ప్రశ్న
దైవఘటన సిద్ధాంత వేదాంతము అనగానేమి, మరియు అది పరిశుద్ధగ్రంథానుసారమైనదేనా?
జవాబు
దైవఘటన అనునది కార్యములను చక్కబెట్టునటువంటి ఒక విధానము – ఒక పరిపాలన, ఒక విధానము, ఒక నిర్వహణ. వేదాంత శాస్త్రములో, ఈవిధి/దైవఘటన అనునది ఒక కాలమును గూర్చిన దైవిక పరిపాలనా విధానము; ప్రతి యుగము కూడా దైవ నిర్దేశిత యుగము. దైవఘటన సిద్ధాంత వేదాంతము అంటే ఈ యుగములు దేవునిచే ఉద్దేశించబడి లోకము యొక్క పరిస్థితులను క్రమబద్దీకరిస్తున్నాయి అని చెప్పే ఒక వేదాంతశాస్త్ర పరమైన వ్యవస్థ. ఈ దైవఘటన సిద్ధాంతములో ప్రాముఖ్యంగా రెండు ప్రత్యేకతలు ఉంటాయి: 1) లేఖనభాగముల స్థిరమైనవిశదము, ప్రత్యేకముగా పరిశుద్ధ గ్రంథ ప్రవచనము గూర్చి, మరియు 2) దేవుని ప్రణాళికలో సంఘము కంటే ఇశ్రాయేలు ఒక విశిష్టత కలిగిన వ్యవస్థ అని చెప్పే ఆలోచన. సంప్రదాయమైన దైవఘటన సిద్ధాంత వేదాంతము మానవాళిని గూర్చిన దేవుని ప్రణాళికలో కనీసం ఏడు దైవఘటనలు ఉన్నట్లుగా గుర్తిస్తుంది.
పరిశుద్ధగ్రంథమును ఉన్నది ఉన్నట్లుగా అక్షరాలా వివరించడమే శ్రేష్ట్టమైన విశదము అని ఈ దైవఘటన సిద్ధాంతము తెలుపుతుంది. ఈవిధమైన అక్షరార్థము ప్రతి పదమునకు దైనందిన ప్రయోగంలో ఉండే ఆ అర్థాన్నే సాధారణంగా ఇస్తుంది. గురుతులకు, భాషా రూపములకు, మరియు అనేక రకాలకు కొన్ని అనుమతులు ఉంటాయి అనుకోండి. ఆఖరుకు గురుతులు మరియు అలంకారములతో కూడిన మాటలకు కూడా వాటి వెనుక ఒక అక్షరార్థము ఏదో ఉంటుందని భావించబడుతుంది. ఉదాహరణకు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథము “వెయ్యేళ్ళ”ను గూర్చి మాట్లాడుతున్నప్పుడు, దైవఘటన సిద్ధాంతులు ఈ అంకెను అక్షరాలా 1000 సంవత్సరాల కాలముగా వివరిస్తారు (అంటే రాజ్యము యొక్క యుగముగా), ఎందుకంటే దీనిని వేరేవిధంగా వివరించుటకు ఆమోదయోగ్యమైన కారణము ఏమియు లేదు గనుక.
లేఖనమును దృష్టించుటకు ఈ అక్షరార్థమే శ్రేష్టమైన విధానము అని చెప్పుటకు కనీసం రెండు కారణాలు ఉన్నాయి. మొదటిగా, తత్వశాస్త్ర అనుసారముగా, భాష యొక్క ఉద్దేశమే అసలు మనము పదములను అక్షరార్థముతో విశదీకరించాలని చెప్తుంది. సంభాషించుకొనుటకు వీలుగా భాష అనునది దేవునిచే దయచేయబడింది. పదములు అనునవి అర్థము యొక్క పాత్రలు. రెండవది పరిశుద్ధగ్రంథానుసారమైనది. పాతనిబంధనలో యేసుక్రీస్తును గూర్చి చేయబడిన ప్రతిఒక్క ప్రవచనము అక్షరార్థముగా నెరవేరబడింది. యేసు యొక్క పుట్టుక, పరిచర్య, మరణము మరియు పునరుద్ధానము ఇవన్నియు పాతనిబంధన ప్రవచించినట్లుగానే నెరవేరాయి. ప్రవచనములు అక్షరార్థములు. క్రొత్తనిబంధనలో మెస్సీయ నెరవేర్చిన ప్రవచనములలో అక్షరార్థ-రహిత నేరవేర్పులు ఏమి లేవు. ఇది అక్షరార్థమైన విధానము కొరకు బలమైన వాదన వినిపిస్తుంది. లేఖనములను చదుతువున్నప్పుడు అక్షరార్థమైన విశదము ప్రయోగించకపొతే, పరిశుద్ధ గ్రంథమును అర్థము చేసుకొనుటకు గలబాహ్యమైన ప్రామాణికం ఏమి లేదు. ప్రతి వ్యక్తి తనకు ఇష్టం వచ్చినట్లుగా లేఖనములను విశదపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథ విశదము అనునది “పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా చెప్తుంది” అని అనుట నుండి “ఈ వాక్యభాగము నాకు ఏమి చెప్తుంది” అని చెప్పే అంత స్థితికి దిగజారుతుంది. చాలా వరకు పరిశుద్ధ గ్రంథ అధ్యయనము అని పిలువబడుతున్న వాటిలో నేడు జరుగుతుంది కూడా ఇదే కావడం విచారకరం.
