నరకమనునది వాస్తవమేనా? నరకము నిత్యత్వమేనా?ప్రశ్న: నరకమనునది వాస్తవమేనా? నరకము నిత్యత్వమేనా?

జవాబు:
మెచ్చుకోదగిన విషయమేమంటే చాలా శాతం ప్రజలు నరకము ఉంటుందని అని నమ్మేదానికంటే పరలోకము ఉనికిలో ఉన్నది అని విశ్వసించుతారు. బైబిలు ప్రకారము, అయినప్పటికిని, నరకము ఎంత వాస్తవమో అంతే పరలోకముకూడా నిజమైనది. బైబిలు స్పష్టముగా మరియు విశ్లేషించి నమ్మేదేంటంటే నరకమనేది నిజమైన స్తలము , అందులో దుష్టులు/ అపనమ్మకస్థులు వారి మరణము తర్వాత జీవించే స్థలము. మనమందరం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాం (రోమా3:23). పాపమునకు న్యాయమైన శిక్ష మరణము (రోమా 6:23). ఎందుకంటే మనపాపమంతయు అంతిమంగా దేవునికి వ్యతిరేకమైనది (కీర్తన 51:4), కాబట్టి దేవుడు అనంతుడు మరియు నిత్యమైన అస్థిత్వం కలిగినవాడు, పాపమునకు శిక్ష, మరణము, ఇదికూడా నిత్యత్వమైఅయుంటుంది. నరకము అనంతమైనది మరియు నిత్యమరణము అది మనము పాపము చేయుటవలన సంపాదించిన స్వాస్థ్యము.

దుష్టునికి శిక్ష మరణము నరకములోనని లేఖనభాగమంతయు వివరించబడింది అదే"నిత్య అగ్ని" (మత్తయి25:41), “ఆరని అగ్ని (మత్తయి 3:12), “నిందపాలగుటకు నిత్యముగా హేయులగుటకు” (డనిఎల్ 12:2), ఆ స్థలమున "అగ్ని ఆరదు" (మార్కు 9:44-49), "అగ్ని జ్వాలలతో' మరియు "యాతనము పడుస్థలము" (లూకా 16:23-24), “నిత్యనాశనమను దండన పొందేస్థలము ” (2 ధెస్సలోనికయులకు 1:9), “భాధ సంభంధమైన పొగ యుగయుగములు లేస్తూ ఊండే స్థలము" (ప్రకటన 14:10-11), మరియు “అగ్ని గంధకముల గుండములో” అక్కడ దుష్టులు ఉంటూ “యుగయుగములు రాత్రింబగళ్ళు భాధింపబడుదురు" (ప్రకటన 20:10).

పరలోకములో నీతిమంతులకుండే మహిమ ఎన్నడు అగ్గకుండా ఎలావుంటుందో అలానే నరకములో దుష్టునికి శిక్ష కూడా ఎన్నటికి ఆగకుండావుండేది. యేసు తానే నరకములో వుండే శిక్ష ఎంతో నిత్యమూవుండే పరలోకములో వుండే జీవితము వలెవుంటుంది అని సూచిస్తుంది (మత్తయి 25:46). దుష్టులు ఎన్నడూ దేవుని కోపాగ్నికి మరియు ఉగ్రతకు గురైనవారు. నరకములోనున్నవారు సంపూర్ణ న్యాయవంతుడైన దేవుని గొప్ప శక్తిని గ్రహిస్తారు (కీర్తన 76:10). నరకములో ఎవరయితే వున్నారో వారు అనుభవించే శిక్ష న్యాయమైనదని మరియు వారికి వారు చెరుపుకున్నరు గనుక మాత్రమే నిందకు యోగ్యులు (ద్వితియోపదేశకాండము 32:3-5).అవును, నరకము నిజమే, అవును, నరకమనునది యాతనలు మరియు శిక్షననుభవించే స్థలం, యుగయుగములు మరియు ఆగకుండా ఎన్నటికీ ఉండే స్థలము. దేవునికి వందనాలు, ఎందుకంటే, యేసుక్రీస్తు ద్వారా, మనము ఈ నిత్యనరకాన్ని తప్పించుకోవచ్చు (యోహాను 3:16, 18, 36).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


నరకమనునది వాస్తవమేనా? నరకము నిత్యత్వమేనా?