ప్రశ్న
క్రైస్తవుల ఋణము గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? అప్పు ఇవ్వడం మరియు తీసుకోవడం తప్పా?
జవాబు
రోమా 13:8లో మన పట్ల పౌలు యొక్క ఆజ్ఞ ఏంటంటే ఏమియు అచ్చియుండవద్దు కాని ప్రేమ అనేది సమయానికి చెల్లించని రుణాల యొక్క అన్ని రూపాలు పట్ల దేవుని యొక్క అయిష్టతకు శక్తివంతమైన గుర్తింపు (కీర్తనలు 37:21 చూడండి). అదే సమయంలో, అన్ని రుణాలకు రకాలకు వ్యతిరేకంగా బైబిల్ స్పష్టంగా నిష్క్రమణను తెలియజేయదు. బైబిల్ అప్పుకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది, మరియు అప్పు తీసుకొనని ధర్మమును పొగడుతుంది, కానీ అప్పును నిషేదించదు. అప్పుతీసుకొన్నవారిని నిందించువారికి అనగా రుణదాతలకు బైబిల్ లో కఠినమైన మాటలు ఉన్నాయి, కానీ ఋణస్తులను ఖండించదు.
అప్పుకు వడ్డీని కొంతమంది ప్రజలు ప్రశ్నిస్తారు, కానీ అనేకమార్లు బైబిల్ లో న్యాయమైన వడ్డీ ఋణాలు స్వీకరించబడుతుంది (సామెతలు 28:8; మత్తయి 25:27). ప్రాచీన ఇశ్రాయేలులో అప్పుపై వడ్డీని ధర్మశాస్త్రం నిష్క్రమించింది – ఇవి ప్రజలను బీదలుగా చేసాయి (లేవీ. 25:35-38). ఈ ధర్మశాస్త్రమునకు సాంఘిక, ఆర్థిక, మరియు ఆత్మీయ అంతర్భావం ఉంది, కానీ ప్రత్యేకంగా రెండు ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. మొదట, ధర్మశాస్త్రం పేదలకు సహాయం చేసింది వారి పరిస్థితిని మరింత అధ్వాన్నం చేయకుండా. పేదరికంలోకి పడిపోవడం చాల దరిద్ర పరిస్థితి, మరియు సహాయం కోరుకోనుటకు అది అవమానకరం కావచ్చు. కానీ, తీసుకున్న అప్పును చెల్లించుటకు అదనంగా ఒక పేద వ్యక్తి తనను అణచివేసే వడ్డీని చెల్లించుట, అనేది సహాయపడుట కంటే మరింత బాధాకరంగా ఉంటుంది.
రెండవదిగా, ధర్మశాస్త్రం ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠమును బోధిస్తుంది. ఒక పేద వ్యక్తికి రుణంపై వడ్డీని రుణదాత విడిచిపెట్టినట్లైతే అది దయగల చర్యగా ఉంటుంది. దానిని అరువుగా ఇచ్చిన సమయంలో ఆ డబ్బును ఉపయోగించుటను ఇతడు కోల్పోతాడు. ఇంకా ఆయన దయ వలన దేవునికి కృతజ్ఞత వ్యక్తం చేయుటకు పరిగణింపబడే మార్గం ఎందుకంటే వారి పట్ల ఆయన పొడిగించిన కృపకు “వడ్డీ” లేకుండుటవలన. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నిరుపేద బానిసలుగా ఉన్నప్పుడు దయతో దేవుడు వారిని బయటకు తెచ్చి వారికి ఒక సొంత భూమిని దయచేశాడు (లేవీ. 25:38), కాబట్టి తమ సొంత పేద పోరుల పట్ల అదే దయను ప్రదర్శించాల్సిందిగా ఆయన కోరుతున్నాడు.
క్రైస్తవులు సమమైన పరిస్థితిలో ఉన్నారు. యేసు యొక్క జీవ, మరణ, మరియు పునరుత్థానం మన పాపముల ఋణమును దేవునికి చెల్లించాయి. ఇప్పుడు, మనకు అవకాశం ఉండగా, అవసరతలోనున్న వారికీ, ప్రత్యేకంగా తోటి విశ్వాసులకు, వారి సమస్యలు తీవ్రమవ్వకుండా సహాయపడాలి. ఈ వరుసలను అనుసరించి యేసు ఇద్దరు రుణదాతల మరియు క్షమాపణ పట్ల వారి కృతజ్ఞత యొక్క ఉపమానం చెప్పాడు (మత్తయి 18:23-35).
ఋణమును అంగీకరించుటను బైబిల్ స్పష్టంగా నిషేదించదు లేదా నిష్క్రమించదు. బైబిల్ హ=జ్ఞానం మనకు యేమని చెప్తుందంటే అప్పులోకి వెళ్లడం మంచి ఆలోచన కాదు. రుణం రుణదాతకు అప్పుతీసుకొన్నవారిని బానిసలుగా చేస్తుంది. అదే సమయంలో, కొన్ని పరిస్థితుల్లో అప్పు తీసుకోవడం “అవసరమైన అరిష్ట.” డబ్బును జ్ఞానంగా వినియోగించినంతకాలం మరియు రుణ చెల్లింపులు నిర్వహించుట వీలుగా ఉన్నంతకాలం, ఇది ఒకవేళ ఖచ్చితంగా అవసరమైతే ఆర్థిక రుణ భారం పొందవచ్చు.
English
క్రైస్తవుల ఋణము గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? అప్పు ఇవ్వడం మరియు తీసుకోవడం తప్పా?