దైవఘటన సిద్ధాంతమనే వేదాంతము రెండు వేరువేరు రకాలైన దేవుని ప్రజలు ఉన్నారని మనకు బోధిస్తుంది: ఇశ్రాయేలు మరియు సంఘము. ఈ సిద్ధాంత వాదులు రక్షణ అనునది ఎప్పుడైనా విశ్వాసము ద్వారానే – అంటే పాతనిబంధన దేవునిపై విశ్వాసము అలాగే ప్రత్యేకముగా క్రొత్తనిబంధనలో ఉన్న కుమారుడైన దేవుని యందు విశ్వాసము – కలుగుతందని నమ్ముతారు. దేవుని ప్రణాళికలో సంఘము అనునది ఇశ్రాయేలు యొక్క స్థానాన్ని ప్రతిక్షేపించలేదు మరియు పాతనిబంధనలో ఇశ్రాయేలును గూర్చి చేయబడిన వాగ్దానాలు సంఘమునకు బదిలీ చేయబడలేదు అని వీరు నమ్ముతారు. పాతనిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలు (భూమిని గూర్చి, అనేకసంతానమును గూర్చి, మరియు ఆశీర్వాదములను గూర్చి) ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో మాట్లాడబడిన ఆ వెయ్యేళ్ళ పరిపాలన కాలములో నెరవేరతాయి అని ఈ దైవఘటన సిద్ధాంతము బోధిస్తుంది. ఈ యుగమందు ఏవిధంగానైతే దేవుడు తన దృష్టిని సంఘముపై నిలుపుతున్నాడో, భవిష్యత్తులో మరలా ఒకసారి దేవుడు తన దృష్టిని ఇశ్రాయేలుపై పెడతాడు అని ఈ సిద్ధాంతవాదులు నమ్ముతారు(రోమీయులకు 9-11 మరియు దానియేలు 9:24 చూడండి).
పరిశుద్ధ గ్రంథము ఏడు యుగములుగా నిర్వహించబడినది అనిదైవఘటన సిద్ధాంత వేదాంతులు భావిస్తుంటారు: అమాయక యుగము (ఆదికాండము 1:1 – 3:7), మనసాక్షి యుగము (ఆదికాండము 3:8 – 8:22), మానవ ప్రభుత్వ యుగము (ఆదికాండము 9:1 – 11:32), వాగ్ధాన యుగము (ఆదికాండము 12:1 – నిర్గమకాండము 19:25), ధర్మశాస్త్ర యుగము(నిర్గమకాండము 20:1 – అపొస్తలుల కార్యములు 2:4), కృపా యుగము (అపొస్తలుల కార్యములు 2:4 – ప్రకటన 20:3), మరియు వెయ్యేళ్ళ రాజ్యపరిపాలన యుగము (ప్రకటన 20:4-6). మరలా, ఈ యుగములు అనునవి రక్షణకు మార్గములు కావు, కాని దేవుడు మానవులతో అనుబంధం చేసుకొనే విధానాలు. ప్రతి యుగము కూడా ఆ యుగములలో జీవించిన మానవులతో దేవుడు ఏ విధముగా సంబంధమును కలిగియున్నాడో ఒక గమనార్హమైన విధానమును తెలుపుతున్నాయి. ఈ విధానము ఏమంటే 1) బాధ్యత, 2) వైఫల్యము, 3) తీర్పు, మరియు 4) ముందుకు సాగుటకు కృప.
వ్యవస్థగా ఈ దైవఘటన సిద్ధాంత వేదాంతము, సాధారణంగా, క్రీస్తు యొక్క రెండవ రాకడ ఈ వెయ్యేళ్ళ పరిపాలన కాలమునకు ముందు ఉంటుందని, మరియు మామూలుగా ఎత్తబడుట అనునది ఈ శ్రమల కాలమునకు ముందే జరుగుతుందని వివరిస్తుంది. సారాంశంగా చెప్పాలంటే, పరిశుద్ధ గ్రంథ ప్రవచనమునకు అక్షరార్థ విశదమును ఉద్ఘాటిస్తూ, ఇశ్రాయేలు మరియు సంఘమునకు గల ప్రత్యేకతలను గుర్తిస్తూ, అనేక యుగములుగా లేక పరిపాలనా వ్యవస్థలుగా పరిశుద్ధ గ్రంథమును నిర్వహించే ఒక వేదాంతపరమైన వ్యవస్థే ఈ దైవఘటన సిద్ధాంత వేదాంతము.
English
దైవఘటన సిద్ధాంత వేదాంతము అనగానేమి, మరియు అది పరిశుద్ధగ్రంథానుసారమైనదేనా?