితే, ప్రభుత్వము యొక్క “రక్షణ”కు పిల్లలను వదిలివేయడం కంటే కొద్దిగానైనా క్రమశిక్షణ పొండుకొనే కుటుంబాలలో పిల్లలను వుంచడం చాలా మంచిది.

ఎఫెసీ 6:4లో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడని చెప్పబడెను. బదులుగా, వారు వారిని దేవుని మార్గాలలో పెంచాలి. ఒక బాలుని “ప్రభువు యొక్క బోధలోను మరియు శిక్షణలోను” పెంచుట నియంత్రణ, సరిచేయుటను కలిగియుండి, మరియు, అవును, శారీరిక క్రమశిక్షణను ప్రేమించుటను కూడా కలిగియుండును.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

క్రైస్తవులు వారి పిల్లలను ఎలా క్రమశిక్షణలో ఉంచాలి? బైబిలు ఏమి చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries