ప్రశ్న
జూదం పాపమా? జూదమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?
జవాబు
బైబిల్ విశేషంగా జూదం, పందాలు, లేక లాటరీలను ఖండించదు. ధనాశ నుండి దూరంగా ఉండమని మాత్రం బైబిల్ మనలను హెచ్చరిస్తుంది (1 తిమోతి 6:10; హెబ్రీ 13:5). “త్వరగా ధనవంతులవ్వాలనే” ప్రయత్నాల నుండి మనం దూరంగా ఉండాలని లేఖనం మనలను ప్రోత్సహిస్తుంది (సామెతలు 13:11; 23:5; ప్రసంగి 5:10). జూదం నిశ్చయంగా ధనాశ మీద దృష్టి కలిగియుంది మరియు నిశ్చయంగా త్వరగా ధనమును సంపాదించాలనే వాగ్దానముతో ప్రజలను శోధిస్తుంది.
జూదంలోని సమస్య ఏమిటి? జూదం అనేది ఒక కష్టమైన సమస్య ఎందుకంటే అది కొన్ని సార్లు జాగ్రత్తగా చేసినయెడల, అది ధనమును వ్యర్థము చేయుటేగాని, అది దుష్టత్వము కాకపోవచ్చు. ప్రజలు వారి డబ్బును అనేక విధాలుగా దురుపయోగం చేస్తారు. ఒక మూవీ చూడడం (చాలా సార్లు), అనవసరమైన విలువైన భోజనం చేయుట, లేక అవసరం లేని వస్తువులను కొనుటలో ప్రజలు డబ్బును దురుపయోగం చేయుట జూదం కంటె తక్కువేమీ కాదు. అదే సమయంలో, ఇతర విషయాలలో డబ్బును వ్యర్థం చేయుట జూదమును సమర్థించదు. డబ్బును వృద్ధా చెయ్యకూడదు. అధిక సొమ్ము భవిష్యత్తులో అవసరతల కొరకు దాచిపెట్టాలి లేక దేవుని పని కొరకు ఇవ్వాలి, జూదంలో వృద్ధా చేయకూడదు.
బైబిల్ స్పష్టంగా జూదమును గూర్చి ప్రస్తావించనప్పటికీ, అది “అదృష్టం” లేక “అవకాశము”ను గూర్చి ప్రస్తావిస్తుంది. ఉదాహరణకు, బలియార్పణ మేక మరియు పరిహారార్థ మేక మధ్య ఎన్నిక చేయుటకు లేవీయకాండములో చీట్లు వేయుట ఉపయోగించేవారు. వివిధ గోత్రముల వారికి భూమిని కేటాయించుటకు యెహోషువ చీట్లు వేశాడు. యెరూషలేము ప్రాకారముల లోపల ఎవరు జీవిస్తారో నిర్థారించుటకు నెహెమ్యా చీట్లు వేశాడు. యూదా స్థానంలో శిష్యుని ఎన్నుకొనుటకు అపొస్తలులు చీట్లు వేశారు. “చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము” అని సామెతలు 16:33 చెబుతుంది.
కెసినో మరియు లాటరీలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? కెసినోలు జూదగాళ్ళు తమ యొద్ద ఉన్న డబ్బు అంతా ఖర్చుపెట్టునట్లు అన్ని విధముల మార్కెట్ స్కీంలను ఉపయోగిస్తాయి. అవి చాలా సార్లు చవకైన లేక ఉచ్చిత మద్యమును ఇస్తాయి, తద్వారా వారు అధికముగా త్రాగి కొన్ని వివేకమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలను మందబుద్ధులను చేస్తుంది. గొప్ప మొత్తంలో డబ్బు వెచ్చించి ఖాళీ ఆహ్లాదం తప్ప ఏమి తిరిగి ఇవ్వకుండా ఉండునట్లు ప్రతి కెసినో రూపుదిద్దబడినది. విద్య మరియు/లేక సామజిక కార్యక్రమాలకు ఉపయోగపడునట్లు లాటరీలు తమను తాము చూపించుకొంటాయి. అయితే, లాటరీలో పాలుపంచుకొనువారు, చాలా వరకు దానికి అవసరమైన డబ్బును వెచ్చించు స్తోమత లేనివారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అవసరతలో ఉన్నవారికి “త్వరగా ధనవంతులు కావాలనే” శోధన ఎదురించదగినది కానిదిగా ఉంది. గెలిచే అవకాశములు కోటిలో ఒక శాతం కాబట్టి, చాలా మంది జీవితాలు నాశనమైపోయాయి.
లాటరీలు దేవుని ప్రసన్నపరుస్తాయా? సంఘమునకు లేక ఇతర ఉత్తమ పనులకు డబ్బు ఇవ్వడానికి లాటరీ ఆడుతున్నామని చాలా మంది ప్రజలు చెబుతారు. ఇది మంచి ఆలోచన అయినప్పటికీ, చాలా తక్కువ మంది జూదంలో గెలచిన సొమ్మును మంచి ఉద్దేశాల కొరకు ఉపయోగిస్తారు. లాటరీలో గెలచిన అనేకులు గెలచిన కొన్ని సంవత్సరాలకు వారి జీవితాలలో మునుపటి కంటే మరింత దిగజారినవారిగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. చాలా తక్కువ మంది మంచి ఉద్దేశముల కొరకు డబ్బును ఇస్తారు. ఈ లోకములో తన పరిచర్య కొరకు దేవునికి మన ధనము యొక్క అవసరత లేదు. “తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు” అని సామెతలు 13:11 చెబుతుంది. దేవుడు సర్వశక్తిమంతుడు గనుక సంఘము యొక్క అవసరతలను నిజాయితీగల మార్గములలో అందిస్తాడు. మత్తు పదార్థముల నుండి లేక దొంగిలించిన సొమ్మును ఆయనకు అర్పించుట ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? ఖచ్చితంగా కలుగదు. ధనాశతో బీదల నుండి “దొంగిలిన” సొమ్ము దేవునికి అవసరం లేదు.
“ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” అని 1 తిమోతి 6:10 మనకు చెబుతుంది. “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా” అని హెబ్రీ. 13:5 ఘోషిస్తుంది. “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు” అని మత్తయి 6:24 ప్రకటిస్తుంది.
English
జూదం పాపమా? జూదమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?