settings icon
share icon
ప్రశ్న

నా స్నేహితులను మరియు కుటుంబమును ఖండించకుండా లేక వారిని దూరముగా నెట్టకుండా ఎలా సువార్తీకరించగలను?

జవాబు


ఏదో ఒక చోట, ప్రతి క్రైస్తవునికి క్రైస్తవుడు కాని ఒక కుటుంబ సభ్యుడు, ఒక స్నేహితుడు, సహపనివాడు, లేక పరిచయస్తుడు ఉండును. ఇతరులతో సువార్త పంచుకోవడం కష్టముగా ఉండును, మరియు అదే మనకు దగ్గరి భావోద్వేగ సంబంధమున్న ఎవరికైన అయితే ఇంకా కష్టముగా మారును. కొంతమంది ప్రజలు సువార్తకు విరోధముగా వుందురని బైబిలు చెప్పును (లూకా 12:51-53). అయితే, మనకు సువార్త ప్రకటించాలని ఆజ్ఞాపింప బడెను, మరియు అలాచేయకుండా ఉండుటకు మినహాయింపు లేదు (మత్తయి 28:19-20; అపొ 1:8; 1 పేతురు 3:15).

మనము మన కుటుంబ సభ్యులను, స్నేహితులను, సహపనివారిని, మరియు పరిచయస్తులను ఎలా సువార్తీకరించగలము? మనము చేయగలిగే చాలా ముఖ్యమైన విషయం వారికోసం ప్రార్థించటం. దేవుడు వారి హృదయాలను మార్చి మరియు వారి కళ్ళను సువార్త సత్యమునకు తెరవాలని ప్రార్థించాలి. దేవుడు వారిపట్ల తన ప్రేమకు ఒప్పింపబడి మరియు యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడుట అవసరమని ప్రార్థించాలి (యోహాను 3:16). వారికి మంచిగా పరిచర్య చేయుటకు జ్ఞానము కొరకు ప్రార్థించాలి (యాకోబు 1:5).

మనము నిజముగా సువార్త బోధించుటకు సిద్ధపడి మరియు ధైర్యముగా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా రక్షణ సువార్తను మీ స్నేహితులకు మరియు కుటుంబమునకు ప్రకటించాలి (రోమా 10:9-10). సాత్వికముతోను మరియు భయముతోను మీ విశ్వాసము గూర్చి మాటలాడుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండుము (1 పేతురు 3:15). వ్యక్తిగతంగా సువార్త ప్రకటించుటకు ప్రత్యామ్నాయం లేదు: “కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును” (రోమా 10:17).

మన విశ్వాసమును పంచుకొని మరియు ప్రార్థించుటకు తోడుగా, మనము మన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ముందు దేవుడు మనలో చేసిన మార్పును చూచుటకు దైవభక్తిగల క్రైస్తవ జీవితమును జీవిస్తూ ఉండాలి (1 పేతురు 3:1-2). చివరికి, మన సంబంధుల రక్షణ దేవునికి విడిచిపెట్టాలి. మన ప్రయత్నములు కాదు కాని, ఆ ప్రజల రక్షణ దేవుని శక్తి మరియు కృప. మనము చేయగలిగే మంచి వారికోసం ప్రార్థించడం, వారికి సాక్షులుగా ఉండడం, మరియు వారిముందు క్రైస్తవ జీవితమును జీవించడం. వృద్ధి కలుగజేసినవాడు దేవుడే (1 కొరింథీ 3:6).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నా స్నేహితులను మరియు కుటుంబమును ఖండించకుండా లేక వారిని దూరముగా నెట్టకుండా ఎలా సువార్తీకరించగలను?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries