settings icon
share icon
ప్రశ్న

క్రైస్తవ కలల వ్యాఖ్యానం? మన కలలు దేవుని యొద్దనుండేనా?

జవాబు


GotQuestions.org అనేది క్రైస్తవ కలల వ్యాఖ్యాన సేవ కాదు. మనము కళలను వ్యాఖ్యానించము. మనము ఒక వ్యక్తి యొక్క కలలు మరియు ఆ కలల అర్థములు ఆ వ్యక్తికి మరియు కేవలం దేవునికి మాత్రమే అని గట్టిగా నమ్ముదము. గతించిన కాలంలో, దేవుడు కొద్దిమంది ప్రజలతో కలలతో మాట్లాడెను. ఉదాహరణలు యాకోబు కుమారుడైన, యోసేపు(ఆదికాండం 37:5-10); మరియ భర్తయైన, యోసేపు (మత్తయి 2:12-22); సోలోమోను (1 రాజులు 3:5-15); మరియు చాలామంది ఇతరులు (దానియేలు 2:1; 7:1; మత్తయి 27:19). ప్రవక్తయైన యోవేలు ప్రవచనం కూడా ఒకటి ఉంది (యోవేలు 2:28), అది అపొస్తలుడైన పేతురుచే అపొ 2:17 లో చెప్పెను, దేవుడు కళలను వాడుకోనుతను ప్రస్తావించెను. అందువలన ఒకవేళ ఆయన ఎంపికచేసికొంటే, దేవుడు కలల ద్వారా కూడా మాట్లాడును.

అయితే,మనము బైబిలు సంపూర్ణమని మన మనస్సులో ఉంచుకోవాలి, సమస్తము బయలుపరచబడి ఇప్పటి నుండి నిత్యత్వము వరకు తెలిసికోవలసిన అవసరం వుంది. ఇది దేవుడు అద్భుత కార్యాలు చేయడు లేక కలల ద్వారా మాట్లాడడు అని కాదుకాని, దేవుడు ఏది చెప్పినా, అది కల ద్వారానైనా, దర్శనమైనా, ముద్ర, లేక “మెల్లని చిన్న స్వరమైనా,” ఆయన తన వాక్యములో ముందే చెప్పిన వాటిని పూర్తిగా అంగీకరించును. కలలు లేఖనము యొక్క అధికారమును బలాత్కారం చేయలేదు.

ఒకవేళ నీవు ఒక కల కలిగి మరియు అది బహుశా దేవుడే నీకిచ్చాడని భావిస్తే, ప్రార్థనపూర్వకంగా దేవుని వాక్యమును పరిశీలించి మరియు నీ కల లేఖనముతో అంగీకరించబడునని నిర్ధారించుకొనుము. ఒకవేళ అది, ప్రార్థనాపూర్వకంగా నీ కలకు స్పందనగా దేవుడు ఏమి చేస్తాడు అని పరిగణిoచుము (యాకోబు 1:5). లేఖనములో, ఎప్పుడైతే ఎవరైనా దేవుని యొద్దనుండి ఒక కళను అనుభవిస్తే, దేవుడు ఎల్లప్పుడు ఆ కల యొక్క అర్థమును స్పష్టముచేసెను, ప్రత్యక్షంగా ఆ వ్యక్తికి గాని, ఒక దూత ద్వారా గాని, లేక మరియొక వర్తమానికుని ద్వారాగాని (ఆదికాండము 40:5-11; దానియేలు 2:45; 4:19). దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అతడు ఖచ్చితముగా ఆయన వర్తమానము మనకు అర్థమయ్యేలా చేయును.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

క్రైస్తవ కలల వ్యాఖ్యానం? మన కలలు దేవుని యొద్దనుండేనా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries