ప్రశ్న
గొప్ప ధవళ సింహాసన తీర్పు అనగానేమి?
జవాబు
ప్రకటన 20:11-15లో ఈ గొప్ప ధవళ సింహాసన తీర్పు వివరించబడింది మరియు నశించిన వారు అగ్నిగుండములో పడవేయబడుటకు మునుపు జరుగబోయే ఆఖరు తీర్పు ఇది. ఈతీర్పు సహస్రాబ్ది పాలన తరువాత మరియు సాతాను, గొప్ప మృగము మరియు అబద్ద ప్రవక్త అందరు అగ్నిగుండములో పడవేయబడిన తరువాత జరుగుతుందని ప్రకటన 20:7-15 ద్వారా మనము తెలుసుకొనగలము. తెరువబడిన గ్రంథములు (ప్రకటన 20:12) ప్రతి ఒక్కరి పనుల జాబితాను కలిగి ఉంటాయి, అవి మంచివి అయినను చెడ్డవి అయినను, ఎందుకంటే ఇప్పటి వరకు మాట్లాడబడింది, చేయబడింది, ఆఖరుకు ఆలోచించబడినది కూడా దేవునికి తెలుసు మరియు దానికి అనుగుణ్యంగానే దేవుడు వారికి ప్రతిఫలము లేదా శిక్షను కూడా ఇస్తాడు (కీర్తన 28:4; 62:12; రోమీయులకు 2:6; ప్రకటన 2:23; 18:6; 22:12).
ఈ సమయములోనే, మరొక గ్రంథము తెరువబడుతుంది, దీనినే“జీవ గ్రంథము” అంటారు(ప్రకటన 20:`12). ఒక వ్యక్తి దేవునితో నిత్య జీవితమును పొందుతాడా లేక అగ్నిగుండములో నిత్య శిక్షను అనుభావిస్తాడా అనేది ఈ పుస్తకమే నిర్ణయిస్తుంది. వారి క్రియలను బట్టి క్రైస్తవులు ఉత్తరవాదులుగా ఉన్నప్పటికీ, వారు క్రీస్తులో క్షమించబడినవారు మరియు “జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు” (ప్రకటన 17:8) వారిపేర్లు వ్రాయబడియున్న వారుగాను ఉన్నారు. ఈ తీర్పులోనే మృతులు కూడా “తమ క్రియలనుబట్టి తీర్పు” (ప్రకటన 20:12) పొందుతారు అనియుమరియు“ఎవరి పేరైనను” ఈ“జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల” వారు“అగ్నిగుండములో పడవేయబడును” అనికూడా లేఖనముల ద్వారా మనము తెలుసుకొనుచున్నాము (ప్రకటన 20:15).
మనుష్యులందరికి, అంటే విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు కూడా, ఒక అంత్య తీర్పు ఉండబోతుంది అనే సత్యము లేఖనములలోని అనేక వాక్యభాగములలో స్పష్టముగా ధృఢపరచబడింది. ప్రతిఒక్క వ్యక్తి ఒక దినమున క్రీస్తు ముందు నిలువబడి అతని లేదా ఆమె క్రియలను బట్టి తీర్పుతీర్చబడతారు. ఈ గొప్ప ధవళ సింహాసన తీర్పు ఆఖరు తీర్పు అనే విషయము స్పష్టముగానే ఉండి ఉండగా, పరిశుద్ధగ్రంథములో పేర్కొనబడిన ఇతర తీర్పులతో, ప్రత్యేకముగా ఈ గొప్ప ధవళ సింహాసన తీర్పులో ఎవరు తీర్పు తీర్చబడతారు అనే విషయములపై క్రైస్తవులు ఒక అంగీకారముతో లేరు.
లేఖనములు అసలు రాబోవుచున్న మూడు విధములైన తీర్పులను గూర్చి మాట్లాడుతున్నాయి అని కొందరు క్రైస్తవులు నమ్ముతారు. మొదటిది గొఱ్ఱెలను మరియు మేకలను గుర్తించు తీర్పు, లేదా జనముల తీర్పు (మత్తయి 25:31-36). ఇది శ్రమల కాలము తరువాత సహస్రాబ్ది పరిపాలనకు మునుపు జరుతుగుంది; దీనిఉద్దేశ్యముసహస్రాబ్ది రాజ్యములోనికి ప్రవేశించుటకు ఎవరు అర్హులు తెలుసుకొనుటకు. రెండవ తీర్పు విశ్వాసుల యొక్క క్రియలను గూర్చింది, దీనినే తరచూ “క్రీస్తున్యాయపీఠము [బేమా]” అని అంటారు. ఈ తీర్పులో, వారి క్రియలు మరియు దేవునికి వారు చేసిన సేవను బట్టి క్రైస్తవులు ప్రతిఫలములు కొలత ప్రకారము పొందుతారు. మూడవది సహస్రాబ్ది పాలనకు తరువాత జరిగే ఈ గొప్ప ధవళ సింహాసన తీర్పు (ప్రకటన 20:11-15). ఇది అవిశ్వాసుల యొక్క తీర్పు ఈ తీర్పులోనే వారు తమ క్రియలను బట్టి తీర్పుతీర్చబడి అగ్నిగుండములో నిత్యమైన శిక్షకు అప్పగించబడతారు.
ఈ మూడు వివిధ తీర్పులు నిజానికి వేరువేరు తీర్పులు కావని ఇవన్నీ ఒకే అంతిమ తీర్పును సూచిస్తున్నాయి అని మరికొంతమంది క్రైస్తవులు నమ్ముతారు. వేరే విధంగా చెప్పాలంటే, ప్రకటన 20:11-15లో ఉన్న గొప్ప ధవళ సింహాసన తీర్పు విశ్వాసులును అవిశ్వాసులును కూడా ఏకకాలంలో తీర్పుతీర్చబడే సమయము అని దీని భావం. జీవగ్రంథమందు ఎవరి పేరులు వ్రాయబడినట్టు కనబడునో వారి క్రియలను బట్టి తీర్పుతీర్చబడి వారు పొందుకొనే లేదా కోల్పోయేప్రతిఫలములను గూర్చి ఇక్కడ నిర్ణయించబడుతుంది. అయితే జీవగ్రంథమందు ఎవరి పేరులు వ్రాయబడినట్టు కనబడవో వారు కూడా వారి క్రియలను బట్టి తీర్పుతీర్చబడి అగ్నిగుండములో వారు అనుభవించబోయే శిక్ష యొక్క పరిమాణము ఇక్కడ నిర్ణయించబడుతుంది.ఈ దృక్పథమును అనుసరించేవారు గొప్ప ధవళ సింహాసన తీర్పులో జరుగబోయే సంగతులకు మత్తయి 25:31-46లోని వివరణ మారు వివరణ అని విశ్వసిస్తారు. ఈ తీర్పు యొక్క ఫలితము ప్రకటన 20:11-15లోని గొప్ప ధవళ సింహాసన తీర్పులో చూడగలిగే ఫలితము వలెనే ఉంటుందనే విషయాన్ని వారు సూచిస్తారు.గొఱ్ఱెలు (విశ్వాసులు) నిత్యజీవములోనికి ప్రవేశించగా, మేకలు(అవిశ్వాసులు) మాత్రము“నిత్యశిక్ష” లోనికి ప్రవేశిస్తారు (మత్తయి 25:46).
గొప్ప ధవళ సింహాసన తీర్పు విషయములో ఎవరు ఏ సిద్ధాంతమును నమ్మినప్పటికి, రాబోవుచున్న ఈ తీర్పు(ల)ను గూర్చిన సత్యాలను ఒకరు మర్చిపోకుండా ఉండుట చాలా ప్రాముఖ్యం.మొదటిది, యేసు క్రీస్తు తీర్పరి, క్రీస్తుచే అవిశ్వాసులందరూ తీర్పుతీర్చబడతారు, మరియు వారు చేసిన క్రియలను బట్టి వారు శిక్షించబడతారు. అవిశ్వాసులైన వారు తమ కొరకు ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు (రోమీయులకు 2:5)మరియు దేవుడు“ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును” (రోమీయులకు 2:6)అని పరిశుద్ధగ్రంథము స్పష్టముగా చెప్తుంది. విశ్వాసులు కూడా క్రీస్తు ద్వారా తీర్పుతీర్చబడతారు, కాని క్రీస్తు యొక్క నీతి మనకు ఆపాదించబడినది గనుకను మరియు మన పేరులు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి గనుకను, మనము మన క్రియలను బట్టి శిక్షింపబడక ఫలమును పొందుతాము. క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట మనమందరమూ నిలువబడతాము మరియు మనమందరమూ దేవునికి లెక్క యొప్పగిస్తాము అని రోమీయులకు 14:10-12 తెలియజేస్తుంది.
English
గొప్ప ధవళ సింహాసన తీర్పు అనగానేమి?