ప్రశ్న
దేవునిలో విశ్వాసం మరియు విజ్ఞానము విరుద్ధమా?
జవాబు
విజ్ఞానము “పరిశీలన, గుర్తింపు, వర్ణణ, ప్రయోగాత్మక విచారణ, మరియు దృగ్విషయం యొక్క వివరణ” గా నిర్వచింపబడును. సహజ విశ్వము యొక్క గొప్ప అర్ధమును పొందుటకు మానవాళికి విజ్ఞానము ఒక పద్దతిగా ఉపయోగపడును. అది పరిశీలన ద్వారా జ్ఞానము కొరకు వెదకుట. విజ్ఞానములో పురోగమనాలు మానవుని తార్కిక మరియు ఊహను చేరుటను ప్రదర్శించును. అయితే, విజ్ఞానములో ఒక క్రైస్తవుని నమ్మిక దేవునిలో మన నమ్మికవలే ఉండకూడదు. ఒక క్రైస్తవునికి దేవునిలో నమ్మిక మరియు విజ్ఞానముపై గౌరవం, ఏది సరియైనదో మరియు ఏది కాదో మనము గుర్తించుకొనేవరకు కలిగియుండాలి.
దేవునిలో మన నమ్మిక ఒక విశ్వాస నమ్మిక. మనకు రక్షణ కొరకు ఆయన కుమారునిలో విశ్వాసం, సూచన కొరకు ఆయన వాక్యములో విశ్వాసము, మరియు నడిపింపు కొరకు పరిశుద్ధాత్మలో విశ్వాసం ఉండెను. దేవునిలో మన విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి, మన విశ్వాసం దేవునిలో వుంచడం వలన, మనము ఒక ఖచ్చితమైన, సర్వశక్తిగల, సర్వజ్ఞానియైన సృష్టికర్తపై ఆధారపడుదము. విజ్ఞానములో మన నమ్మకము తెలివికలిగియుండాలి మరియు అంతకన్నా ఎక్కువకాకూడదు. విజ్ఞానమును బట్టి మనము చాలా గొప్ప విషయాలు చేయవచ్చు, కాని విజ్ఞానము బట్టి మనము తప్పులు కూడా చేయవచ్చు. ఒకవేళ మన విశ్వాసము విజ్ఞానములో ఉంచితే, మనము సరికాని, పాప, పరిమిత, నైతిక పురుషులపై ఆధారపడుదుము. విజ్ఞానము చరిత్ర అంతటిలో చాలా విషయాలను బట్టి తప్పు, భూమి ఆకారము, శక్తిగలిగిన విమానము, వాక్సిన్స్, రక్తమార్పిడులు, మరియు ఇంకా పునరుత్పత్తి లాంటివి. దేవుడు ఎన్నడూ తప్పు కాదు.
సత్యము ఏమిటంటే భయపడవలసినది ఏమిలేదు, అందువలన ఒక క్రైస్తవుడు మంచి విజ్ఞానమునకు భయపడుటకు కారణం లేదు. దేవుడు మన విశ్వమును సృష్టించిన విధానము గూర్చి మరిఎక్కువ నేర్చుకొనుట మానవాళి అంతా సృష్టి యొక్క అద్భుతాన్ని ప్రశంసించేలా చేయును. మన జ్ఞానమును విస్తరించుకొనుట మనము అనారోగ్యము, అజ్ఞానము, మరియు అపార్ధముతో పోరాటము చేయుటకు సహాయపడును. అయితే, ఎప్పుడైతే శాస్త్రవేత్తలు తమ విశ్వాసమును మన సృష్టికర్త కంటే ఎక్కువగా మానవ తార్కికముపై వుంచునో అప్పుడు అక్కడ ప్రమాదం ఉండును. ఈ వ్యక్తులు ఎవరైనా ఒక మతానికి అంకితమైనట్లుగా వుంటే వారికి వ్యత్యాసము కాదు; వారు విశ్వాసమును మనుష్యునిలో ఎన్నుకొని మరియు ఆ విశ్వాసమును రక్షించుటకు వాస్తవాలు కనుగొనును.
ఇప్పటికీ, చాలావరకు హేతుబద్ధ శాస్త్రవేత్తలు, దేవుని నమ్ముటకు తృణీకరించిన వారు కూడా, విశ్వమును అర్ధము చేసికొను సంపూర్ణత కొదువుగా వుందని ఒప్పుకొనును. వారు దేవుడు కాని బైబిలు కాని విజ్ఞానము ద్వారా నిరూపించబడడం లేక నిరూపించలేకపోవడం సాధ్యం కాదని ఒప్పుకొనును, ఎలాగైతే వారికి ఇష్టమైన సిద్ధాంతాలు చివరికి చాలావరకు నిరూపించడం లేక నిరూపించలేకపోవడం జరగలేదు. విజ్ఞానము నిజముగా తటస్థ క్రమశిక్షనగా చెప్పబడి, కేవలం సత్యమును వెదుకుచు, కాని ముందస్తు ప్రణాళిక లేకుండా వుంది.
విజ్ఞానములో చాలా వరకు దేవుని ఉనికికి మరియు పనికి మద్దతునిచ్చును. కీర్తనలు 19:1 చెప్పును, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” ఆధునిక విజ్ఞానము విశ్వము గూర్చి మరింతగా కనిపెట్టుచుండగా, మనము సృష్టికి మరింత ఆధారము కనుగొనుచున్నాము. DNA యొక్క ఆశ్చర్యమైన సంక్లిష్టత మరియు ప్రతికృతి, భౌతికశాస్త్ర జటిల మరియు ముడిపడే నియమాలు, మరియు షరతుల యొక్క ఖచ్చితమైన సామరస్యం మరియు భూమిమీద రసాయన శాస్త్రం అన్నియు బైబిలు యొక్క వర్తమానమునకు పనిచేసి మద్ధతిచ్చును,. ఒక క్రైస్తవుడు సత్యమును కనుగొనే విజ్ఞానమునకు హత్తుకొనవలెను, కాని “విజ్ఞాన పూజారులు” ఎవరైతే మానవ జ్ఞానమును దేవునికి పైగా వుంచునో వారిని తిరస్కరించాలి.
English
దేవునిలో విశ్వాసం మరియు విజ్ఞానము విరుద్ధమా?