settings icon
share icon
ప్రశ్న

రక్షణ కేవలం విశ్వాసం ద్వారానేనా, లేక విశ్వాసం మరియు క్రియల ద్వారానా?

జవాబు


క్రైస్తవ వేదాంతమంతటిలో ఇది అతి ప్రాముఖ్యమైన ప్రశ్న కావచ్చు. ఈ ప్రశ్న పునరుద్ధరణకు, ప్రొటెస్టెంట్ సంఘములు మరియు కాథలిక్ సంఘము మధ్య విభజనకు కారణమైయ్యింది. బైబిల్ క్రైస్తవ్యమునకు మరియు అనేక “క్రైస్తవ” అబద్ధ బోధ వ్యవస్థలకు మధ్య ఈ ప్రశ్న ముఖ్యమైన బేధముగా ఉంది. “రక్షణ కేవలం విశ్వాసం ద్వారానేనా, లేక విశ్వాసం మరియు క్రియల ద్వారానా?” నేను కేవలం యేసును నమ్ముట ద్వారానే రక్షణ పొందానా, లేక నేను యేసును నమ్మి కొన్ని కార్యములు చేయవలసియుందా?

విశ్వాసం మాత్రమే లేక విశ్వాసం మరియు క్రియలు అనే ప్రశ్న కొన్ని సమాధానపడుటకు కష్టమైన బైబిల్ భాగముల వలన కష్టమవుతుంది. రోమా. 3:28, 5:1 మరియు గలతీ. 3:24లను యాకోబు 2:24తో పోల్చిచూడండి. కొందరు పౌలు (విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ) మరియు యాకోబు (విశ్వాసం మరియు క్రియల ద్వారా రక్షణ) మధ్య బేధమును చూస్తారు. విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట అని పౌలు సిద్ధాంతపరంగా చెబుతాడు (ఎఫెసీ. 2:8-9), కాని నీతిమంతులుగా తీర్చబడుట క్రియలు మరియు విశ్వాసం ద్వారా అని యాకోబు చెబుతాడు. యాకోబు ఖచ్చితంగా ఏమి మాట్లాడుతున్నాడు అని పరీక్షించుట ద్వారా ఈ సమస్యకు పరిష్కారం పొందవచ్చును. ఎలాంటి సత్ క్రియలు లేకుండా ఒక వ్యక్తి విశ్వాసమును కలిగియుండగలడు అను నమ్మకమును యాకోబు ఖండిస్తున్నాడు (యాకోబు 2:17-18). క్రీస్తునందు నిజమైన విశ్వాసం మార్పుపొందిన జీవితమును మరియు సత్ క్రియలను కలిగిస్తుందని యాకోబు వక్కాణించుచున్నాడు (యాకోబు 2:20-26). నీతిమంతులుగా తీర్చబడుట క్రియలు మరియు విశ్వాసం ద్వారా సాధ్యమని యాకోబు చెప్పుట లేదు, కాని నిజముగా విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి తన జీవితంలో సత్ క్రియలు కలిగియుంటాడు. ఒక వ్యక్తి విశ్వాసి అని చెప్పుకొనుచు, అతడు/ఆమె జీవితంలో సత్ క్రియలు లేని యెడల, అతనికి/ఆమెకి క్రీస్తులో నిజమైన విశ్వాసం లేనట్లే (యాకోబు 2:14, 17, 20, 26).

పౌలు కూడ తన రచనలలో ఇదే విషయం చెబుతున్నాడు. విశ్వాసులు తమ జీవితాలలో కలిగియుండవలసిన మంచి ఫలము గలతీ. 5:22-23లో వ్రాయబడియున్నది. మనం క్రియల ద్వారా గాక, విశ్వాసం ద్వారా రక్షణ పొందితిమని చెప్పిన వెంటనే (ఎఫెసీ. 2:8-9), మనం సత్ క్రియలు చేయుటకు సృష్టించబడితిమని పౌలు మనకు సమాచారం ఇస్తున్నాడు (ఎఫెసీ. 2:10). యాకోబు వలెనె పౌలు కూడ మార్పు చెందిన జీవితమును ఆశించుచున్నాడు: “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను” (2 కొరింథీ. 5:17). రక్షణను గూర్చిన తమ బాధలో పౌలు మరియు యాకోబు అసమ్మతి చూపుట లేదు. వారు ఒకే అంశమును వేర్వేరు దృష్టికోణాలలో చూస్తున్నారు. నీతిమంతులుగా తీర్చబడుట విశ్వాసం ద్వారా మాత్రమే అని పౌలు చెబుతుండగా క్రీస్తుయందలి నిజమైన విశ్వాసం సత్ క్రియలను ఉత్పత్తి చేస్తుందని యాకోబు చెబుతున్నాడు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

రక్షణ కేవలం విశ్వాసం ద్వారానేనా, లేక విశ్వాసం మరియు క్రియల ద్వారానా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries